»   » డబ్బుకు అమ్ముడుపోయిన డ్రైవర్, కత్రినా సీక్రెట్స్ లీక్, షాక్

డబ్బుకు అమ్ముడుపోయిన డ్రైవర్, కత్రినా సీక్రెట్స్ లీక్, షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: అవును, మీరు చదవింది రైటే, తన మీద మీడియాలో వరస పెట్టి వస్తున్న కథనాలకు కత్రినా కైఫ్ చాలా అప్ సెట్ అయ్యింది. ఎంత దాయాలని ట్రై చేసినా కత్రినా రహస్యాలు ఎలాగోలా బయటికొచ్చేస్తున్నాయి. దాంతో ఆమె తన చుట్టూ ఉండే వారిపై అనుమానం కలిగిందిట. ముఖ్యంగా ఈ జ్యూసీ గాసిప్ లన్నీ తన డ్రైవర్ ద్వారానే టాబ్లాయిడ్స్ కు వెల్తున్నాయని నిర్ణయానికి వచ్చిందట.

బాలీవుడ్ వెబ్ సైట్ స్పాట్ బోయ్ ప్రకారం..కత్రినా తన తో ఉండేవారు, తన టీమ్ అందరినీ అనుమానంగా పరిశీలించి చూసిందిట. తన వ్యక్తిగత విషయాలను ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా తనపై ఏదో ఒక వార్త వస్తూనే ఉండటానికి కారణం డ్రైవరే అని నిర్దారణకు వచ్చేసింది. రీసెంట్ గా పార్కింగ్ స్పాట్ వద్ద ఆమెతో ఆర్గుమెంట్ అయ్యి చెంపదెబ్బ తిన్నాడు. ఆ తర్వాత ఆమె అతన్నీ తీసేసింది.

ఆ తర్వాత ఆమె తన కొత్త డ్రైవర్ తో కలిసి షారూఖ్ ఖాన్ ఇంటికి వెళ్లింది. అయితే ఆ విషయం కూడా మీడియాలో వచ్చేసింది. దాంతో కత్రినా షాక్ అయ్యిందని సమాచారం. తను ఎవరినైతే తీసేసానో ఆ డ్రైవర్ పని కాదేమో అనే సందేహం వచ్చిందట. ఎందుకంటే ఆ డ్రైవర్ మానేసినా ఆమె సీక్రెట్స్ బయిటకు రావటం మాత్రం మానలేదు.

బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ జోడీ సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ కలిసి మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై 'ఏక్తా టైగర్‌'కి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్న 'టైగర్‌ జిందా హై' సినిమాలో సల్మాన్‌, కత్రినా జంటగా నటించనున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ట్వీట్‌ చేసింది.

'ఏక్తా టైగర్‌'కు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం సల్మాన్‌హీరోగా కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ట్యూబ్‌లైట్‌' చిత్రం షూటింగ్‌ మనాలిలో జరుగుతోంది.

ముందే తెలిసిపోతోంది

ముందే తెలిసిపోతోంది

తాజాగా కత్రినా.. బాలీవుడ్‌ నటుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌తో సన్నిహితంగా ఉంటోందని.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనివదంతులు వస్తున్నాయి. అదీకాకుండా ఈ మధ్యకాలంలో కత్రినా, ఆదిత్యలు కలిసి ఎక్కడికి వెళ్లినా మీడియా కంటపడుతున్నారు. ముందే తెలిసిపోతూండటంతో షాక్ అవుతోంది.

ఇవన్నీ డబ్బు కోసం డ్రైవరే

ఇవన్నీ డబ్బు కోసం డ్రైవరే

అయితే ఇలాంటి పుకార్లు తనకి సన్నిహితంగా ఉంటున్నవారే సృష్టిస్తున్నారని.. అది తన డ్రైవరే డబ్బు కోసం చేస్తున్నాడని అనుమానించి అతన్ని పనిలో నుంచి తీసేయాలని నిర్ణయించుకుందట. కాకపోతే కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో పెట్టి తీసేసిందని చెప్తున్నారు.

కాకపోతే అవి మాత్రం...

కాకపోతే అవి మాత్రం...

సెలబ్రెటీల సీక్రెట్స్ ని డ్రైవరో, మేకప్‌మేనో, మేనేజరో, పర్సనల్ అసిస్టెంట్సో.. ఇలా ఎవరో ఒకరు సీక్రెట్స్‌ని బయటపెట్టేస్తారు. అఫ్‌కోర్స్ వాళ్ల ద్వారా కాకుండా వేరే రకంగా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనుకోండి. ఈ మధ్య కత్రినా కైఫ్ గురించి బయటికొచ్చిన రహస్యాలన్నీ మాత్రం ఆమె డ్రైవర్ నుంచే వచ్చాయని అంటోంది.

దాచినా దాగటం లేదే

దాచినా దాగటం లేదే

రణబీర్ కపూర్‌తో గొడవపడినా, ఆదిత్యారాయ్ కపూర్‌తో స్నేహంగా ఉన్నా.. ఇలా ఏ విషయం అయినా దాగకుండా బయటకు రావడం కత్రినాను ఆలోచనలో పడేసిందట. ఎవరో కావాలనే విషయాలను బయటపెడుతున్నారని గ్రహించిన కత్రినా ముందుగా తన డ్రైవర్‌ని అనుమానించారట.

వార్నింగ్ ఇచ్చినా

వార్నింగ్ ఇచ్చినా

మీడియాకి రహస్యాలు చేరవేసి, డ్రైవర్ డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసి, కత్రినా ఖంగుతిన్నారని సమాచారం. ఆ డ్రైవర్‌ను చెడామడా తిట్టిన కత్రినా 'ఇంకోసారి ఇలా చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తా' అని ఆగ్రహం వ్యక్తం చేశారని భోగట్టా. కానీ మారకపోవటంతో తీసేసిందంటున్నారు.

మనశ్శాంతి లేదు

మనశ్శాంతి లేదు

డ్రైవర్ మీద మాత్రమే కాదు.. తన దగ్గర పని చేసేవాళ్లందరి మీదా కత్రినా ఓ కన్నేసి ఉంచుతున్నారట. కానీ, ఎంతసేపని కాపలా కాయగలరు? పాపం దీనివల్ల ఈ బ్యూటీకి మనశ్శాంతి లేకుండాపోతోందని బాలీవుడ్ మీడియా అంటోంది. తప్పదు .. సెలబ్రిటీ లైఫ్ అంటే అంతే మరి అని సన్నిహితులు సర్ది చెబుతున్నారట.

సీక్రెట్ లీక్ అయితే కష్టం

సీక్రెట్ లీక్ అయితే కష్టం

సినీతారలకు ఉండే క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రెటీలు కంటపడితే చాలు.. వాళ్ల అనుమతి లేకుండానే అభిమానులు ఎగబడి ఫొటోలు తీసేస్తుంటారు. సెల్ఫీల కోసం పోజులిచ్చేందుకు పోటీ పడతారు. వాటిని సోషల్‌మీడియాల్లో పోస్ట్‌ చేసేసి సంబరపడతారు. అయితే ఇదంతా అభిమానం కొద్దీ చేసినా.. ఒక్కోసారి ఆ నటీనటులను భయాందోళనకు గురిచేస్తుంటుంది. అయితే ఇదంతా ఓ ఎత్తు అయితే సీక్రెట్స్ లీక్ అవటం మాత్రం దారుణమే అంటున్నారు.

పర్శనల్ లైఫ్ కు వస్తే...

పర్శనల్ లైఫ్ కు వస్తే...

బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రణ్‌బీర్‌ కపూర్‌.. కత్రినా కైఫ్‌ బ్రేకప్‌ విషయం ఓ పట్టాన కొలిక్కిరావట్లేదు. ఇటీవల బ్రేకప్‌ అయిన వీరిద్దరిని కలపడానికి ఒకవైపు వారి స్నేహితులు.. సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు ఎక్కడికి వెళ్లినా రణ్‌బీర్‌.. కత్రినా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. దీంతో ఇక వాళ్లిద్దరు కలిసే అవకాశాలు లేవని బీటౌన్‌లో అనుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరు మళ్లీ ఒక్కటవుతున్నారన్న సందేహాన్ని కలిగించిందట.

కానీ..విడివిడిగా

కానీ..విడివిడిగా

ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌.. కత్రినా కైఫ్‌ బ్రేకప్‌ అయినా.. 'జగ్గాజాసూస్‌' సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్‌.. కత్రినా ఒకరినొకరు కలవకుండా వేరువేరుగా ఉన్నారట.

మళ్లీ కలిసిపోవటానికే...

మళ్లీ కలిసిపోవటానికే...

రణ్‌బీర్‌ కపూర్‌.. కత్రినా కైఫ్‌ ఇద్దరికీ సన్నిహిత స్నేహితురాలైన ఆర్తి పుట్టిన రోజు పార్టీకి మిస్‌ కాకుండా ఒకే సమయంలో వచ్చారట. అంతేకాదు.. ఇరువురు ఆప్యాయంగా పలుకరించుకొని చాలా సేపు మాట్లాడుకున్నారట. పార్టీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి రణ్‌బీర్‌ వెళ్లిన తర్వాత కత్రినా వెళ్లిపోయిందట. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇది అంత విశ్వసనీయ సమాచారం కాకున్నా ఒకవేళ నిజంగానే సర్దుకుపోయి.. ప్రేమను కొనసాగిస్తే వారి జంటను అభిమానించే అభిమానులకు సంతోషకరమైన విషయమే కదా!

English summary
Now, to keep the media away, Katrina Kaif is even keeping an eye on her close people. From her staff to her PR team, everyone is under scrutiny. And now, the person she has doubt on is her driver.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu