చూపుల్తో గుచ్చి గుచ్చి.. అందరి నజర్ శ్రీదేవిపైనే
వయసుపైబడినా వన్నె తరగని శ్రీదేవి అందం తాజాగా చర్చనీయాంశమైంది. ఇటీవల ముంబైలో నటి, దర్శకురాలు దివ్యా ఖోస్లా రూపొందించిన మ్యూజిక్ వీడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన శ్రీదేవిని చూసి..
అలనాటి అందాల తార శ్రీదేవి ఇప్పటి తరం హీరోయిన్లకు పోటీ అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. వయసుపైబడినా వన్నె తరగని శ్రీదేవి అందం తాజాగా చర్చనీయాంశమైంది.

ఇటీవల ముంబైలో నటి, దర్శకురాలు దివ్యా ఖోస్లా రూపొందించిన మ్యూజిక్ వీడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన శ్రీదేవిని చూసి ఆమె అందం గురించే మాట్లాడుకున్నారట. సంప్రదాయ దస్తుల్లో హాజరైన ఈ ముద్దుగుమ్మ అందాన్ని చూసి చూపు తిప్పకోలేకపోయారట. ఆమె దుస్తులను అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. అందమైన దుస్తులు, ఆభరణాలతో ముస్తాబైన శ్రీదేవి ఆ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

యారియాన్, సనమ్ రే చిత్రాలతో నటిగా పరిచయమైన దివ్య కోస్లా దర్శకురాలిగా మారింది. ఆమె తాజాగా కభీ యాదోం మే అనే మ్యూజిక్ ఆల్బంను రూపొందించారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











