»   »  హీరోయిన్‍‌తో డైరెక్టర్ వివాహం, క్రికెటర్ల సందడి (ఫోటోస్)

హీరోయిన్‍‌తో డైరెక్టర్ వివాహం, క్రికెటర్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కత్రినా కైఫ్, ఆదిర్య రాయ్ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘ఫితూర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అభిషేక్ కపూర్ వివాహం ముంబైలో గ్రాండ్ గా జరిగింది. మోడల్, నటి ప్రగ్యా యాదవ్ ను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగింది.

ఎలాంటి డిస్ట్రబెన్స్ ఉండకూడదనే ఉద్దేశ్యంతో వీరి పెళ్లి విషయం బయటకు పొక్కకుండా ఇంత కాలం గోప్యత పాటించారు. అసలు పెళ్లి అయిపోయి ఆన్ లైన్లో ఫోటోలు దర్శనమిచ్చే వరకు మీడియాకు ఈ విషయే తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీ ఈ వివాహానికి హాజరైనా....‘ఫితూర్' హీరో హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ తో సహా చిత్ర యూనిట్ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు.

ప్రగ్యా యాదవ్ విషయానికొస్తే....ఆమె స్వీడన్‌కు చెందిన నటి, మోడల్. అమోల్ గుప్తా మూవీ ‘హవా హవా' చిత్రంలో లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ కపూర్ ‘కాచ్ పో చె' సినిమా చేస్తున్నప్పటి నుండే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. 2013లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటి నుండి సహజీవనం చేస్తున్న వీరు మే 4, 2015న వివాహం ద్వారా ఏకం అయ్యారు.

వివాహానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

నూతన దంపతులు

నూతన దంపతులు


అభిషేక్ కపూర్, ప్రగ్యా యాదవ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వెడ్డింగ్ సెర్మనీ

వెడ్డింగ్ సెర్మనీ


హిందూ సాంప్రదాయం ప్రకారం అభిషేక్ కపూర్, ప్రగ్యా యాదవ్ వివాహం గ్రాండ్ గా జరిగింది.

హ్యాపీగా..

హ్యాపీగా..


వివాహ వేడుక సందర్భంగా ప్రగ్యా యాదవ్, అభిషేక్ కపూర్ చాలా సంతోషంగా కనిపించారు.

వెడ్డింగ్ సెల్ఫీ

వెడ్డింగ్ సెల్ఫీ


వివాహం అనంతరం బంధువులు, స్నేహితులతో కలిసి సెల్ఫీ షాట్.

ఏక్తా, తుషార్

ఏక్తా, తుషార్


ఏక్తా కపూర్, తుషార్ కపూర్ లతో కలిసి నూతన దంపతులు.

అభిషేక్-ప్రగ్యా

అభిషేక్-ప్రగ్యా


వివాహం అనంతరం మీడియా ముందుకు అభిషేక్-ప్రగ్యా ఇలా ఎంట్రీ ఇచ్చారు.

అర్జున్ రాంపాల్

అర్జున్ రాంపాల్


అభిషేక్ కపూర్-ప్రగ్యా యాదవ్ వివాహానికి హాజరైన బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ దంపతులు.

సోహైల్ ఖాన్

సోహైల్ ఖాన్


వివాహ వేడుకకు హాజరైన సల్మాన్ ఖాన్ బ్రదర్ సొహైల్ ఖాన్.

అలి జాఫర్

అలి జాఫర్


వివాహ వేడుకకు హాజరైన అలీ జాఫర్

జహీర్ ఖాన్

జహీర్ ఖాన్


వివాహ వేడుకకు హాజరైన క్రికెట్ జహీర్ ఖాన్.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్


అభిషేక్ కపూర్ వివాహ వేడుకకు హాజరైన క్రికెటర్ యువరాజ్ సింగ్.

ఏక్తా కపూర్

ఏక్తా కపూర్


వివాహ వేడుకకు హాజరైన బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్.

English summary
Another Bollywood bachelor, Fitoor director Abhishek Kapoor has decided to sacrifice his single life to enter a holy matrimony with beautiful model Pragya Yadav.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu