Just In
- 19 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 31 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 51 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 1 hr ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
Don't Miss!
- News
ఇరుకునపడ్డ బీజేపీ.. వాళ్లెవరో తేల్చాల్సిందే.. నేతాజీ జయంతి వేడుకలో ఆ నినాదాలపై ఆర్ఎస్ఎస్ రియాక్షన్
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్: మహేష్ ఒక్కడు సినిమాలో గోపిచంద్.. జస్ట్ మిస్!
2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్కడు సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు నార్మల్ హీరోగా ఉన్న మహేష్ బాబుని మాస్ హీరోలకు మరింతగా దగ్గర చేసిన ఆ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఇండస్ట్రీ టాప్ హిట్స్ లో ఒకటైన ఆ సినిమాకు సంబంధించిన ఒక ఫ్లాష్ బ్యాక్ పై లుక్కేస్తే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది.

గుణశేఖర్ ప్రయత్నాలు..
దర్శకుడు గుణశేఖర్ చూడాలని ఉంది సినిమా తరువాత మహేష్ చేస్తున్న సినిమాలు చూసి తప్పకుండా అతనితో ఒక సినిమా చేయాలని ట్రై చేశాడు. మృగరాజు సినిమా అనంతరం మహేష్ బాబుకి ఒక్కడు స్క్రిప్ట్ వినిపించిన గుణశేఖర్ చాలా మంది నిర్మాతలను కలిశాడు. రామోజీరావు మొదట్లో ఒప్పుకున్నప్పటికి చార్మినార్ సెట్ వేయడం ఇష్టం లేక నో చెప్పారట.

గోపిచంద్ జస్ట్ మిస్..
ఇక యమ్ఎస్.రాజు నిర్మాతగా సెట్టయిన తరువాత సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండ్ అవుతున్న తరుణంలో సినిమాలో విలన్ విషయంలో మార్పులు జరిగాయట. మొదట ప్రకాష్ రాజ్ స్థానంలో విలన్ గా హీరో గోపిచంద్ ని అనుకున్నారట. అప్పటికే జయం సినిమాలో విలన్ గా నటించిన గోపిచంద్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మహేష్ తో పాటు నిర్మాత ఆలోచన మేరకు గుణశేఖర్ ప్రకాష్ రాజ్ ని సెలెక్ట్ చేసుకున్నారట.

అలా ఎందుకు జరిగిందంటే..
2003లో మహేష్ బాబు ఒక్కడు సినిమాతో పాటు తేజ డైరెక్షన్ లో నిజం సినిమా కూడా చేశాడు. దాదాపు రెండు సినిమాలు ఒకే సమయంలో ఒప్పుకోవడంతో రెండు సినిమాల్లో విలన్ గా గోపిచంద్ ఉండడం కరెక్ట్ కాదని మహేష్ అభ్యంతరం వ్యక్తం చేశాడట. దీంతో నిర్మాత ప్రకాష్ రాజ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

అందుకే వర్షంలో విలన్ గా..
నిర్మాత MS.రాజు ఒక్కడు హిట్ తరువాత వర్షం సినిమాను ప్లాన్ చేస్తుండగా ఆ సినిమాలో విలన్ గా గోపిచంద్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కడు సినిమాలో గోపిచంద్ కి ఛాన్స్ మిస్ అయ్యిందని దర్శకుడితో మాట్లాడి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇప్పించారు. ఆ విధంగా గోపిచంద్ ఒక్కడు సినిమాలో ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ ని మిస్సయ్యాడు.