For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో నేనే, విలన్ నేనే: ‘ఇంకొక్కడు’ ఆడియో వేడుకలో విక్రమ్ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ ఇంకొక్కడు. నయనతార, నత్యా మీనన్ హీరోయిన్లు. తమిళంలో ఇరుముగన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి ఇంకొక్కడు అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకుడు. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెక్షన్ సెంటర్ లో జరిగింది.

  బాహుబలి రైటర్ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా ఆడియో రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఆడియో సీడీలను హీరో విక్రమ్ విడుదల చేసి తొలి సీడీని విజయేంద్రప్రసాద్ కు అందించారు. వరుణ్ రెడ్డి, పగ్యా జైశ్వాల్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

  హీరో విక్ర‌మ్ మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో నేను, విలన్ కూడా నేనే. అఖిలన్; లవ్ అనే రెండు పాత్రలు చేసాను. అఖిల‌న్ హీరో అయితే, ల‌వ్ విల‌న్. నేను చేసిన బెస్ట్ క్యారెక్ట‌ర్స్ లో ఇదొక‌టి. ఇలాంటి మంచి స్టోరీ ఇవ్వ‌డ‌మే కాకుండా, అంతకంటే అద్భుతంగా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఆనంద్‌కు మంచి భ‌విష్య‌త్ ఉంది. ఆయ‌న‌తో ఇంకా రెండు, మూడు సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. న‌న్ను చాలా స్ట‌యిలిష్‌గా తెర‌కెక్కించారు అని విక్రమ్ తెలిపారు.

  స్లైడ్ షోలో ఫోటోస్ మరిన్ని విశేషాలు..

  సినిమా ఆలస్యం కావడంపై

  సినిమా ఆలస్యం కావడంపై

  కొన్ని కార‌ణాలు వ‌ల్ల ఆల‌స్య‌మైనా నిర్మాత శిబు త‌మీన్స్‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ముందుండి మంచి టీంను ఏర్ప‌రిచి సినిమాను పూర్తి చేశారు. చాలా తెలివైన నిర్మాత‌ అని విక్రమ్ తెలిపారు.

  కల్మషం ఉండదు, డెడికేషన్

  కల్మషం ఉండదు, డెడికేషన్

  విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ``విక్రమ్ గారిలో మంచి డేడికేషన్ ఉంది. త‌న‌లో క‌ల్మ‌షం క‌న‌ప‌డదు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే త‌మిళంలో ఈ చిత్రానికి ఇరు ముగ‌న్ అనే పేరు పెట్టారు. అంటే రెండో ముఖమ‌ని అర్థం. ఎంట‌ర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

  ప్ర‌గ్యా జైశ్వాల్

  ప్ర‌గ్యా జైశ్వాల్

  థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రగ్యా జైశ్వల్ మాట్లాడుతూ ``విక్ర‌మ్ గారు ఎప్పుడూ కొత్త బౌండ‌రీస్‌ను క్రియేట్ చేస్తుంటారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ సూప‌ర్బ్‌గా ఉంది. అంద‌రికీ అభినంద‌న‌లు`` అన్నారు.

  విక్రమ్ మాత్రమే చేయగలరు

  విక్రమ్ మాత్రమే చేయగలరు

  నిర్మాత శిబు తమీన్స్ మాట్లాడుతూ``చిరంజీవిగారు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను సైమా వేడుక‌లో ఆవిష్క‌రించారు. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. విక్ర‌మ్‌గారిని అభినందించారు. నేను డిస్ట్రిబ్యూట‌ర్ నుండి నిర్మాత‌గా ఎదిగాను. విక్ర‌మ్‌గారు మాత్ర‌మే ఈ సినిమా చేయ‌గ‌ల‌రు. స్క్రిప్ట్ ఆ విధంగా కుదిరింది' అని తెలిపారు.

  తెలుగు ప్రేక్షకులు ఏమీ అనుకోవద్ద

  తెలుగు ప్రేక్షకులు ఏమీ అనుకోవద్ద

  సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో త‌మిళంలో విడుద‌ల చేస్తాం. తెలుగులో మాత్రం అనుకున్న సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల కావ‌డం లేదు. అందుకు తెలుగు ప్రేక్ష‌కులకు ఏమీ అనుకోవ‌ద్దు అని నిర్మాత తెలిపారు.

  మంచి టీం

  మంచి టీం

  ఆనంద్ శంకర్ చాలా స్ట‌యిలిష్, డిఫ‌రెంట్ మూవీగా దీన్ని రూపొందించారు. క‌థ విన‌గానే ఎలాగైనా సినిమా చేయాల‌ని నిర్ణ‌యంతో చేశాం. మంచి టీం కుదిరింది. కృష్ణారెడ్డిగారు, సిరాజ్‌గారి స‌హకారంతో సినిమాను తెలుగు రైట్స్ తీసుకున్నారని నిర్మాత తెలిపారు.

  అప్పుడే విడుదల కావాల్సింది

  అప్పుడే విడుదల కావాల్సింది

  నిజానికి ఆగ‌స్ట్ రెండోవారంలో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ పెద్ద సినిమా ఉంద‌ని సెప్టెంబ‌ర్లో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. ఇప్పుడు ఆ పెద్ద సినిమా తెలుగులో సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల‌వుతుంది. కానీ కృష్ణారెడ్డిగారు డేట్ మార్చ‌మ‌ని అడ‌గ‌కుండా తెలుగులో మ‌రో రిలీజ్ డేట్ చూసుకుని విడుదల చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు అని నిర్మాత తెలిపారు.

  చీటింగ్ కనబడదు

  చీటింగ్ కనబడదు

  సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ ``విక్ర‌మ్‌గారి యాక్టింగ్‌లో అసలు చీటింగ్ క‌న‌ప‌డ‌దు. అంతా మంచి న‌ట‌న క‌న‌ప‌డుతుంది. హీరోగా, వ్య‌క్తిగా విక్ర‌మ్‌ను మించిన వ్య‌క్తి లేడు. ఆనంద్‌కు విక్ర‌మ్ లాంటి వ‌జ్రం దొరికాడు. ఎంతో మంది చేయాల‌నుకున్న స‌బ్జెక్ట్‌ను విక్ర‌మ్ చేయ‌డంతోనే పెద్ద స‌క్సెస్ సాధించాడు' అని తెలిపారు.

  తెలుగు వారి గురించి ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ మాట్లాడుతూ

  తెలుగు వారి గురించి ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ మాట్లాడుతూ

  తెలుగు ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటున్న తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. వీరి అభిమానం చూసి తెలుగులో స్ట్ర‌యిట్ మూవీ చేయాల‌నుకుంటున్నాను అని తెలిపారు.

  సినిమా గురించి దర్శకుడు

  సినిమా గురించి దర్శకుడు

  విక్ర‌మ్‌గారి వ‌ల్లే ఈరోజు నేనిక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే రెండు డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. రా ఏజెంట్ అఖిల‌న్ పాత్ర‌లో, ల‌వ్ అనే మ‌రో పాత్ర‌లో విక్ర‌మ్ క‌న‌ప‌డ‌తారు. ల‌వ్ పాత్ర‌ను చాలా డిఫ‌రెంట్‌గా డిజైన్ చేయాల్సి వ‌చ్చింది అని దర్శకుడు తెలిపారు.

  English summary
  Inkokkadu Movie Audio launch held at JRC Convention Centre in Hyderabad today (15th Aug) evening.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X