»   » శ్రద్దాతో కలసి బుర్జ్ ఖలీఫాలో ప్రభాస్ వేట.. కళ్లు చెదిరేలా యాక్షన్ సీక్వెన్స్!

శ్రద్దాతో కలసి బుర్జ్ ఖలీఫాలో ప్రభాస్ వేట.. కళ్లు చెదిరేలా యాక్షన్ సీక్వెన్స్!

Subscribe to Filmibeat Telugu
Prabhas To Shoot At Burj Khalifa For 'Saaho's' Next Schedule

బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంపై అంచనాలు పెరుగిపోతున్నాయి. కనీవినీ ఎరుగని యాక్షన్ చిత్రంగా సాహూ రూపొందుతోంది. యువదర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజగా సాహో చిత్రం గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.

భారీ యాక్షన్ చిత్రం

భారీ యాక్షన్ చిత్రం

బాహుబలి తరువాత ప్రభాస్ కు జాతీయ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే సాహో చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇప్పటి వరకు ప్రభాస్ పాత్ర గురించి ఎలాంటి విషయం బయటకు రాలేదు. జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

బుర్జ్ ఖలీఫాలో యాక్షన్ సీన్

బుర్జ్ ఖలీఫాలో యాక్షన్ సీన్

ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ బుర్జ్ ఖలీఫాలో జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, శ్రద్దా కపూర్ కలిసి ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మునుపెన్నడూ రానివిధంగా ఈ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.


 శ్రద్దా కపూర్ తొలిసారి

శ్రద్దా కపూర్ తొలిసారి

శ్రద్దా కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో తొలిసారి యాక్షన్ భరిత సన్నివేశాల్లో నటిస్తోంది. ఈ తరహా పాత్ర శ్రద్దా గతంలో చేయలేదు.


 విలన్లుగా వాళ్లిద్దరూ

విలన్లుగా వాళ్లిద్దరూ

నీల్ నితిన్ ముఖేష్ మరియు మందిరా బేడీ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్స్ లో నటిస్తున్నారు. దర్శకుడు సుజిత్ చిత్రాన్ని అనుకున్న విధంగా పక్కాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.


English summary
Interesting details on Prabhas Sahoo movie next schedule. Next schedule will going to be at Burj khalifa
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X