»   » వావ్..! ఇండియా నుంచే మొదటి సారి.. ఫోర్బ్స్ టాప్ 10 లో దీపికా పదుకొణే

వావ్..! ఇండియా నుంచే మొదటి సారి.. ఫోర్బ్స్ టాప్ 10 లో దీపికా పదుకొణే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలివుడ్ నుంచి హాలీవుడ్ వరకూ వెళ్ళి అక్కడ కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ దీపిక పదుకుణే ప్రతిష్ఠాత్మక ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో దీపిక పదో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ నుంచి ఫోర్బ్స్ మేగజైన్ కు ఎక్కిన తొలి హీరోయిన్ కూడా దీపికానే.

సినిమాల ద్వారా ఏడాదికి దీపీక సంపదన ఎంతో తెలుసా??? అక్షరాలా 10 మిలియన్ డాలర్లట. నిజానికి దీపిక కంటే ముందు 'బేవాచ్' అనే మూవీ ద్వారా హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియాంక చోప్రాకు ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కుతుందని ఊహించారు. కానీ అంచనాలని తలకిందులు చేస్తూ ప్రియాంక ని వెనక్కి నెట్టేసింది ఈ బ్కాక్ బ్యూటీ.

దీపిక ప్రస్తుతం'XXX' అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది. 'బాజీరావ్ మస్తానీ', 'పికూ' సినిమాలు దీపికను పైకి తెచ్చాయి అని ఫోర్బ్ పేర్కొంది. కాగా, జెన్నిఫర్ లారెన్స్ వరుసగా రెండో ఏడాది ఫోర్బ్ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. జెన్నిఫర్ వార్షిక సంపాదన 46 మిలియన్ డాలర్లు. అసలు మన దీపిక ఫోర్బ్స్ కహానీ ఏమిటీ... ఇంకా ఈ జాబితాలో ఎవరున్నారు స్లైడ్ షోలో...

ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్

ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్

స్టార్ హీరోయిన్ దీపిక పదుకుణే ప్రతిష్ఠాత్మక ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో దీపిక పదో స్థానంలో నిలిచింది.

తొలి బాలీవుడ్ హీరోయిన్

తొలి బాలీవుడ్ హీరోయిన్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ నుంచి ఫోర్బ్స్ మేగజైన్ కు ఎక్కిన తొలి హీరోయిన్ కూడా దీపికానే.

ఇండియాలోనే అత్యధిక సంపాదన

ఇండియాలోనే అత్యధిక సంపాదన

ప్రస్తుతం హాలీవుడ్ పట్టాలు కూడా ఎక్కేసిన దీపిక సంపాదన ఏ రేంజ్ లో ఉందంటే.. ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్నది ఈమే.

పదోస్థానం

పదోస్థానం

దీనిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినది ఏం లేదు కానీ.. మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన భామల్లో దీపికా పదుకొనేకి పదో స్థానం దక్కింది. ఈమె ఏడాది సంపాదన ఎంతో తెలుసా..

ఒక్క ఏడాదికే

ఒక్క ఏడాదికే

10 మిలియన్ డాలర్లు. మన రూపాయల్లో చెప్పుకుంటే.. దాదాపు 68 కోట్లు. ఇది కేవలం ఏడాది లెక్క మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

దీపికా మాత్రమే

దీపికా మాత్రమే

ఇలా ఫోర్బ్స్ లిస్ట్ లో టాప్ టెన్ లో ప్లేస్ దక్కించుకున్నది దీపికా మాత్రమే. ఇది గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 వరకూ అందుకున్న పారితోషికాల మొత్తం ఇది.

ఫోర్బ్స్‌

ఫోర్బ్స్‌

ఫోర్బ్స్‌ మొదటి వంద మంది టాప్‌ 20లో ప్రేమ్‌జీ, శివ నాడార్‌లు వున్నారు. జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు కోటీశ్వరులు విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, హెచ్‌సిఎల్‌ సహ వ్యవస్థాపకుడు శివ నాడార్‌లు స్థానం సంపాదించారు

రిచెస్ట్‌

రిచెస్ట్‌

100 రిచెస్ట్‌ టెక్‌ బిలియనీర్స్‌ ఇన్‌ ద వరల్డ్‌ 2016 ' శీర్షికతో విడుదల చేసిన జాబితాలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ 7800కోట్లతో అగ్ర స్థానంలో వున్నారు. రెండవ స్థానంలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సిఇఓ జెఫ్‌ బెజోస్‌ వున్నారని ఫోర్బ్స్‌ ప్రకటించింది. ఈ జాబితాలో 1600 కోట్లతో ప్రేమ్‌జీ 13వ స్థానంలో వుండగా, 1160కోట్లతో నాడార్‌ 17వ స్థానంలో వున్నారు.

English summary
Deepika Padukone is world's 10th highest paid actress, beats Priyanka Chopra to Forbes list
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu