»   » ఆ సూపర్ హిట్ సినిమా స్పూర్తితో మైనింగ్ త్రవ్వకాలకు నిరసన

ఆ సూపర్ హిట్ సినిమా స్పూర్తితో మైనింగ్ త్రవ్వకాలకు నిరసన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం అవతార్ ఇప్పుడు నిరసనలకూ స్పూర్తిని ఇస్తోంది. ప్రకృతిని రక్షించండి అనే నినాదంతో మైనింగ్ త్రవ్వకాలను నిరసిస్తూ..చేయబోయే నిరసనలకు అవతార్ చిత్రాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఒడిషాలోని నియంగిరి కొండల్లో గనుల తవ్వకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే మానవ హక్కుల ప్రచార సంస్థ లండన్‌లో వినూత్న తరహాలో నిరసన తెలియజేయనుంది. గనుల తవ్వకం వల్ల నివాసాలతో పాటు జీవనోపాధి కోల్పోనున్న అక్కడి కోండ్ తెగ ప్రజలను 'అవతార్' సినిమాలోని పండోరా గ్రహ ప్రజలుగా, మైనింగ్ కంపెనీ 'వేదాంత'ను వారిని దోచుకునే బహుళజాతి సంస్థగా పోలుస్తూ నిరసన తెలియజేయనున్నట్టు సర్వైవల్ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలిపింది.బ్రిటన్‌కు చెందిన 'వేదాంత' షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశం ఈ నెల 28న లండన్‌లో జరగనుంది. ఈ సందర్భంగా తమ కార్యకర్తలు పండోరా గ్రహ ప్రజల వేషంలో నిరసన తెలియజేస్తారని ఆ ప్రకటన పేర్కొంది. ఓ చిత్రం ఇలా పోరాటాలకు స్పూర్తిని నిజ జీవితంలో కూడా ఇవ్వటం గొప్ప విషయమే కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu