»   » తెలుగమ్మాయి, తెలంగాణా యాస వచ్చు అందుకే ఆమె: అనుమానాలు తీరేలా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు

తెలుగమ్మాయి, తెలంగాణా యాస వచ్చు అందుకే ఆమె: అనుమానాలు తీరేలా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు ఒక హీరోయిన్ ను తన వెంట వెంట సినిమాల్లో తీసుకుంటే కచ్చితంగా ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ ఉందని అనుకుంటారు.ఒక దర్శకుడి సినిమాల్లో తరచుగా ఒకే హీరోయిన్ కనిపించినా జనాలకు లేనిపోని డౌట్లు వచ్చేస్తాయి. వాళ్ల నేపథ్యం ఏంటో కూడా చూడకుండా రకరకాల ఊహాగానాలు పుట్టించేస్తారు. సందేహాలు వ్యక్తం చేస్తారు. ఇంద్రగంటి మోహనకృష్ణ తన సినిమాల్లో ఈషాకు మళ్లీ మళ్లీ కథానాయికగా అవకాశం ఇస్తుండటంతో జనాలకు ఇలాంటి లేని పోని డౌట్లు వచ్చేశాయి.

అంతకుముందు ఆ తరువాత

అంతకుముందు ఆ తరువాత

మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమా 'అంతకుముందు ఆ తరువాత'తో ఈషా కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే 'బందిపోటు' చేసింది. ఇప్పుడు ఇంద్రగంటి నుంచి వస్తున్న 'అమీ తుమీ'లోనూ ఆమే హీరోయిన్. మొత్తంగా ఇంద్రగంటి రీసెంట్‌గా చేసిన నాలుగు సినిమాల్లో మూడింట్లో ఈషానే కథానాయిక.


 ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు

ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు

ఈషా మీద ఇంద్రగంటి చూపించే ప్రత్యేక అభిమానం గురించి మీడియా వాళ్లకు కూడా డౌట్లు వచ్చేసి.. 'అమీతుమీ'ను ప్రమోట్ చేయడం కసం వచ్చినపుడు ప్రశ్నలు గుప్పించేసారు. ఈ ప్రత్యేక అనుబందానికి కారణం ఏమిటీ అని అర్థం వచ్చేట్టు గా అడగటంతో ఇక అపార్థాలని పూర్తిగా తొలగించాలనుకున్నాడో ఏమో ఈ విషయమై ఇంద్రగంటి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.


ఈషా అచ్చ తెలుగు అమ్మాయి

ఈషా అచ్చ తెలుగు అమ్మాయి

తన పాత్రలకు సరిపోతోంది కాబట్టే ఆమెకు ఛాన్సులిస్తున్నట్లు చెప్పాడు.''ఈషా అచ్చ తెలుగు అమ్మాయి. ఇటు ఆంధ్రా.. అటు తెలంగాణ.. రెండు యాసలూ బాగా మాట్లాడగలదు. ముఖ్యంగా తెలంగాణ యాస మాట్లాడే తెలుగు హీరోయిన్లు చాలా అరుదు. ఆ అమ్మాయి మంచి నటి కూడా.


తనకు సరిపోయే పాత్రలు కాబట్టే

తనకు సరిపోయే పాత్రలు కాబట్టే

నా పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఆమెలో ఉన్నాయి. తెలుగు రాని ఓ హీరోయిన్ని తీసుకుని.. తనకు తెలుగు నేర్పించి.. వేరొకరి చేత డబ్బింగ్ చెప్పించి ఇబ్బంది పడటం ఎందుకని ఈషానే 'అమీ తుమీ'కి తీసుకున్నాను. ఇంతకుముందు తనకు సరిపోయే పాత్రలు కాబట్టే తనతో చేయించాను.


తెలుగు నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యం

తెలుగు నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యం

నా సినిమాల్లో ఎక్కువగా తెలుగు నటీనటులే ఉంటారు. నా సినిమాల్లోనూ తెలుగుదనం ఉంటుంది. అందుకే తెలుగు నటీనటులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను'' అంటూ ఈషాకు వరుసగా అవకాశాలిస్తుండటానికి కారణమేంటో చెప్పాడు ఇంద్రగంటి. ఇంత చక్కగా వివరణ ఇచ్చాక అయినా ఈ గాలి రూమర్లు ఆగుతాయేమో చూడాలి మరి.English summary
When Indragati recently conducted a pressmeet for the promotions of 'Ami Tumi', reporters asked about casting Eesha in his films repeatedly. Indraganti gave a detailed answer for casting Eesha continuously in his films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu