»   »  అక్కినేని పుట్టినరోజు వెనక....ఇంట్రెస్టింగ్ స్టోరీ!

అక్కినేని పుట్టినరోజు వెనక....ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆయన అనుభవం ఇప్పుడు సినిమా ఇండస్ర్టీలో వున్న వాళ్ల వయసు కంటే ఎక్కువ. కానీ ఇప్పటికీ యువనాయకులతో పోటీపడగల ఉత్సాహం ఆయన సొంతం. అతనో 90 ఏళ్ల కుర్రాడు. అతనే అక్కినేని నాగేశ్వర రావు. ఈ రోజు(సెపెంబరు 20) ఆయన పుట్టినరోజు. ప్రేక్షకులని కంటతడి పెట్టించాలన్నా, గిలిగింతలు పెట్టించాలన్నా ఆయనకు ఆయనే సాటి. అలాంటి గ్రేట్ యాక్టర్ పుట్టినరోజంటే అభిమానులకు పండగ రోజు.

ఇలాంటి సందర్భంలో ఆయన పుట్టినరోజు గురించి ఓ ముఖ్యవిషయం తెలుసుకుందాం. అసలు అక్కినేని గారి పుట్టినరోజు ఎప్పుడో ఆయనకు 20 ఏళ్లు వచ్చేవరకూ తెలియదట. తెలుసుకోవలసిన అవసరం కూడా రాలేదని అంటారు ఆయన. కానీ ఓ సారి ఐదు వేల రూపాయలకు భీమా పాలసి తీసుకున్నారు. అప్పుడే పుట్టినరోజు తెలుసుకోవలసిన అవసరం వచ్చిందట.

Interesting story behind ANR's birthday

అప్పుడు గుడివాడలోని తాలూకా ఆఫీసులో పాత రికార్డులన్నీ తిరగేస్తే 1924 సెపెంబరు 21, ఆదివారం పుట్టారని రాసివుంది. కానీ వారి అమ్మగారేమో నువ్వు శనివారం పుట్టావురా అబ్బాయ్ అని ఖచ్చితంగా చెప్పిందట. తర్వాత తెలిసిందేమిటంటే వారుంటున్న వెంకట్రాఘవపురం నుండీ గుడివాడలోనున్న తాలూకా ఆఫీసు రికార్డుల్లో నమోదుచేయించడం ఒక రోజు ఆలస్యం అయిందట.

ఆయన నటించిన 'బుద్దిమంతుడు' చిత్రం సెపెంబరు 20న విడుదలయిందట. పోస్టర్ల మీద పుట్టినరోజు విడుదల అని సదురు నిర్మాత అడిగాడట. సరే అన్నారట అక్కినేని. దీంతో ఆయన అభిమానులకు ఆయన పుట్టిన రోజును జరుపుకొనే అవకాశం వచ్చింది. ఈ రోజుతో 90వ పడిలోకి అడుగిడుతున్న ఎయన్నార్ తన తనయుడు నాగార్జునతో పోటీపడి 'రామదాసు' చిత్రంలో నటించి తనలో ఇంకా ఉత్సాహం తగ్గలేదని నిరూపించారు.

ఇపుడు కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి 'మనం' చిత్రంలో నటిస్తున్నారు. ఆయన వయసు 90 అయినా ఆయన ఇప్పటికీ కుర్రాడిలా హుషారుగా వుంటారు. దీనికి ఆయన క్రమశిక్షనతో కూడుకున్న దినచర్యే కారణం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ....వన్ ఇండియా తెలుగు తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.

English summary
Akkineni Nageswara Rao entered 90th year today. He is the living legend of Telugu cinema, was honored with the prestigious Dada Saheb Phalke Award for his illustrious journey through out his career in the Telugu film industry. Yet, he is a humble person who gives the entire credit of his triumph to his co-actors and others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu