»   » అంతా అనుకున్నట్టు జరిగితే లైఫ్ లో కిక్ ఏముంటుంది..., హీరో శ్రీవిష్ణు తో ఫిల్మీబీట్ చిట్ చాట్

అంతా అనుకున్నట్టు జరిగితే లైఫ్ లో కిక్ ఏముంటుంది..., హీరో శ్రీవిష్ణు తో ఫిల్మీబీట్ చిట్ చాట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

  రెండు సంవత్సరాల కింద -- చేతిలో కొన్ని స్క్రిప్టు పేపర్లు పట్టుకుని కూచున్నారిద్దరూ.. అప్పటికే కొన్ని నెలలుగా అదే స్క్రిప్ట్ ని అలా చూస్తూనే ఉన్నారు.కొన్ని సార్లు మరికొందరు మితృలుండేవాళ్ళు., ఒక్కోసారి ఈ ఇద్దరే అలా గంటలకొద్దీ అదే స్క్రిప్ట్ తో... "రైల్వేరాజు ఒక పాత్ర అమ్మ, ఫ్రెండ్స్, క్రికెట్ తప్ప మరో విషయం తెలియని కుర్రాడు. ఎప్పటికైన రంజీ జట్టులో స్థానం సంపాదించి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటాడు. అమ్మయకంగా క్రికెట్ అనే కలని కంటూ అదే శ్వాసగా బతికే ఒక సాధారణకుర్రవాడే ఒక్క రోజు మలుపుతో పూర్తిగా తారుమారైపోతుంది.. ఊహించకుండానే అన్ని కలలనీ కూప్పగా తగలబడిపోతూంటే నిస్సహాయంగా చూసి... తను చేసిన నేరమేమిటో తెలియక పోలీస్ కేసుల్లో ఇరుక్కుని సర్వనాశనం అయిపోతున్న దశలో తిరగబడాలి లోకల్ గూండానుంచీ చిన్న సైజు మాఫియా లీడర్ గా ఎదగాలి... ఇదీ క్యారెక్టర్.. "

  కొన్నళ్ళ కింద రోహిత్ కి వేరే కథ చెప్పటానికి వెళ్ళినప్పుడు కలిసారిద్దరూ.. ఎందుకో ప్రాజెక్ట్ ఓకే అవ్వలేదు.. సాగర్ విష్ణు ల ఫ్రెండ్షిప్ మాత్రం పక్కా అయ్యింది. ఒక క్రికెటర్ గ్యాంగ్ స్టర్ గా మారటం... ఆ పాత్రలో ఉండే షేడ్స్ శ్రీవిష్ణుకి బాగా నచ్చేసింది... అదే స్క్రిప్ట్ ని పట్టుకున్నారు ఇద్దరూ కలిసి.. నిజజీవిత కథలని, తనను వెంటాడిన అనుభవాలనీ కలిపాడు సాగర్... రైల్వే రాజు క్యారెక్టర్ ఇంకా బలంగా తయారయ్యింది, మరిన్ని పాత్రలతో, సంవత్సరాల తపనతో పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ తయారయ్యింది. రోజులు నెలలపాటు సినిమా ఆఫీసులచుట్టూ చెక్కర్లు కొట్టటం మొదలయ్యింది... కుదిరినట్టే కుదిరి..ఆగిపోయేది దగ్గరివాళ్ళుకూడా ఆ స్క్రిప్ట్ వర్కౌట్ అవటం కష్టం వేరే ఏదైనా ట్రై చేయొచ్చు కదా...! అన్న సలహాలు.. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి?? అనుకున్నప్పుడల్లా ఎలా అయినా సరే... ఇదే సబ్జెక్ట్ ని చెయ్యాలి అన్నట్టుగా ఉండేవాడు శ్రీవిష్ణూ...

  కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత... ఆరన్ మీడియా ఆఫీస్...
  నారారోహిత్ ముందు "బావుంది ఇక అక్కడా ఇక్కడా తిరక్కండి మనమే చేద్దాం... అయితే డబ్బులు పోవటం రావటం మరో మాట, మొదటి సినిమా అటూ ఇటూ అయితే మళ్ళీ మీ ఫ్యూచర్ కి ప్రాబ్లం అవుతుందే ఆలొచించుకున్నారా???"
  ఇద్దరూ ఒకే సారి చెప్పారు "అన్నీ ఆలోచించాం"
  అయితే ఓకే మనం సినిమా చేస్తున్నాం.... తేల్చి పడేసాడు, ఇంక మీదే ఆలస్యం అన్నట్టు... ఇక "అప్పట్లో ఒకడున్నాడు" మొదలయ్యాడు....

  అప్పట్లో ఒకడుండేవాడు సినిమా రావటానికి రెండు నెలలముందు.... పేరులోనే ఒక నోస్టాల్జిక్ ఫీల్, పవర్పాక్డ్ కథనం తో వచ్చిన సినిమా కొత్తకుర్రాడు కదా ఎలా చేసి ఉంటాడు? అప్పటికే హీరోగానూ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్లని ఎంచుకుంటూ వెళ్తున్న నారా రోహిత్ కూడా ఉన్నాడట.

  కొన్ని రోజుల ముందు---పోస్టర్లు ఇంట్రస్టింగా ఉన్నయ్... ట్రైలర్ కూడా సూపర్ గా ఉంది బాగానే కష్టపడ్డట్టున్నారు హిట్ అవ్వొచ్చు. కొత్త కుర్రాడు బాగా కనిపిస్తున్నాడు..

  డిసెంబర్ 30.. నీయవ్వ ఏమ్మన్న ఉందా...! కొత్త హీరో శ్రీవిష్ణు అట డైరెక్టర్ సాగర్ మస్త్ తీసిండు సీన్మా.. ఇంతియాజ్ లెక్క రోహిత్ జబ్బర్దస్తున్నడ్రా .... ఒకటీ రెండూ మూడూ ఎక్కడా పెద్ద పెద్ద హోర్డింగులు లేవు...ఎక్కడా లక్షలు ఖర్చుపెట్టి ప్రమోషన్లు లేవు.... ఒక పక్క సొషల్ మీడియా దద్దరిల్లిపోతోంది... హాష్టాగ్ లతో "అప్పట్లో ఒకడుండేవాడు" ఫొటోలతో ఫేస్బుక్ నిండిపోయింది....

  కట్ చేస్తే... సాగర్ చంద్ర, శ్రీవిష్ణూ ఓవర్నైట్ స్టార్లు, మామూలుగానే "విషయం ఉంటే తప్ప రోహిత్ చేయడు" అన్న నమ్మకం ఎటూ ఉన్న రోహిత్ ఆఫీసులో కూడా ఎన్ని లాభాలు వచ్చాయో అన్న అనుమానం తో ఐటీ రైడ్... (అఫ్ కోర్స్ మిస్టర్ డిఫరెంటే కాదు రోహిత్ మిస్టర్ క్లియర్ కూడా)... ఇంత హైప్రావటానికి కారణం అందరూ అయినా అందరికంటే మరింత ఆనందంగా ఉన్న వ్యక్తి శ్రీవిష్ణు...కాదు కాదు రైల్వేరాజు... ఇలా కొన్ని నిమిషాల పాటు ఫిల్మీ బీట్ తో తన అనుభవాలని పంచుకున్నాడు.... రైల్వే రాజు తో ఇంటర్వ్యూ కింద చూడండి..

  మూగ్గురం నడుస్తూ రోడ్లని కొలుస్తూ... మాట్లాడటం మొదలు పెట్టాం.. రోడ్డు మధ్యలో ఉన్న ఒక రాయిని పక్కకు తన్నేసి ఇక అడగవచ్చు అన్నట్టు చూసాడు... మరీ రోటీన్ ప్రశ్నలు వదిలేసి సూటిగా రంగం లోకి దిగిపోయాం....

   అప్పుడే చేస్తున్నా అన్న ఫీలింగ్ లేదు;

  అప్పుడే చేస్తున్నా అన్న ఫీలింగ్ లేదు;


  మొదటి సారి రైల్వేరాజు పాత్రని చేస్తున్నా అన్నప్పుడు ఎలా అనిపించిందీ..?

  ఎక్సైటింగ్ పెద్దగా లేదు... ఎందుకంటే షూటింగ్ మొదలు పెట్టే నాటికే నేను ఆ పాత్రలో కొన్ని వందల సార్లు ఊహించుకున్నాను... మొదటి సారి ఆ పాత్రని విన్నప్పుడే నేను రైల్వే రాజు గా అయిపోయినట్టే ఊహించుకున్నాను. అందుకే ఏసీన్లో కూడా నాకు అప్పుడే చేస్తున్నా అన్న ఫీలింగ్ లేదు. ఇక డైరెక్టర్ సాగర్ నేనూ ప్రతీ సీన్ ని కొన్ని వందల సార్లు చర్చించుకున్నాం... సో ఎక్కడా "నటిస్తున్నా" అన్న బెరుకు లేదు.సీన్ చెప్పగానే వెళ్ళటం చేసేయటం.

   చాలెంజింగ్ గా అనిపించింది:

  చాలెంజింగ్ గా అనిపించింది:


  ఇది మీ మొదటి సినిమా కాక పోయినా.. అప్పటికే హీరోగా చేసిన నారా రోహిత్ తో చేస్తున్నప్పుడు. డామినేట్ చేస్తాడేమో అనిపించలేదా..??

  (పక్కనే ఉన్న చెట్టుకిందకి చూపించారు... అక్కడే ఉన్న రాళ్ళ మీద కూచున్నాక) రోహిత్ గారి వల్ల నేనేం ఇబ్బంది పడలేదు కానీ రోహిత్ వాయిస్ తో కొట్టెస్తారు... ఇక సీరియస్ నెస్ ఉన్న డైలాగ్ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఆ ఒక్కటి మాత్రం చాలెంజింగ్ గా అనిపించింది. అయితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అవటం, సీన్ చేయటానికి ముందు చాలా సేపు డిస్కషన్ చేయటం వల్ల ఇబ్బంది అనిపించలేదు. అదే పాత్రని వేరే ఎవరన్నా చేసి ఉంటే చెప్పలేం.. కానీ నా పాత్రని నేను చేయగలను అని నేను నమ్మాను ఇక ఆతర్వాత వేరే విషయాలు అంతగా పట్టించుకోవాలి అనిపించలేదు.

   బయటికి రాలేదు:

  బయటికి రాలేదు:


  మామూలుగా ఉండే శ్రీ విష్ణు వేరు ఇలా నవ్వుతూ నవ్విస్తూ కానీ రైల్వేరాజు పాత్ర అలా లేదు.. దానికోసం ప్రాక్టీస్ ఏమైనా చేసారా?

  ప్రాక్టీస్ అనేది స్క్రిప్ట్ దశలోనే అయిపోయింది ఎక్కడా ఆ పాత్రని దాటి బయటికి రాలేదునేను... ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటాను ప్రతీ మాటకుముందూ నవ్వుతూ... హైపర్ యాక్టివ్గా ఉంటాను నిజానికి ఆ సీన్లలో కొత్తగా నటించిందేం లేదు మాములుగా నేను ఎలా ఉంటానో అలాగే ఉంటుందా పాత్ర అయితే తర్వాత ఒక్కసారి గా వాడి ప్రాణం అనుకున్న క్రికెట్ ఇక లేదు అనిపించినప్పుడు పాత్ర వైల్డ్ గా మారిపోవాలి అక్కడకూడా మరీ డ్రామాటిక్ గా ఉండాలి అనుకోలేదు. అంటే చేతిలో ఒక మందు బాటిల్ పెట్టి ఒక ఐటం సాంగ్ లాంటి ఉండకూడదనుకున్నాం... అన్నీ రియాలిటీకి దగ్గరగా ఉంచుకున్నాం కాబట్టే పెద్దగా నటించటం కోసం ప్రాక్టీస్ చేసుకునే అవసరం రాలేదు..

   అల్లరి చేసేవాన్ని:

  అల్లరి చేసేవాన్ని:

  ఒకే..! అప్పట్లో బాల శ్రీవిష్ణు అని ఒకడుండేవాడు కదా అప్పటి సంగతేమిటీ... అప్పట్లోనే నటన మీద ఏమైనా??

  హ..హ..హ..! పిచ్చి పిచ్చిగా అల్లరి చేసేవాన్ని... కానీ అల్లరిలో కూడా సిన్సియారిటీ, డేడికేషన్ ఉండటం వల్ల ఎవ్వరికీ దొరికే వాన్ని కాదు. పెద్దాళ్ళకీ, టీచర్లకీ ఎప్పుడూ దొరకలేదు... అయితే క్రికెట్ అంటే మాత్రం విపరీతమైన ఇష్టం ఉండేది. గంటల కొద్దీ గ్రౌండ్ లోనే ఉండేవాన్ని. చదువులో మరీ డల్ కాదు అలా అని ర్యాంకర్ని కూడా కాదు ఫెయిల్ అవకుండా దాటుకొచ్చేవాన్ని. అప్పటికి నాకు తెలిసిందల్లా... పాసవటానికి అవసరమైనంత చదివి ఆతర్వాత మిగిలే టైం లో క్రికెట్ ఆడాలి లేదంటే సినిమాలు చూడాలి అంతే.. అసలు బయటి ప్రపంచం లో ఏంజరుగుతూందో కూడా పట్టించుకునే వాన్ని కాదు. నాకు క్రికెట్ ఒక వ్యసనమైతే... సినిమా ఇంకో అడిక్షన్ అయ్యింది... అదేంటో కష్టపడి చదువుదాం అన్నా నావల్ల ఆయేది కాదు.., మార్కుల్లో స్కోర్కంటే క్రికెట్ స్కోర్ ఎక్కువ అనిపించేది. ఇంట్లో కూడా ఎప్పుడూ పుస్తకాలూ, ర్యాంకులూ అంటూ హద్దులెప్పుడూ లేవు. బహుశానేను క్రికెట్ ఆడటానికే పుట్టానేమో అనిపించేది.

   చాలా విషయాలే నేర్చుకున్నాను:

  చాలా విషయాలే నేర్చుకున్నాను:


  యాక్టింగ్ లోకి ఎలా వచ్చారు?
  ఇదో పెద్దకథ.... (నవ్వుతూ) అసలు నేను యాక్టింగ్ కి పనికి వస్తాను అన్న నమ్మకం నాకేలేదు. అయితే తర్వాత థియేటర్ ఆర్ట్స్ లోకి వచ్చాను వినయ్ వర్మ గారి దగ్గర నేను కోర్స్ చేసినప్పటినుంచీ ఇక యాక్టింగ్ వైపుకూడా మనసు లాగటం మొదలు పెట్టింది. ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదామనుకున్నా మొహమాటం తో ఎక్కడా జాయిన్ అవలేకపోయాను కాకపోతే ఫ్రెండ్స్ ఎక్కువగాఉండటం వల్ల చాలా సినిమాలను ప్రీ ప్రొడక్షన్ దశ నునుంచీ పోస్ట్ ప్రొడక్షన్ వరకూ మొత్తం చూసాను అలా చాలా విషయాలే నేర్చుకున్నాను. ఆ నేర్చుకునే ప్రాసేసే నా ట్రైనింగ్ అనుకుంటాను.

  (అక్కన్నుంచి మా ప్లేస్ టీషాప్ లోకి మారింది రోడ్డుపక్కన ఉన్న చిన్న బడ్డీ కొట్టు. అతనిలో ఎక్కడా నేనిపుడు హీరోని కదా అన్న ఫీలింగ్ కనిపించలేదు మాట్లాడుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాడు ఫస్టాఫ్ లో క్రికెట్ ఆడే రైల్వే రాజు లాగా)

   డైరెక్షన్ కోసమే:

  డైరెక్షన్ కోసమే:


  ముందు డైరెక్టర్ అవ్వాలనికదా అనుకున్నారు... అది పక్కకు జరిపేసి నటనలోకి రావటం ఎందుకని? ఎలా జరిగింది?

  అసలు నేను నటన మొదలు పెట్టింది కూడా డైరెక్షన్ కోసమే... ఎక్కడైనా ఆఫర్ కోసం ప్రయత్నించాలీ అంటే ముందు మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఆ ఐడెంటిటీ కోసమే నేను యాక్టింగ్ ని ఎంచుకున్నాను. అయితే నటించటం మొదలు పెట్టాక ఇక్కడ ఉండే కిక్క్ కి అడిక్ట్ అయిపోయాను. ఒక్కొక్క పాత్ర తర్వాత అందరూ మెచ్చుకోవటం.. బావుందనటం చూసాక మరింత సీరియస్ గా పని చేయాలనిపించింది. ఇప్పటికీ నేను చేసిన ప్రతీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్తమైందే...

   చెప్పటం కష్టం :

  చెప్పటం కష్టం :

  ఇప్పటివరకూ చేసినవి చిన్న పాత్రలే కదా వాటిలో మీకునచ్చిందేమిటి?

  చాలానే చేసాను దాదాపు ఇరవై చేసాను కానీ దీనితోనే బ్లాస్ట్ అయ్యాను... లవ్ ఈజ్ బ్యూటిఫ్యుల్, లవ్ ఫెయిల్యూర్, ఇలా... మొన్న ఈ మధ్యనే వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా లో కూడా చేసాను. వీటిల్లో ఏది నచ్చిందీ అంటే చెప్పటం కష్టం ప్రతీ పాత్రనీ స్పెషల్ గానే అనుకున్నాను. నేను నటించటం అన్నదే నాకు ఇష్టమైన పని కాబట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ అన్న ఆలోచనే లేదు..

  చిన్న పాత్రలు కదా నేనేమిటీ ఇలాంటివి చేయటం ఏమిటీ అనిపించేదా?

  చిన్న పాత్రలు కదా నేనేమిటీ ఇలాంటివి చేయటం ఏమిటీ అనిపించేదా?

  ఎప్పుడూ అనిపించలేదు నిజానికి అప్పుడే నాకు హీరో గా గనక అవకాశం వచ్చి ఉంటే ఈ పాటికి నేను ఫెయిల్యూర్ గా ఉండేవాన్ని. ఇంత మెచ్యూరిటీ అప్పటికి రాలేదు.. ఆ సమయానికి నేనేం చేయాలో అదే నాకు దొరికింది. ఆ ప్రాసెస్ లోనే నటుడిగా ఒక అవగాహణ వచ్చింది. అవి చిన్న పాత్రలు అని ఆలోచించి ఉంటే నేను నేర్చుకోవటానికి నేనే తలుపులు వేసుకున్నట్టు అయ్యేది.

   స్ట్రగుల్ అని అనుకోలేదు :

  స్ట్రగుల్ అని అనుకోలేదు :


  జనరల్ గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరికీ ఒక స్ట్రగుల్ ఉంటుంది. భాధపెట్టిన సంఘటనలూ ఉంటాయి అలాంటివేమైనా ఉన్నాయా..

  తెలియదు..! ఎందుకంటే ఎప్పుడూ స్ట్రగుల్ అని అనుకోలేదు మామూలుగా మనం ఒక ఇంజినీరింగ్ పట్టా తీసుకోవాలీ అంటే... ముందు స్కూల్ కివెల్లాలి ఎగ్జామ్ప్ రాయాలి, ఇంటర్, ఎంసెట్ ఇలా ప్రతీ చోటా పాసవ్వాలి ఇప్పటి వరకూ నేను చేసింది అదే అది స్ట్రగుల్ కాదు నేను నేర్చుకుంటూ వచ్చిన కోర్స్ అనుకుంటాను. అలాంటి సంఘటనలని గుర్తు చెసుకోవటం, అవి ఏదో ఘోరమైన సంఘటనలు గా అనుకోవటం కరెక్ట్ కాదు. మనం ఎదగటం లో వచ్చిన మెట్లు అనే అనుకుంటాను... అవన్నీ లేకుండా డైరెక్ట్ గా హీరో అయిఉంటే ఈ పాటికి వేరే ఏ బిజినెస్ లోనో, జాబ్ లోనో ఉండేవాన్ని.

   ఆ భయం ఉందా?

  ఆ భయం ఉందా?


  ఒకప్పుడు ప్రేమదేశం అనే సినిమా వచ్చింది... అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా ఆ ఇద్దరు హీరోలూ ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ ఇద్దరూ తెరమరుగయ్యారు... అలాగే ఒక్క సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయి... తర్వాత ఆ సక్సెస్ ని హ్యాండిల్ చేయటం లో తడబడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు.. అలాంటి భయం ఎప్పుడైనా ఉందా???

  ఎప్పుడూ లేదు...ఎందుకంటే అది మన చేతుల్లో లేని విషయం, ఒకవేళ అలా వెళ్ళిపోయినా నాకే భాదా లేదు ఎందుకంటే ఆలోపే ఖచ్చితంగా నాది అనే ఒక ముధ్ర వేసి తీరతాను... విష్ణు అనగానే అప్పట్లో ఒకడుండేవాడు ఆడు సూపరసలు అనిపించాలి...

   నావల్ల నిర్మాత భాదపడకూడదు:

  నావల్ల నిర్మాత భాదపడకూడదు:


  ఇప్పుడు కొత్త ఆఫర్లు చాలానే వస్తున్నట్టున్నయ్ కదా... ఎలాంటి పాత్రలని ఎంచుకోవాలనుకుంటున్నారు?

  అవును ఆఫర్లైతే వస్తున్నాయి అయితే వాటిలో మనం దేనికి న్యాయం చేయగలుగుతామో చూడాలి కదా... ఒక పాత్రని నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అనిపించాలి. నిర్మాతకి వచ్చే నష్టం లో నా వంతు పదిరూపాయలు అనుకున్నా అధి నన్ను బాదించే విషయమే. కథ వినేటప్పుడే మనం చేయబోయే పాత్ర పై ఒక అవగాహనకి వస్తాం ఆ పాత్రకి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాను అనిపించినప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నావల్ల నిర్మాత భాదపడకూడదు. నేను చేయలేను అనిపించిన పాత్రని నిజాయితీగా ఒప్పేసుకుంటాను... అదే మాట చెప్పేస్తాను కూడా...

   నేను సరిపోతాను అనిపించినప్పుడు:

  నేను సరిపోతాను అనిపించినప్పుడు:


  ఇప్పుడు శ్రీవిష్ణు హీరో అయ్యాడు కదా..! మరి ఒక వేళ హీరో పాత్ర కాకుండా వేరే పాత్ర వస్తే చేస్తారా? లేక హీరో గా మాత్రమే చేస్తారా

  అక్కడ వచ్చే పాత్ర కి నేను సరిపోతాను అనిపించినప్పుడు సింగిల్ ఫ్రేమ్ లో కనిపించి వెళ్ళిపోతాను. అందరూ ఎలా ఆలోచిస్తారో తెలీదు గానీ నాకు మాత్రం హీరో క్యారెక్టర్ కంటే మామూలు రోలె కాస్త స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది. మన పాత్రకి న్యాయం చెసామా అన్నంత వరకె ఉండదు ఇంకా ఏదో తెలియకుండానే కొంత స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే రేపు సినిమా ఏమాత్రం అటూ ఇటైనా మొట్టమొదటి టార్గెట్ హీరోనే. అలా అని హీరోగా చేయటం ఇష్టం లేదనీ కాదు..,
  చెప్పాను కదా..! కథలో అవసరం అనిపిస్తే సింగిల్ ఫ్రేం లో కనిపించటానికైనా సిద్దం...

   నారా రోహిత్ గారితో:

  నారా రోహిత్ గారితో:


  షూటింగ్ గ్యాప్ లోనూ, ఖళీగా ఉన్న సమయం లోనూ ఎలా గదుపుతారు.., ఆ సమయాన్ని ఎలా వాడుకుంటారు...

  ఒకప్పుడంటే క్రికెట్ ఉండేది... నాలా ఉండేవాడికి ఇక ఇప్పుడు ఏముంటుందీ? నేను పని చేసిన చేయబోయే డైరెక్టర్లతో ఎక్కువగా గడుపుతాను, సినిమాలు రన్ అవుతూన్నప్పుడు ఆ విషయాలమీద ఎక్కువగా మాత్లాడుకుంటాం. సాగర్ చంద్ర తోనూ, నీదీ నాదీ ఒకే కథ డైరెక్తర్ వేణూ తోనూ నాది స్నేహం కంటే కూడా ఎక్కువ అనుబందం. ఇంకా వీళ్ళుకూడా బిజీగా ఉంటే నారా రోహిత్ గారితో ఆయనా లేకుంటే దొరక్కుంటే ఇక సినిమాలు వరుసగా చూస్తూ ఉండిపోతాను..

   తెలుగు సినిమాలుమాత్రమే:

  తెలుగు సినిమాలుమాత్రమే:


  హాలీవుడ్ అంటే ఎక్కువ ఇష్టమా? ఏ సినిమాలు ఎక్కువ చూస్తారు...?

  తెలుగు... తెలుగు..తెలుగు... తెలుగు సినిమాలుమాత్రమే చూస్తాను. వేరే భాషా సినిమాలు ఇష్టమే అయినా నేను చేస్తున్నదీ చేయబోతున్నదీ తెలుగు సినిమా అప్పుడు ఆబ్వియస్లీ తెలుగు సినిమాలే నా చాయిస్. ఇక వేరే భాషా సినిమాలూ అంటే అవి ఎక్స్ట్రా క్లాసుల్లాంటివి.., రెగ్యులర్ గా ఉండవు. కానీ అల్టిమేట్ గా నాకు తెలుగు సినిమాలు చూడటమే ఇష్టం. ఇక కొత్త సినిమా వచ్చిందీ అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉండే థియేటర్లో మొదటి షో లో ఒకటికెట్ నాదే అయిఉండి తీరుతుంది. ఇక ఆ సినిమా టాక్ బావుందీ అంటే ఇక ఆరోజు బిర్యానీ పార్టీ అయిపోయినట్టే... ఏవరి సినిమా అనికాదు అది తెలుగు సినిమా హిట్ అయ్యిందీ అదీ సంతోషం... టాక్ బాలేదంటే అంత డబ్బూ, వందల మంది శ్రమా అలా అయిపోయాయే అని భాదనిపిస్తుంది.

   నీదీ నాదీ ఒకే కథ:

  నీదీ నాదీ ఒకే కథ:


  ఇప్పుడు రాబోయే నీదీ నాదీ ఒకే కథ గురించి ఏమన్నా....???

  నో లీక్స్...! వెండితెర మీద చూడాల్సిందే (అంటూ నవ్వేసాడు) డైరెక్టర్ గారు పక్కనున్నప్పుడు ఇలా అడక్కూడదు. (పక్కనే ఉన్న నీదీ నాదీ ఒకే కథ డైరెక్టర్ వేణూ గారిని చూపిస్తూ) చాలా లవ్లీగా ఉండే క్యారెక్టర్. దాదాపు బయట కనిపించే 80% మంది కుర్రాళ్ళు ఉన్నట్టే ఉంటుంది వాళ్ళు తమని తాము ఫీలయ్యే పాత్ర ఇది... కానీ అంత ఈజీ మాత్రం కాదు సినిమా చూస్తారు కదా తెలుస్తుంది. అప్పట్లో ఒకడుండే వాడు మీద ఎంత నమ్మకం తో పనిచేసామో అదే నమ్మకం ఈ సినిమా మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఆ సినిమానీ నాపాత్రనీ ఎప్పటికీ మర్చిపోలేరు... "అప్పుడు క్యారక్టర్లో ఉండిపోయాను" అంటూ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నిజంగా అలా ఉంటుందా అనుకునే వాన్ని... కానీ నీదీ నాదీ... చేస్తున్నప్పుడు అనుభవం లోకి వచ్చింది. కట్ చెప్పాక పక్కకు వచ్చిన తర్వాత కూడా అలానే ప్రవర్తించేవాన్ని... ఈ సినిమాలో కామెడీ కూడా బాగా చేసాం...

   సినిమా అనేది ఒక ఆర్ట్ అని అర్థమయ్యాక :

  సినిమా అనేది ఒక ఆర్ట్ అని అర్థమయ్యాక :


  ఇప్పుడు మీఎరు హీరో కదా...! మరి చిన్నప్పటి నుంచీ మీకూ నచ్చిన హీరో...

  (ప్రశ్న పూర్తికాకుండానే ) వెంకటేష్...విక్టరీ వెంకటేష్ అంటే మామూలుగా కాదసలు ఇంట్లో వాళ్ళతర్వాత అంత ఎక్కువగా అభిమానించింది వెంకటేష్ గారినే ఆయనంటే అంత అభిమానం ఉండేది. ఆఖరికి క్రికెట్ ఆడే టప్పుడు కూడా నీడని చూస్కుంటూ వెంకటేష్ లా ఉన్నానా అని చూసుకునేంత పిచ్చి. అయితే మిగతా హీరోలమీద ఎప్పుడూ తక్కువ అభిప్రాయం లేదు. ఒక హీరో అభిమాని అయినంత మాత్రన వేరే హీరోని తక్కువ చేసి మాట్లాడటం అనేది సినిమా వాతావరణం ఏమిటో తెలియనంత వరకే... అదృష్ట వశాత్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరూ అలాంటి దృష్టి తీసుకు రాలేదు. ఇక సినిమా అనేది ఒక ఆర్ట్ అని అర్థమయ్యాక ఏ హీరోనీ.., మరే నటున్నీ తక్కువ చేసి చూడాలనిపించదు.ఒక్కొక్కళూ ఎంతో కష్టపడితే తప్ప ఆ స్టేజ్ కి వెళ్ళ లేదు... అలాంటిది మా హీరో ఇలా చేస్తాడు మీహీరోకి నటన రాదు అనటం కరెక్ట్ కానే కాదు... నటుడు ఎప్పటికీ నటుడే ఒక్కరోజులో ఇంత స్థాయికి చేరుకోలేదు వాళ్ళు .. ఆలెక్కన చూస్తే నేను తెలుగులో నటించే ప్రతీ నటుడుకీ అభిమానినే... ప్రతీ ఒక్కరూ నాకు ఇన్స్పిరేషనే..

   ఇంక లైఫ్ లో కిక్ ఏముంటుంది... :

  ఇంక లైఫ్ లో కిక్ ఏముంటుంది... :


  .సినిమాల్లోకి వచ్చిన తొలిరోజుల్లో ఇలా ఒకరోజు వస్తుందన్న నమ్మకం ఉండేదా? ఇప్పటి స్టేజ్ లో మీలాగే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే శ్రీవిష్ను లకి మీరిచ్చే సలహా ఏమిటీ?

  అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంక లైఫ్ లో కిక్ ఏముంటుంది... పదేళ్ళ క్రితం ఒకలా ఉండేవి నా ఆలోచనలు కానీ ఇప్పుడు మరోలా ఉన్నాయి. వచ్చే అవకాశాలను బట్టి మన సక్సెస్ కి దగ్గరి రూట్ వెతుక్కుంటూ వెళ్ళాలి. కొత్తగా వచ్చేవాళ్ళకి సలహాలిచ్చేంత అయితే ఏం లేదు గానీ... ఇది మనం చెయ్యగలమా అనే ఒక్క ఆలోచన తీసిపడేయ్యండి.డైరెక్టర్ అవ్వాలనుకుంటే మాత్రం కనీసం ఒక అయిదేళ్ల టైం పెట్టుకోవటం అవసరం. మీ ఆలోచనలని పూర్థిగా నమ్మే వాడిదగ్గరికే వెళ్ళండి ఎందుకంటే మీరేం చెప్పగలరో మీకుమాత్రమే తెల్సు.. స్వతంత్రంగా నా సబ్జెక్ట్ని తీసే స్వేచ్చ ఉందీ అనుకున్నప్పుడే మీ పని మొదలు పెట్టండి... అలాంటి అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉండండి... ఇంతే ఇప్పటికి నేను చెప్పగలిగే మాట.

   వైజాగ్ గీతం:

  వైజాగ్ గీతం:


  ఓకే ఇంకొక్కసారి మనం వెనక్కివెళదాం స్కూల్, ఫ్రెండ్స్, ఫస్ట్ క్రష్.. ఇలా... ఇంకొన్ని...

  స్కూలింగ్ అంతా భీమవరం విశ్వకవి లోనే జరిగింది అప్పటికి అప్పట్లో ఒక ఙ్ఞాపకం ఏమిటంటే 9త్ క్లాస్ లో నేను స్టేజ్ మీద చేసిన ప్లేకి ఒక చిన్న అవార్డ్ వచ్చింది. అదే నా మొదటి అవార్దు. కళ్యాణ్, మురళి,ఇలా మరికొంత మంది ఫ్రెండ్స్ ఇప్పటికీ కలుస్తూంటాం... ఇక వైజాగ్ గీతం లో నాకున్న ఫ్రెండ్స్ లో సందీప్ ఒకడు మామూలుగా ఎప్పుడైనా బోర్ గా అనిపిస్తే డైరెక్ట్ గా వాళ్ళింటికి వెళ్ళిపోతాను...

   హుష్..! గప్ చుప్..:

  హుష్..! గప్ చుప్..:


  అమ్మాయిల విషయం మర్చిపోయారూ....?

  మర్చిపోలేదు...అదంతా హుష్..! గప్ చుప్.. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఈసారికిలా కానిచ్చెయ్యండి (అంటూనవ్వేసాడు)
  ఇలా అప్పట్లో ఒకడుండే వాడుతో ఆ సాయంత్రం అలా గడిచిపోయింది ఆసమయం మొత్తంలో అతని కళ్ళలోకే ఎక్కువసేపు చూసాను... పెదాలతో పాటే కళ్లని కూడా అంతే అర్థవంతంగా కదిలిస్తాడీ నటుడు. చాలామంది సహజ నటులు అనిపించే వాళ్లలో కనిపించే విషయం అది. ఇక మనిషిగా మనుషులమీద, నటుడుగా నటనమీద, పాఠకుడిగా పుస్తకాలమీద.... ఓవరాల్ గా తనజీవితం ముడిపడి ఉన్న సమాజం మీద శ్రీ విష్ణుకి ఉన్న ప్రేమా, భాధ్యతగా ఫీలయ్యే గుణం ఎక్కువగానే ఉన్నాయి... ఖచ్చితంగా ఈ కుర్రాడు రేపటి తెలుగు సినిమాలో కీలకంగా ఎదుగుతాడు....

  English summary
  Super sensation of 2016 Telugu cinema industry "appatlo Okadundevaadu" movie hero, actor Srivishnu shared his feelings with filmibeat
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more