న్యూయార్క్‌లో మొదలైన మహేష్ కొత్త సినిమా పనులు.. పక్కాగా ప్లానింగ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నమొన్నటి వరకు భరత్ అనే నేను చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా గడిపాడు. భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలియందే. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ ఈ విజయాన్ని ఆస్వాదిస్తుంటే.. దర్శకుడు వంశి పైడి పల్లి మహేష్ కొత్త సినిమా పనులని ప్రారంభించేసాడు.
మహేష్ తో సినిమా కోసం ఈ దర్శకుడు రెండేళ్ల పాటు చూసిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను చిత్రం పూర్తి కావడంతో ఇప్పుడు వంశి పైడి పల్లి వంతు వచ్చింది. త్వరలో ఈ చిత్రం ప్రారంభించడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ లోపు చిత్ర లొకేషన్స్ ని ఫైనల్ చేసే పనిలో వంశి పైడిపల్లి బిజీగా ఉన్నాడు.
కథ పరంగా ఈ చిత్రం విదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. వంశి పైడిపల్లి, కెమెరామన్ మోహనన్ తో కలసి న్యూయార్క్ లో కీలకమైన లొకేషనల్స్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ విషయాన్ని వంశి సోషల్ మియాద ద్వారా వెల్లడించాడు. ఎవడు, ఊపిరి వంటి చిత్రాలతో వంశి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











