»   » వరుణ్ తేజ్ స్పేస్ థ్రిల్లర్ మూవీకి అలాంటి టైటిలా!

వరుణ్ తేజ్ స్పేస్ థ్రిల్లర్ మూవీకి అలాంటి టైటిలా!

Subscribe to Filmibeat Telugu

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్పేస్ నేపథ్యంలో సాగుతుంది. ఘజిలాంటి విభిన్న చిత్రంతో ఆకట్టుకున్న సంకల్ప్ రెడ్డి చేస్తున్న మరో ప్రయోగం ఈ చిత్రం. ఫిదా, తొలి ప్రేమ చిత్రాల తరువాత వరుణ్ తేజ్ క్రేజ్ పెరిగింది. దీనితో వరుణ్ తేజ్ తదుపరి చిత్రాలపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి.

ఈ చిత్రం కోసం స్పేస్ షిప్ ప్రత్యేకమైన సెట్ వేసి అందులో చిత్రీకరించనున్నారు. కాగా ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ కథ పరంగా సరిపోతుందని దర్శకుడు సంకల్ప్ రెడ్డి భావిస్తున్నాడట.

Interesting title in consideration for Varun Tej next

చిత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కనుక టైటిల్ గురించి అధికారిక ప్రకటన రావలసి ఉంది. వ్యోమగామి అనే మరో టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

English summary
Interesting title in consideration for Varun Tej next. Sankalp Reddy directing this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X