twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను: ఏఆర్.రెహమాన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మత అసహనం అంశంపై బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పందిస్తూ... తన భార్య భారత్ వదిలి వెళదామని అడుగుతోంది అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఇతర నటీనటులు, రాజకీయ నేతలు, సామాన్య జనంతో పాటు ఎంఐఎం లాంటి పార్టీలు కూడా తప్పుబట్టాయి.

    అయితే ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాత్రం డిఫరెంటుగా స్పందించారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానట్లు తెలిపారు. దేశంలో అసంహనం పెరుగుతోందని, తనపై సున్నీ మస్లిం సంస్థ రజా అకాడమీ ఫత్వా జారీ చేసినపుడు దాదాపు తనలోనూ ఇలాంటి భయమే కలిగిందన్నారు.

    Intolerance: AR Rahman supports Aamir Khan

    గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ....వృత్తి ధర్మంలో భాగంగా చేసే పనికి తీవ్ర విమర్శలకు గురైనపుడు తాను కూడా ఇలాంటి అసహన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మతం పేరుతో చేసే హింసకు తాను పూర్తిగా వ్యతిరేకమని, నాగరిక ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హింస అనేది ఉండ కూడదు అన్నారు.

    మహ్మద్ ప్రవక్త జీవితం ఆధారంగా తీసిన ‘ది మెుసెంజర్ ఆఫ్ గాడ్' అనే ఇరానీ చిత్రానికి రెహమానం సంగీతం అందించడం అప్పట్లో వివాదానికి కారణమైంది. ఈ సినిమా ముస్లింల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఉందని సున్నీ ముస్లిం సంస్థ రజా అకాడమీ రెహమాన్ తో పాటు, చిత్ర దర్శకుడు మాజిద్ మజీదీకి ఫత్వా జారీ చేసింది. ఆ సమయంలో పలువురు రెహహాన్ ను తిరిగి హిందూ మతంలోకి రావాలని ఆహ్వానించారు.

    English summary
    Oscar-winning music composer AR Rahman on Tuesday said he agreed with Bollywood star Aamir Khan's statement on growing intolerance in the country. Rahman explained that he faced a similar situation in September, when a Muslim group issued a fatwa against him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X