»   » ‘ఊపిరి’ సినిమా కోసం...అమెరికాలో మన దేశ పరువు తీసారు!

‘ఊపిరి’ సినిమా కోసం...అమెరికాలో మన దేశ పరువు తీసారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా టిక్కెట్టు డబ్బులు మిగులుతాయని కక్కుర్తిపడ్డారు. దొరికిపోయారు. వారు చేసిన ఈ చెత్త పనికి అమెరికన్ల దృష్టిలో మన దేశ పరువు పోయింది. ఈ బేవర్స్ పని చేసింది మన తెలుగు విద్యార్థులే కావడం విచారకరం. అమెరికాలోని టెక్సాస్ లో 'ఊపిరి' సినిమాను టికెట్ లేకుండా చూస్తూ నలుగురు తెలుగు విద్యార్థులు దొరికిపోయారు.

ఇక్కడ ఓ బేవార్స్ బ్యాచ్ చాలా కాలంగా ఇలా టికెట్టు లేకుండా సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఎప్పటిలాగే 'ఊపిరి' సినిమాను కూడా అలాగే చూడటానికి వచ్చారు. వీరి వాలకంపై అనుమానం వచ్చిన థియేటర్ యాజమాన్యం చెక్ చేసారు. టికెట్ కొనలేదని తేలింది. దీంతో వీరిని పోలీసులకు అప్పగించారు. అక్కడ వారికి భారీగా జరిమానా వేసి వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టారు.

 Indian Students Arrested in US for watching Oopiri

ఈ విషయం వారు చదువుతున్న యూనివర్శిటీకి మొత్తం పాకింది. ఇండియన్ స్టూడెంట్స్ అంటే బాగా టాలెంట్ ఉన్న వారు అనే పేరు అమెరికాలో ఇప్పటి వరకు ఉండేది. ఇప్పడు ఇలాంటి వాళ్ల వల్ల మన దేశ పరువు పోయినట్లయింది. ఇకనైనా వీరు తమ పద్దతి మార్చుకోవాలని ఇతర ఇండియన్ స్టూడెంట్స్ కోరుతున్నారు.

ఊపిరి సినిమా విషయానికొస్తే... నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమాస్ వారు నిర్మించిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటేసి 2 మిలియన్ డాలర్ మార్కును అందుకునే దిశగా పరుగోడుతోంది.

English summary
Indian Students Arrested in US for watching Oopiri movie without buying a ticket.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu