Happy Birthday NBK: బాలయ్యతో ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్.. పుట్టినరోజు స్పెషల్ విషెస్ అందిస్తూ..
నందమూరి బాలకృష్ణ కేవలం స్టార్ హీరోగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా కూడా గుర్తింపు అందుకున్నాడు. అందుకే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా బాలయ్యతో దిగిన ఫొటో పోస్ట్ చేస్తూ విషెస్ అందించడం వైరల్ గా మారింది.

ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే
ప్రస్తుతం సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన 61 వసంతంలోకి అడుగుపెట్టినప్పటికి ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే యాక్టివ్ గా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

యువరాజ్ సింగ్ బర్త్ డే విషెస్
అభిమానుకు నుంచి మాత్రమే కాకుండా రాజకీయ నాయకుల నుంచి అలాగే ఇతర ఇంటర్నేషనల్ లెవెల్ సెలబ్రెటీలు సైతం బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

2015లో దిగిన ఫొటో
నందమూరి బాలకృష్ణ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వినోదాత్మక సినిమాలతో అలాగే మానవతా కార్యకలాపాలతో ప్రపంచాన్ని ఇలానే ప్రేరేపించాలని కోరుకుంటున్నట్లు యువరాజ్ సింగ్ విషెస్ అందించాడు. అలాగే 2015లో బాలకృష్ణతో దిగిన ఫొటోను కూడా యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు.

అప్పట్లో యువరాజ్ సింగ్ ఎందుకు కలిశాడంటే..
బాలయ్యను యువరాజ్ సింగ్ ఎందుకు కలిశారు అంటే.. అప్పట్లో యువరాజ్ సింగ్ క్యాన్సర్ చికిత్స నుంచి కోలుకున్న అనంతరం క్యాన్సర్ బాధితులకు తనవైపు నుంచి సపోర్ట్ అందేలా you we can అనే లైన్ తో బాధితులకు అండగా నిలుస్తున్నాడు. అలాగే ఒకసారి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి తెలుసుకొని బలయ్యతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ విదంగా బాలకృష్ణ , యువరాజ్ సింగ్ ఏకమయ్యారు.


Click it and Unblock the Notifications











