»   » చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను.. రీ ఎంట్రీ పై మాజీ హీరోయిన్

చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను.. రీ ఎంట్రీ పై మాజీ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్త గ్లామరస్ పాత్ర‌ల‌తో... వెండి తెర‌పై అల్ల‌రి చేసింది ఇంద్ర‌జ‌. అలీ సినిమా య‌మ‌లీల‌తో గుర్తింపు తెచ్చుకొంది. అయితే టాప్ స్టార్స్‌తో జ‌ట్టు క‌ట్టే అవ‌కాశం రాక‌పోవ‌డంతో కొంత కాలానికే సైడ్ అయిపోయింది. పెళ్ళి చేసుకుని సినిమాల నుంచి దూరమై దాదాపు 15 సంవత్సరాల తరువాత ఇంద్రజ ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆ శక్తికర విషయాలను తెలియచేసింది. తన ఒకప్పటి సినిమాల గురించి అలనాటి దర్శకుల గురించి మాట్లాడుతూ అనేక విషయాలను షేర్ చేసుకుంది. పనిలో పనిగా ముంబై హీరోయిన్ల మీద తన అక్కసునంతా వెళ్ళగక్కేసింది... ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

మంచి కథలు వస్తేనే చేస్తున్నాను. ఈ పాత్రకి ఇంద్రజ సరిపోతుంది అనుకునేవారు నన్ను వచ్చి అడుగుతున్నారు. నచ్చితే చేస్తున్నాను. ఈ మధ్య కథలు నచ్చక కొన్ని సినిమాలు వదులుకున్నాను. అక్కా, వదిన, భార్య ఇలా ఏ క్యారెక్టర్‌ చేయడానికి అయినా నాకు ఇబ్బంది లేదు కానీ, నా సినిమాల్లో నేరుగా లేదా అంతర్లీనంగా ఓ మెసేజ్‌ ఉండాలని కోరుకుంటాను. అలాంటివి వస్తేనే చేస్తున్నాను. ప్రస్తుతం శతమానం భవతి సక్సెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను.


''ఉత్తరాది వాళ్లే స్టార్లు అనుకోకూడదు. దక్షిణాది హీరోయిన్లలోనూ స్టార్ హీరోయిన్లు అని అనిపించుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ముంబయి హీరోయిన్లలో గ్లామర్ పాళ్లు ఎక్కువ. ఈ విషయంలో దక్షిణాది హీరోయిన్లు పోటీ పడలేకపోతున్నారని నా అభిప్రాయం. ఐతే నటన విషయంలో మాత్రం మనవాళ్లు ఏమాత్రం తక్కువ కాదు. ఒకరకంగా ఆ విషయంలో మనదే పైచేయి. అందాల ఆరబోస్తేనే గుర్తింపు వస్తుంది అనుకోకూడదు.


Indraja at Shatamanam Bhavati success meet

సౌందర్య లాంటి హీరోయిన్లు తమ నటనతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలెంటుని ఆపడం ఎవరి తరం కాదు, అంతే కాదు ఇప్పుడు కథలు మారిపోయాయి. ఒకప్పుడు మన కల్చర్‌కు తగినట్లు సినిమాలు వచ్చేవి. అవి మన రాష్ట్రంలోని వారు చూసేట్లుగా ఉండేవి. మన కల్చర్‌ను భారత్‌లోని ఇతర భాషలవారికి చూపించేవారు. ఒక్కోసారి అక్కడి కథలు మనవారికి పరిచయం చేసేవారు. ఇప్పుడు మన కథలను విదేశీయుల కోసం తీయాల్సివస్తుంద '' అని చెప్పింది ఇంద్రజ


ఒకప్పుడు తాను కొన్ని సినిమాలు ఒప్పుకుని చేయకపోవడంపై స్పందిస్తూ.. ''అవగాహనారాహిత్యంతోనే కొన్ని తప్పులు జరిగాయి. కొన్నిసార్లు నాకు చెప్పిన కథ వేరు. తీస్తున్నది వేరుగా ఉండేది. అందుకే వాళ్లిచ్చిన డబ్బు వెనక్కిచ్చేసి ఓ నమస్కారం పెట్టి వచ్చేదాన్ని. మా మేనేజర్ కారణంగానూ కొన్ని తప్పులు జరిగాయి. అలా ఏడెనిమిది సినిమాలు ఒప్పుకుని.. తర్వాత తప్పుకున్నాను'' అని ఇంద్రజ తెలిపింది.

English summary
Actress Indraja said she is fortunate enough to work in the movie 'Shatamanam Bhavati'. The actress in an exclusive interview shared Some feelings About Mumbai Actors
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu