twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ విశ్వరూపం: కమల్ 'ఉత్తమ విలన్‌' (తెలుగు ట్రైలర్)

    By Srikanya
    |

    చెన్నై : 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఉత్తమ విల్లన్‌'. ఆయన స్నేహితుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న రాత్రి హైదరాబాద్ లో జరుగనుంది. రెండేళ్ల పాటు ఎదురుచూస్తున్న కమల్‌ అభిమానులకు ఇదో పెద్ద ఉత్సవంలా మారింది. అభిమానులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ ''సాగరసంగమం, స్వాతిముత్యం సినిమాలు చూస్తే దర్శకుడిగా కె.విశ్వనాథ్‌కీ, నటుడిగా కమల్‌ హాసన్‌కీ మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుస్తుంది. ఆయనలాంటి మంచి దర్శకుడు దొరికితే ఏ నటుడైనా నాలాగే అవుతాడు. నా గురువుగారు కె.బాలచందర్‌ మీద రాసిన కవితను'ఉత్తమ విలన్‌' తమిళ ఆడియో వేడుకలో వినిపించా. అంతటి పాండిత్యం నాకు తెలుగులో లేదు.

    ఆ కవితని రామజోగయ్యశాస్త్రి అర్థం చేసుకొని తెలుగులో అనువదించారు. ఆయనకి నా కృతజ్ఞతలు. చాలా ఏళ్ల క్రితం అన్నయ్య ఎస్పీ బాలసుబ్రమణ్యం 30 వేల పాటల్ని పూర్తి చేసుకొన్నారన్న విషయం తెలిసింది. అప్పటికి అదో రికార్డు. ఈ విషయాన్ని సభాముఖంగా చెబుదామనుకొన్నా అప్పట్లో. అన్నయ్య నన్ను వారించాడు. రికార్డులు సృష్టించడం తప్ప బ్రేక్‌ చేయడం మన పని కాదు అన్న విషయం నా బుర్రకు అప్పుడు అర్థమైంది''అన్నారు.

    Interesting: Kamal Haasan's 'Uttama Villain' Trailer

    ఈ చిత్రానికి గిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. ఇందులో మూడు భిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. 14వ శతాబ్ధానికి చెందిన కళాకారుడిగా, నేటి ట్రెండ్‌కు తగిన ఓ సుప్రీంస్టార్‌గానూ ఇందులో నటించారు కమల్‌. అయితే మూడో పాత్రనే అత్యంత గోప్యంగా ఉంచింది చిత్ర యూనిట్‌.

    ఇందులో కమల్‌ గురువు 'దర్శకశిఖరం' కె.బాలచందర్‌ ముఖ్య భూమిక పోషించారు. అందువల్లే ఈ సినిమా కోసం కమల్‌ అభిమానులు మాత్రమే కాకుండా.. కె.బాలచందర్‌ కుటుంబీకులు, అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ తొలివారంలో సినిమాను తెరపైకి తీసుకురానున్నారు

    జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల కానున్నాయి. ‘ఉత్తమ విలన్‌', ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్‌ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.

    మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్‌ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘ఉత్తమవిలన్‌', ‘విశ్వరూపం-2' సినిమాలు ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి. మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం' రీమేక్‌ ‘పాపనాశం' ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

    కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

    దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Theatrical trailer of 'Uttama Villain' yet again reminds us how good an actor Kamal Haasan is and the passion he have for cinema. The trailer cut for the Telugu version is pretty impressive and dedicating the film to his mentor K Balachander is a touching gesture.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X