»   » రాఘవేంద్ర రావును హెచ్చరిస్తున్న తెలుగు సినీ పెద్దలు

రాఘవేంద్ర రావును హెచ్చరిస్తున్న తెలుగు సినీ పెద్దలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావును సినీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. షిర్డీ సాయిబాబా సినిమా తీయడానికి ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దానిపైనే వారు ఆయనను హెచ్చరిస్తున్నారని సమాచారం. దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు వంటి పెద్దలు ఆ సినిమా తీయవద్దని చెబుతున్నారట. షిర్డీ సాయిబాబాపై తీసిన సినిమాలేవీ విజయం సాధించలేదని చెబుతూ ఆయనను వారిస్తున్నారట. జాకీ ష్రాఫ్ తీసిన సాయిబాబా సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారని వినికిడి. అయితే రాఘవేంద్ర రావు వారి మాటలను వినడం లేదని తెలుస్తోంది. తాను సినిమాలో మోడర్న్ టెక్నిక్ లను, స్పెషల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించి మాస్టర్ పీస్ గా రూపొందిస్తానని ఆయన అంటున్నారట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu