»   »  '1.. నేనొక్కడినే' కి సీక్వెల్, టైటిల్ ఏంటంటే

'1.. నేనొక్కడినే' కి సీక్వెల్, టైటిల్ ఏంటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ హీరోగా,సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం '1.. నేనొక్కడినే'. ఈరోస్ ఇంటర్నేషనల్ సహకారంతో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10న విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్‌ను అధిగమించి, అన్ని చోట్లా మంచి కలెక్షన్లతో నడుస్తోంది. ఈ చిత్రం గురించి సుకుమార్ మాట్లాడుతూ..సీక్వెల్ గురించి తెలియచేసారు. సీక్వెల్ చేయాలని ఉందని, దానికి '1+1' అనే టైటిల్ పెడతానని అన్నారు.

ఇక సినిమాకి అన్ని చోట్ల నుంచీ రిపోర్టూ బాగుంది. విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. క్రమంగా టాక్ పికప్ అయ్యి ఇప్పుడు చాలా బాగుంది. ఓవర్సీస్‌లో మరింత ట్రెమండస్ రెస్పాన్స్ ఉంది. అక్కడ గ్రాండ్ సక్సెస్. ఒక్కోసారి ఆలోచింపజెయ్యడం కూడా ఆనందకర విషయం అవుతుంది. ఈ సినిమా సక్సెస్‌కి ఓ రకంగా అది కూడా కారణమే అన్నారు.

అలాగే ఇలాంటి ఆలోచింపజేసే సినిమా షార్ప్‌గా ఉండాలి. అందుకే 20 నిమిషాల నిడివి తగ్గించాం. ఇండస్ట్రీ మొత్తం నుంచి ఈ సినిమాకి సపోర్ట్ వచ్చింది. ఎన్నో కాల్స్ వచ్చాయి. రవితేజ, రామ్, నాని సహా చాలా మంది హీరోలు, రాజమౌళి, పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి సహా చాలా మంది డైరెక్టర్లు, చోటా కె. నాయుడు వంటి టెక్నీషియన్లు సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం జర్మన్, ఫ్రెంచి భాషల్లో డబ్బింగ్ చేసే ప్రక్రియ నడుస్తోంది. ఆ తర్వాత మరికొన్ని ప్రపంచ భాషల్లో డబ్ చేయబోతున్నాం అని తెలియచేసారు.

English summary
In the recent interview Sukku has expressed his desire to do '1-Nenokkadine', sequel. While speaking Sukumar also reveals a title for the sequel “If at all ‘1’ sequel is made, ‘1+1’ will be the title” said Sukumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu