»   » ఆయనే నెం.1 అంటున్న మహేష్ బాబు.... ఆసక్తికర విషయాలు!

ఆయనే నెం.1 అంటున్న మహేష్ బాబు.... ఆసక్తికర విషయాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు సినిమా విడుదల సందర్భంగా ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన ఏం చెప్పారో మీరూ ఓ లక్కేయండి.

తొలి సినిమా ‘యువరాజు'...
'యువరాజు' కాస్ట్యూమ్స్‌ కోసం హాంకాంగ్‌ వెళ్లి చెన్నై వచ్చాం. బాబాయ్‌ ఆదిశేషగిరిరావు గారు.. 'రిపోర్ట్‌ బాగుంది' అన్నారు. ఓ రోజు గడిచింది. 'సినిమా సూపర్‌ హిట్‌' అన్నారు. నేను నమ్మలేదు... (నవ్వుతూ). హైదరాబాద్‌ వచ్చాక ఆ విషయం అర్థమైంది. అప్పుడు చాలా ఆనందం వేసింది.


శ్రీమంతుడు అంటే..
శ్రీమంతుడు అంటే డబ్బున్నవాడని అర్థం. నేనైతే డబ్బులతో పాటు మంచి మనసు కూడా ఉన్నవాడే శ్రీమంతుడు అని నమ్ముతా. ఈ సినిమా ద్వారా అదే చెప్పాం. జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. కానీ ప్రతిపైసా కష్టపడి సంపాదించాలి. అలా కష్టపడినదాన్ని గౌరవించాలి.


పెళ్లికి ముందు కోపం..
పెళ్లికాక ముందు కోపం ఉండేది.. తరవాత కాస్త కూల్‌ అయ్యా. అదీ నమ్రత వల్లే. సెలబ్రిటీలన్నాక ఎన్ని ఎమోషన్స్‌ వచ్చినా లోలోపల దాచుకోవాలి. అందులోనూ కోపం మహా చెడ్డది. దాన్ని చూపించలేం కదా..? లోపల పెట్టుకోవాలి. మనల్ని కంట్రోల్‌ చేసేది ఇల్లే. ఇంటికొచ్చాక, అక్కడి వాతావరణం బాగుంటే రిలాక్స్‌ అవుతుంటాం. అందుకే కుటుంబ బంధాలకు చాలా ప్రాధాన్యం ఇస్తా.


స్లైడ్ షోలో మరిన్ని ఆసక్తికర విషయాలు....


మల్టీస్టారర్లు..

మల్టీస్టారర్లు..


ఓ కథని దర్శకుడు కన్విన్సింగ్‌గా చెప్పగలిగితే నేను మల్టీస్టారర్లు చేయడానికి సిద్ధంగానే ఉన్నా. 'సీతమ్మ వాకిట్లో..' చేయడానికి అదే కారణం. కథ వినగానే ఓకే చేశా. నేనూ, వెంకటేష్‌గారు ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేశాం. మల్టీస్టారర్‌ల వల్ల బడ్జెట్‌ పెరుగుతుంది అనుకోవడం కూడా కరెక్ట్‌ కాదు. ఎవరో ఒకరు, ఎక్కడో ఓచోట రాజీ పడాలి. పారితోషికం తగ్గించుకొని, లాభాల్లో వాటా తీసుకొంటే.. సినిమా తక్కువలో అయిపోతుంది.


ఫేవరెట్ హీరోయిన్..

ఫేవరెట్ హీరోయిన్..


ఇప్పటికీ శ్రీదేవిగారే నా ఫేవరెట్‌. చాలా గొప్ప సినిమాలు చేశారు. ఆమధ్య వచ్చిన 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'లోనూ చాలా బాగా చేశారు. ఫలానా అని పేరు పెట్టి చెప్పలేను.


ప్యాన్స్ గురించి..

ప్యాన్స్ గురించి..


చాలా మంది అభిమానులున్నారు. వారిలో ఓ పదిమంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ అయిపోయారు. నా మొదటి సినిమానుంచీ వాళ్లు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. నా సినిమా షూటింగ్‌ జరుగుతుంటే నా సెట్‌కి వస్తుంటారు. కనీసం ఏడాదికి ఆరేడు సార్లు కలుస్తుంటాం. నా సినిమాల గురించి కరెక్ట్‌గా చెప్తారు. వాళ్లని అభిమానుల్లా కాదు, నా కుటుంబ సభ్యుల్లా ఫీలవుతుంటా.


కథే గొప్పది...

కథే గొప్పది...


కథలో భాగంగా పంచ్‌లు ఉంటే ఫర్వాలేదు కానీ... డైలాగుల కోసమే సినిమా తీయడమనేది తప్పు. అది నాకూ నచ్చదు. ఇప్పుడు కథే కీలకం. స్టార్లకంటే కథే గొప్పది.అలా ఏమీ లేదు.


శ్రీమంతుడు ఆడియో వేడుకలో సారి చెప్పడంపై..

శ్రీమంతుడు ఆడియో వేడుకలో సారి చెప్పడంపై..


భావోద్వేగానికి గురై చెప్పిన మాటలవి. సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ట్రైలర్‌ని చూసి అంచనాలు వేసుకొంటారు. సినిమా ఆడకపోయినప్పుడు నిరుత్సాహపడతారు. అందుకే ఆ వేడుకలో వాళ్లకి క్షమాపణ చెప్పాలనిపించింది.


సినిమా విడుదల రోజు..

సినిమా విడుదల రోజు..


ఇది వరకు నా సినిమా విడుదలైన రోజు ఉదయాన్నే హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌కి వెళ్లి అభిమానులతో కలిసి చూసేవాణ్ని. కానీ అక్కడికి వెళుతున్నప్పుడు నన్ను చూడాలన్న ఆత్రుతలో అభిమానులు సినిమాని ఆస్వాదించడం లేదన్న విషయం అర్థమైంది. అందుకే వెళ్లడం మానేశా. అభిమానులు సినిమాని ఎంజాయ్‌ చేస్తే చాలు. వాళ్ల ఆనందమే నా ఆనందం.


స్మోకింగ్?..

స్మోకింగ్?..


ఇదివరకు నేను సిగరెట్‌ కాల్చేవాడిని. 'ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌' అనే పుస్తకం చదివి ఆ అలవాటుని మానుకొన్నా. అందుకే ఆ పుస్తకం నాకు ఇష్టం.


క్రికెట్ గురించి..

క్రికెట్ గురించి..


క్రికెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆడను కానీ... బాగా చూస్తుంటా. టెస్ట్‌ మ్యాచ్‌లంటే ఇష్టం నాకు. అదే నిజమైన క్రికెట్టని భావిస్తుంటా. వినోదం కోసం టీట్వంటీలొచ్చాయి కానీ... నేను మాత్రం ఇప్పటికీ టెస్టు క్రికెట్‌నే ఆస్వాదిస్తుంటా.


సినిమా స్టార్ కాకపోయి ఉంటే..

సినిమా స్టార్ కాకపోయి ఉంటే..


ఆ విషయం తలచుకొంటేనే భయంగా ఉంది (నవ్వుతూ). ఏం చేసేవాణ్నో అర్థం కావట్లేదు. సినిమా తప్ప వేరే జీవితాన్ని వూహించుకోలేదు. నటన దేవుడిచ్చిన వరం. ప్రతి వేసవి సెలవుల్లో నాన్న నాతో సినిమాలు చేయించేవారు. నేనూ సెలవులొచ్చాయనగానే సినిమా సెట్‌కి ఎప్పుడెప్పుడు వెళదామా అన్న ఆత్రుతతో ఉండేవాణి. అయితే ఒకసారి ఒక సినిమా వల్ల ఏడాది చదువు వృథా అయ్యింది. దీంతో నాన్నగారు 'నువ్వు చదువుకో, పెద్దయ్యాక సినిమా చేద్దువుగానీ..' అన్నారు. అంతే ఆయన చెప్పినట్టుగానే చదువులు పూర్తవ్వగానే 'రాజకుమారుడు' చేశా.


నెం.1 గురించి...

నెం.1 గురించి...


ఇప్పుడున్న ట్రెండ్‌లో నెంబర్‌ వన్‌ ఎవ్వరూ లేరు. సినిమా అనేది స్టార్స్‌ కంటే పెద్దదైంది. ప్రతీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చే సినిమానే స్టార్‌. మరీ చెప్పాలంటే ఇప్పుడు పరిశ్రమలో నెంబర్‌ వన్‌ ఎవరంటే రాజమౌళి పేరే చెబుతాను. ఆయన చేసిన సినిమాలు అలాంటివి.


ట్విట్టర్...

ట్విట్టర్...


అభిమానుల కోసమే కోసమే ట్విట్టర్లో ఉన్నాను. నేను చేసే సినిమాలకి సంబంధించిన విషయాల్ని వాళ్లతో పంచుకోవాలనే ట్విట్టర్లోకి అడుగుపెట్టా. అప్పుడప్పుడు నా జీవితంలో జరిగే కొన్ని మంచి విషయాలు కూడా పంచుకొంటుంటా. అంతే కానీ... అనవసరమైన విషయాల్ని ట్వీట్‌ చేస్తూ ఎప్పుడూ ట్విట్టర్‌లో కనిపించడం నాకు నచ్చదు. దాంతో నా సమయం, చదువుకొనేవాళ్ల సమయమూ... రెండూ వృథానే కదా! నా వ్యక్తిత్వమే అంతండీ. అది నేను చేసే ట్వీట్లలోనూ కనిపిస్తుంటుంది.


సామాజిక బాధ్యత

సామాజిక బాధ్యత


సెబ్రిటీలకే కాదు, అందరికీ సామాజిక బాధ్యత ఉండాలి. స్టార్‌ చేసే పని జనాలకు తొందరగా చేరుతుంది. ఓ స్వచ్ఛంద సంస్థ తరపున నా వంతు సేవ చేస్తున్నా. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతస్థాయిలో చేయాలనుకొంటున్నా. నేనే కాదు, మిగిలిన కథానాయకులూ తమకు తోచిన దారిలో సేవ చేస్తున్నారు. దాని వల్ల సమాజానికి మంచే జరుగుతుంది.


అల్లరి పిల్ల సితార గురించి..

అల్లరి పిల్ల సితార గురించి..


తను చాలా డిమాండింగ్‌. స్కూల్‌ నుంచి తాను రాగానే అందరి ఫోకస్‌ తనమీదే ఉండాలి. పక్కవారితో మాట్లాడితే ఒప్పుకోదు. ఫోన్లో మాట్లాడినా వూరుకోదు. ఫోన్లు విసిరి కొడుతుంటుంది. టైమ్‌ అంతా సితారకే ఇవ్వాలి. కానీ అదంతా నాకు హ్యాపీగా అనిపిస్తుంటుంది. తాను భోజనం చేస్తున్నప్పుడు నా పాటలే పెట్టాలి. పాట మొత్తం పాడేస్తుంటుంది. డాన్స్‌ చేస్తుంటుంది. సితారని చూస్తుంటే మా అమ్మమ్మగారు గుర్తొస్తుంటారు.


గౌతం గురించి...

గౌతం గురించి...


నాన్నగారి పుట్టినరోజున సరదాగా గౌతమ్‌తో ఏమైనా చేయించాలనిపించింది. అప్పుడే పండుగాడు డైలాగ్‌ గుర్తుకొచ్చింది. ఆ డైలాగ్‌ని డబ్‌స్మాష్‌లో గౌతమ్‌తో చెప్పించి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పెట్టా. మంచి స్పందన వచ్చింది. అభిమానులు చాలా ఆనందపడ్డారు. గౌతమ్‌ నాకంటే బాగా ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చాడు (నవ్వుతూ).పట్టుబట్టి మరీ తీసుకెళతాడు. నాకు పనుందన్నా వదిలిపెట్టడు. ఒకట్రెండుసార్లు తప్పించుకొనే ప్రయత్నం చేశా. కానీ కుదర్లేదు. నేను స్కూల్‌కి వెళితే వాడికి అదొక ఆనందం.


పోకిరి సీక్వెల్

పోకిరి సీక్వెల్


'పోకిరి' సీక్వెల్ చేయాలంటే కథ అంతకుమించి ఉండాలి. అలాంటి కథ చేస్తే మళ్లీ పూరి జగన్నాథ్‌గారే చేయాలి. అయితే 'పోకిరి 2' అని కాకుండా నేనూ జగన్‌గారు కలిసి వేరే సినిమా చేయబోతున్నాం.


బ్రహ్మోత్సవం గురించి...

బ్రహ్మోత్సవం గురించి...


ఓ పండగలా ఉంటుంది. శ్రీకాంత్‌ అడ్డాల నా అభిమాన దర్శకుడు. ఆయన సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి.


ఇతర స్టార్లతో కలిసి చేయడంపై...

ఇతర స్టార్లతో కలిసి చేయడంపై...


పవన్ కళ్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్ లాంటి ఇతర స్టార్లతో సినిమాలు చేయాలని నేను అనుకోవడం కన్నా దర్శకులు అనుకోవాలి. కథ బావుందనిపిస్తే వారితో కలిసి చేయడానికి సిద్ధమే.


English summary
Check out, Interesting answers from Tollywood star Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu