»   » సంవత్సరాల తర్వాత విడుదల, రాఘవేంద్ర రావు సినిమా గుర్తుందా..??

సంవత్సరాల తర్వాత విడుదల, రాఘవేంద్ర రావు సినిమా గుర్తుందా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడున్న దర్శకులలో భక్తిరస చిత్రాలు చేసి మెప్పించగల దర్శకుడు కే. రాఘవేంద్ర రావు ఒక్కరే. అన్నమయ్య, శ్రీ మంజునాథ, శ్రీ రామదాసు, శిరిడి సాయి వంటి సినిమాలతో అందరినీ మెప్పించారు దర్శకేంద్రుడు.శ్రీ రామరాజ్యం వంటి సినిమాని నిర్మించి మంచి అభిరుచి కల నిర్మాతగా పేరు తెచ్చుకున్న యలమంచిలి సాయి బాబు గారి తనయుడు రేవంత్ ని 'ఇంటింటా అన్నమయ్య' సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసాడు. అనన్య, సనమ్ శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి దర్శకేంద్రుడి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు అందించాడు..

విడుదలకు నోచుకోకుండా

విడుదలకు నోచుకోకుండా

హీరో కొత్తవాడు కావడం.. టైటిల్ జనాల్ని అసలేమాత్రం ఆకర్షించలేకపోవడం.. అప్పటికి రాఘవేంద్రరావు ఫామ్‌లో లేకపోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల బయ్యర్లలో ఈ సినిమాపై ఆసక్తి కనిపించలేదు. పబ్లిసిటీ కొంచెం పెద్ద స్థాయిలోనే చేసినా.. సినిమాకు బిజినెస్ కాకపోవడంతో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది.


తారకరత్న విలన్

తారకరత్న విలన్

ఐతే ఈ సినిమా త్వరలోనే రిలీజవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు హీరో రేవంత్. ‘ఇంటింటా అన్నమయ్య' తర్వాత రేవంత్ ‘రాజా మీరు కేక' అనే ఓ చిన్న సినిమా చేశాడు. ఇందులో రేవంత్‌తో పాటు ఇంకో ఇద్దరు హీరోలు కూడా నటించారు. తారకరత్న విలన్ పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుందట.


సినిమా రిలీజ్ కాకపోయినా

సినిమా రిలీజ్ కాకపోయినా

ఇంటింటా అన్నమయ్య సినిమా రిలీజ్ కాకపోయినా హీరోగా రేవంత్ అందరికీ సుపరిచితమయ్యాడు. కారణం రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడమే. ఆ సినిమా రిలీజ్ కాకపోయినా... మనోడిని ఆఫర్స్ వరిస్తున్నాయి. ఆలా వచ్చిందే రాజా మీరు కేక


రాజా మీరు కేక

రాజా మీరు కేక

‘ఇంటింటా అన్నమయ్య'కు, ‘రాజా మీరు కేక'కు మధ్యలో తాను కొన్ని డాక్యుమెంటరీలు చేసినట్లు రేవంత్ వెల్లడించాడు. ఇంటింటా అన్నమయ్య సినిమా రిలీజ్ కాలేక పోవడానికి చాాలా కారణాలున్నాయి. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. అదే పేరుతో త్వరలోనే రిలీజ్ చేస్తారు.


డాక్యుమెంటరీస్

డాక్యుమెంటరీస్

అనుకున్న సమయానికి రిలీజ్ కానప్పుడు బాధ పడ్డాను. కానీ రైట్ టైంలోనే వస్తోంది. నేను గతంలో సి ఎన్ బి సి లో జర్నలిస్ట్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత నేపాల్ , కాశ్మీర్ లో పలు డాక్యుమెంటరీలు కూడా చేశాను. నాకు అడ్వెంచర్ తో కూడిన డాక్యుమెంటరీస్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం సినిమాలు, డాక్యుమెంటరీస్ నా లైఫ్. సమయం వచ్చినప్పుడు డైరెక్షన్ చేస్తాను. అని అన్నాడు.English summary
After a long delay, K. Raghavendra Rao’s 'Intinta Annamayya' is finally going to hit the screens Soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu