For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిత్రంగా ఉందే...:మంచు మనోజ్, ఎన్టీఆర్ ల పోలిక

  By Srikanya
  |

  హైదరాబాద్ : జూ.ఎన్టీఆర్, మంచు మనోజ్ ల మధ్య కొన్ని విచిత్రమైన పోలికలు ఉన్నాయి. అవి మరేమో కాదు.. మంచు విష్ణు,ఎన్టీఆర్ ఒకే రోజు, ఒకే తేదీన పుట్టారు. అది మరేదో కాదు 20 మే 1983. అలాగే ..ఇద్దరి మధ్యా ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ పోలిక వచ్చింది. అది ఎన్టీఆర్ భార్య పేరు ప్రణతి కావటం. అలాగే మంచు మనోజ్ కాబోయే భార్య పేరు కూడా ప్రణీత కావటం. ఒకే రోజు పుట్టడం, ఒకే పేరు గల భార్యలు రావటం చాలా చిత్రంగా ఉంది కదూ.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు మరియు మంచు ఫ్యామిలీ హీరోలలో చిన్నవాడు మన హీరో మంచు మనోజ్. ఇటీవలే మంచు మనోజ్ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ప్రణతితో పెళ్లి చేయడానికి మోహన్ బాబు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మంచు మనోజ్ - ప్రణతిల నిశ్చితార్ధం మార్చి 4న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనుంది.

  మంచు మనోజ్ - ప్రణతిల నిశ్చితార్ధ వేడుకకి హైదరబాద్ బంజార హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ వేదికయ్యింది. మంచు విష్ణు సతీమణి విరానికా క్లాస్‌మేట్ ప్రణతితో మనోజ్ ప్రేమలో పడి, ఆ తర్వాత ఇరు ఫ్యామిలీ మెంబర్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుకకి ఇందాస్త్రీలోని ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. మంచు మనోజ్ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘ఎటాక్' సినిమాలో నటిస్తున్నాడు.

  Interesting Fact About Manoj And NTR!

  మంచు మనోజ్, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కరెంట్‌ తీగ' . ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కువుట్ కాలేదు. అయినా మరో సారి ఈ కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. మంచు విష్ణు నిర్మాతగా రూపొందే ఈ చిత్రం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందనుంది. ఇది ఓ యాక్షన్ కామెడీ అని చెప్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఈ చిత్రం అఫీషియల్ ప్రకటన త్వరలో రానుందని సమాచారం.

  పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో హిట్ కొట్టి ఉత్సాహంలో ఉన్న మంచు మనోజ్ తన తదుపరి చిత్రం కరెంట్ తీగతో ప్లాఫ్ ఇచ్చారు. ఇప్పుడు మరో చిత్రానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ సన్నాఫ్ పెద రాయుడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో నడుస్తుందని చెప్తున్నారు.

  మోహన్‌బాబు కెరీర్‌లో కలికితురాయి లాంటి సినిమా ‘పెదరాయుడు'.బాక్సాఫీస్‌ వద్ద సంచలన వసూళ్లను సాధించిన గొప చిత్రమిది. అంతేకాదు డైలాగ్‌కింగ్‌ని ఓ రేంజులో చూపించారీ చిత్రంలో. ఈ సినిమాకి సీక్వెల్‌ ‘సన్నాఫ్‌ పెదరాయుడు'.కొత్త దర్శకుడు సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తారని, అమెరికా షెడ్యూల్‌ మొదలవుతోందని తెలుస్తోంది. ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

  నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ-‘‘హాలీవుడ్‌లో మోషన్ పిక్చర్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వంలో శిక్షణ పొంది, హాలీవుడ్‌లో ‘డార్క్ ఫీల్డ్స్' చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేసి, తెలుగులో ‘కిక్' సురేందర్‌రెడ్డి వద్ద పలు చిత్రాలకు పనిచేసిన పి.సాగర్‌ని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. మంచు మనోజ్‌తో నిర్మిస్తున్న ఈ ‘సన్నాఫ్ పెదరాయుడు' అతి త్వరలో ప్రారంభం అవుతుంది. మనోజ్ కెరీర్‌ని కొత్త మలుపు తిప్పే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాం''అన్నారు.

  English summary
  There is an interesting fact which is going rounds over the Internet. It is NTR and Manoj were born on the same day and same year on 20th May 1983. To make this fact intriguing, Manoj’s faincee’s name is Pranitha and NTr’s wife name too is Pranathi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X