»   » అదిరింది: సినిమాలో అదరగొట్టేందుకు ఆ హీరో ఏం చేశాడో తెలుసా?

అదిరింది: సినిమాలో అదరగొట్టేందుకు ఆ హీరో ఏం చేశాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
సినిమాలో అదరగొట్టేందుకు ఆ హీరో ఏం చేశాడో తెలుసా?

తమిళనాట హీరో విజయ్ ఎంత పెద్ద హీరోనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీకాంత్ తర్వాత ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు విజయ్. విజయ్ ప్రస్తుతం 'మెర్స‌ల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో 'అదిరింది' పేరుతో విడేదల కానుంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై శ‌ర‌త్ మ‌రార్ విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది అదిరింది. ఇందులో విజ‌య్ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పంచాయ‌తి పెద్ద‌గా.. డాక్ట‌ర్ గా.. మెజీషియ‌న్ గా మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో నటించాడు.

విజయ్ హోం వర్క్

విజయ్ హోం వర్క్

పంచాయతీ పెద్ద‌, డాక్ట‌ర్ పాత్ర‌లకు సంబంధించిన షూటింగ్ ఇండియాలోనే పూర్తి చేశారు. మెజీషియ‌న్ పాత్ర‌ను యూర‌ప్ లో చిత్రీక‌రించారు. ఈ పాత్ర కోసం విజ‌య్ చాలా హోమ్ వ‌ర్క్ చేశారు.

ఇంటర్నేషనల్ మెజీషియన్స్

ఇంటర్నేషనల్ మెజీషియన్స్

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన మెజీషియన్లు మెసిడోనియాకు చెందిన‌ గోగో రెఖియం.. బ‌ల్లేరియాకు చెందిన డానీ బెలెవ్.. కెన‌డాకు చెందిన రామ‌న్ శ‌ర్మ ఈ చిత్రం కోసం విజ‌య్‌కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించారు. అంతేకాదు.. మెసిడోనియాలో షూటింగ్ చేసుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావ‌డం విశేషం. మూడు పాత్ర‌ల‌ను అద్భుతంగా చేసిన విజ‌య్.. మెజీషియ‌న్ పాత్ర కోసం బాగా ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డాడు.

రేఖియం మాట్లాడుతూ..

రేఖియం మాట్లాడుతూ..

ఇందులో విజ‌య్ కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించిన రేఖియం మాట్లాడుతూ.. విజ‌య్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇలాంటి మ్యాజిక్స్ నేర్చుకోవాలంటే చాలా టైమ్ ప‌డుతుంది. కానీ విజ‌య్ మాత్రం చాలా త్వ‌ర‌గా.. త‌క్కువ టైమ్ లోనే ఈ ట్రిక్స్ అన్నీ ప‌ట్టేసాడు. ఆయ‌న చాలా తీక్ష‌ణంగా ప‌రిశీలిస్తాడు.. త్వ‌ర‌గా నేర్చుకుంటాడు అని తెలిపాడు.

సినిమాలు వదిలేస్తే పెద్ద మెజీషియన్ అవుతాడు

సినిమాలు వదిలేస్తే పెద్ద మెజీషియన్ అవుతాడు

మ‌రో మెజీషియ‌న్ రామ‌న్ శ‌ర్మ మాట్లాడుతూ విజ‌య్ మెజీషియ‌న్ అవ్వాల‌ని కోరుకుంటే.. అత‌డు చాలా పెద్ద స్థాయికి ఎదుగుతాడు. అతడిలో ఆ సత్తా ఉంది అని వ్యాఖ్యానించడం గమనార్హం.

హెల్ఫ్ చేసిన భారతీయులు

హెల్ఫ్ చేసిన భారతీయులు

సినిమాలో విజ‌య్ చేసే మ్యాజిక్స్ అద్భుతంగా ఉంటాయంటున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీకుమార్. మెసిడోనియాలో ఉండే భార‌తీయులు మెర్స‌ల్ షూటింగ్ కోసం సాయ‌ప‌డ్డార‌ని చెప్పారు చిత్ర‌యూనిట్.

3 వేల థియేటర్లలో రిలీజ్

3 వేల థియేటర్లలో రిలీజ్

ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో స‌మంత‌, నిత్యామీన‌న్, కాజ‌ల్ హీరోయిన్లుగా న‌టించారు. అక్టోబ‌ర్ 18న తెలుగు, త‌మిళ భాష‌లతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా 3000కు పైగా థియేటర్లలో విడుద‌ల‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Vijay starrer Adhirindhi is gearing up for a huge release as a Diwali special on October 18 in the two Telugu speaking states. The pre-release buzz surrounding the film is extremely positive and it’s going to be the biggest ever release for a Vijay’s film in Telugu. Directed by Atlee, the film has Vijay playing three different roles - a village panchayat head, a doctor, and a magician. While the portions featuring Vijay as a panchayat head and a doctor were shot in India, the team flew to Europe to shoot the segment featuring Vijay as a magician. Adhirindhi is also the first Indian film to be shot in Macedonia. Since Atlee and Vijay were keen to make the whole film authentic, three internationally renowned magicians - Gogo Requiem (Macedonia), Dani Belev (Bulgaria) and Raman Sharma (Canada) - were roped in to train Vijay to perform several magic tricks in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu