twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో ఇంట్రడక్షన్‌లోనే నాలుగొందలమందిని ...

    By Srikanya
    |

    హైదరాబాద్ : త్వరలో యాక్షన్ కథాంశంతో కూడా సినిమాలు చేస్తానేమో. నేనంటూ యాక్షన్ సినిమా చేస్తే... హీరోని మాత్రం దైవాంశ సంభూతునిగా చూపించను. హీరో ఇంట్రడక్షన్‌లోనే నాలుగొందలమందిని కొట్టేయడం నా స్కూల్ కాదు. నా యాక్షన్ హీరో కూడా సాధరణ వ్యక్తే అయ్యుంటాడు. స్ట్రగుల్స్ నుంచే అతని పోరాటం మొదలవుతుంది. అసలు నా దృష్టిలో యాక్షన్ సినిమా చేయడం తేలిక. ఆప్యాయతల్ని సింపుల్‌గా తెరపై క్యారీ చేయడమే కష్టం అంటున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్ చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న ఆయన దర్శకత్వం వహించిన 'అంతకు ముందు-ఆ తరువాత' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంద్రగంటి ముచ్చటించారు.

    ''నా స్వానుభవాలతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని అన్ని అంశాలూ నా జీవితంలోనివే కాకపోయినా... కొన్ని మాత్రం జరిగాయి. అలాగే నాకు తెలిసినవాళ్ల జీవితాల్లో చోటు చేసుకొన్న కొన్ని విషయాలని కూడా తీసుకొని ఈ కథ రాసుకొన్నాను. సాధారణంగా ఎదుటివ్యక్తిని ప్రేమించాలనుకొన్నప్పుడు అన్నీ మంచి పనులే చేస్తుంటారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకూ ఇష్టం అని చెప్పుకొన్నాక.... ఆ ఇద్దరూ కలిసి గడిపే సమయం కూడా పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఒకరిగురించి మరొకరికి ఎక్కువ విషయాలు తెలుస్తుంటాయి. అవి కొన్నిసార్లు లేనిపోని భయాలు, అనుమానాలకు కారణమవుతుంటాయి.

    ఆ సమయంలోనే యువతరం ఆలోచనలో పడిపోతుంటుంది. నేను సరైన వ్యక్తినే ఎంచుకొన్నానా? నా నిర్ణయం సరైనదా కాదా? అనే సంఘర్షణకు గురవుతుంటారు. ఆ తరహా అనుభవాలతో కూడుకొన్న కథే ఇది. అనిల్‌, అనన్య అనే ఓ జంట నేపథ్యంలో సాగుతుంది. ప్రేమకథల్లో చాలావరకు తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇది తప్పు, ఇలా చెయ్‌ అని చెప్పడం చూసుంటాం. ఇందులో తల్లితండ్రుల పాత్రలు మాత్రం భిన్నంగా ఉంటాయి. వారు యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన తప్పులేమిటి? ఆ ప్రభావం పిల్లలపై ఎలా పడింది? వారి జీవితానుభవాల్ని పిల్లలతో పంచుకొనే అవసరం ఎందుకొచ్చింది? అనే అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. మొత్తంగా ప్రేమికులు, వారి తల్లిదండ్రులతో కలుపుకొని ఇది మూడు జంటల మధ్య జరిగే కథ అని చెప్పొచ్చు అని తాజా చిత్రం కథ గురించి వివరించారు.

    అలాగే... ''నేను తీసిన మొట్టమొదటి రొమాంటిక్‌ ప్రేమకథ ఇది. నేను సొంతంగా రాసుకొన్న కథతోనే ఈ సినిమాని తెరకెక్కించా. ఇదివరకు నేను తీసిన చిత్రాలు వేరొకరు ఇచ్చిన కథలతోనే తీశాను. 'అష్టాచమ్మా' చిత్రం కూడా ఓ ఇంగ్లీషు నవల స్ఫూర్తితో రాసుకొన్నదే. ఎప్పటికప్పుడు ఓ వైవిధ్యమైన కథని ఎంచుకొని ప్రయాణం చేయడమంటేనే నాకు ఇష్టం. అప్పుడే దర్శకుడికి సంతృప్తి లభిస్తుందని నమ్ముతుంటా. 'గ్రహణం' నుంచి మొదలుపెడితే నేను తీసిన చిత్రాలకు ఒకదానికొకటి ఏ మాత్రం పోలిక కనిపించదు. సొంతంగా కథని తీర్చిదిద్దుకోవడం, దానికి తగ్గ నిర్మాతని వెదుక్కోవడం, ఆ తర్వాత నటీనటులను ఎంపిక చేసుకోవడం... ఇలా నాకు ఎక్కువగానే పని ఉంటుంది. అందుకే సినిమా సినిమాకీ మధ్య విరామం తీసుకొన్నట్టు అనిపిస్తుంటుంది. ఆ విషయంపై తనికెళ్ల భరణిగారు 'హేలీ తోకచుక్కలా ఏడేళ్లకోసారి కనిపిస్తావేంటి' అంటుంటారు అని వివరించారు.

    వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో రవిబాబు, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఎస్‌.రవీందర్‌, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

    English summary
    ‘Ashta Chemma’ fame Mohan Krishna Indraganti is now directing new movie titled ‘Anthaka Mundhu Aa Tharuvatha’. MS Raju’s son Sumanth Aswin is going to play the lead role in this film, which made his debut with Tuneega Tuneega movie. A new comer Isha is acting as heroine in the film. The movie is produced by Damodar Prasad who had earlier produced ‘Ala Modhalaindi’ movie and music is given by Kalyani Malik. More details are awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X