హైదరాబాద్: 'శ్రీరామరాజ్యం' తర్వాత సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. రేవంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనన్య, సనంశెట్టి ఇందులో హీరోయిన్లు. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఆ యువకుడికి పాశ్చాత్య సంగీతమంటే మహా ప్రీతి. ర్యాప్, పాప్... అంటూ గిటారుపట్టుకొని ఆ దిశగానే అడుగులు వేశాడు. అయితే అన్నమయ్య కీర్తనలు విన్నాక మన సంగీతంలోని గొప్పదనాన్నీ, ఆయన రచనలోని వైశిష్ట్యాన్నీ తెలుసుకొన్నాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీదే చూడమంటున్నారు రాఘవేంద్రరావు.
హీరో రేవంత్ చిత్ర విశేషా లను వివరిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేయడానికి నిర్మించిన చిత్రం 'ఇంటింటా అన్నమయ్య' అని ఈ చిత్రంలో ప్రధానపాత్రలో తాను నటించడం ఆనందంగా వుందని, కీరవాణి అందించిన గీతాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందరి అభిరుచులను దృష్టిలో వుంచుకొని పాటలను సంప్రదాయ గీతాలుగా, చందమామ పాటలుగా, రాక్ సాంగ్స్‌గా రూపొందించారని, సంగీత సాహిత్య విలువలుగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుందని, ప్రతి ఇంటా అన్నమయ్య పాటలు సంకీర్తన చేయాలని ఆయన వివరించారు.
నిర్మాత మాట్లాడుతూ ''అన్నమయ్య గీతాలకీ ఓ యువకుడి జీవితానికీ ఉన్న బంధమే ఈ కథ. అదేమిటో తెర మీదే చూడాలి. నవతరానికి తెలుగుదనాన్నీ, సంప్రదాయాల్నీ చెప్పేలా ఉంటుంది. రాఘవేంద్రరావు కథను ఆవిష్కరించిన తీరు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి'' అన్నారు.
Intinta Annamayya is all set to come to theatres on 31st of May. This film has Revanth, Ananya, Sanam Shetty in the lead. Raghavendra Rao has directed the film. MM Keeravani has scored the music. The audio release of the film happened in a grand manner in Vizag on 21st March. Revanth is son of Yalamanchali Saibabu, producer of Sri Ramarajyam. This film is a musical love story. The trailer and the songs of the movie gives us a feel that this film is about youth who propagates Annamayya songs.
Story first published: Thursday, May 2, 2013, 10:38 [IST]