»   » బన్నీ క్లారిటీ ఇవ్వాలంటే.. భరత్ అనే నేను బయటకు రావాలి!

బన్నీ క్లారిటీ ఇవ్వాలంటే.. భరత్ అనే నేను బయటకు రావాలి!

Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ టాప్ హీరోలంతా వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పుడూ సినిమాల విషయంలో హుషారుగా వ్యవహరించే బన్నీ ఈ సారి కాస్త నెమ్మదించాడు. నా పేరు సూర్య చిత్రం తరువాత అల్లు అర్జున్ నటించబోయే చిత్రం గురించి ఇంకా క్లారిటీ రావడం లేదు.

Interesting speculations on Allu Arjun next movie

ఆ మధ్యన కొరటాల శివ బన్నీని కలిసాడని, వీరిద్దరి కలయికలో తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ మాత్రం అదే సైలెంట్ కొనసాగిస్తున్నాడు. బన్నీ కొరటాల దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నాడని, కానీ భరత్ అనే నేను చిత్రం విడుదలయ్యాక తన నిర్ణయాన్ని ప్రకటించాలనే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు కొత్త దర్శకులు కూడా కథలు వివరిస్తూ బన్నీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారట. స్టైలిష్ స్టార్ నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

English summary
Interesting speculations on Allu Arjun next movie. Allu Arjun keeps Koratala Siva waiting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X