»   » ‘దిల్ వాలె’ ఎఫెక్ట్: మత అసహనంపై దేశ ప్రజలకు షారుక్ క్షమాపణ

‘దిల్ వాలె’ ఎఫెక్ట్: మత అసహనంపై దేశ ప్రజలకు షారుక్ క్షమాపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మత అసహనం(ఇంటోలరెన్స్) వివాదం దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా షారుక్ ఖాన్ ఈ వివాదంపై తాజాగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రేపు(డిసెంబర్ 18) తాను హీరోగా నటించిన ‘దిల్ వాలె' మూవీ విడుదల ఉన్న తరుణంలో ఒక రోజు ముందు షారుక్ ఖాన్ నుండి వెంట క్షమాపణలు వెలువడటం గమనార్హం.

గతంలో అసహనం అంశంపై తాను చేసిన వివాదాస్పద వ్యాక్యలు సినిమాపై ప్రభావం చూపుతాయనే ఉద్దేశ్యంతోనే.... సినిమాకు ఎలాంటి నష్టం వాటిల్లకూడదని ఇపుడు ఇలా క్షమాపణలు చెప్పారనే అభిప్రాయం వెలువడుతోంది. ఓ టీవీ ఛానల్ తో షారుక్ ఖాన్ ఈ విషయమై మాట్లాడుతూ...‘తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెబుతున్నాను. ఇండియాలో నేను ఎక్కడ కూడా అసహనం(ఇంటోలరెన్స్) ఫేస్ చేయలేదు. ఈ విషయమై నేను ఇక మాట్లాడదలుచుకోలేదు.' అన్నారు. మరో వైపు మహారాష్ట్రలో ఈ సినిమాను బహిష్కరించాలని శివసేన పార్టీ వారు ఆందోళన చేస్తున్నారు.

Intolerance Controversy: Dilwale Effect? Shahrukh Khan apologises to Indians

సినిమా వివరాల్లోకి వెళితే...
చాలా కాలం తర్వాత బాలీవుడ్ రొమాంటిక్ జోడీ షారుక్ ఖాన్, కాజోల్ జంటగా ‘దిల్ వాలే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో ఇదీ ఒకటి.

రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై గౌరీఖాన్‌, రోహిత్‌శెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్, కాజోల్ తో పాటు యువ జంటగా వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ నటిస్తున్నారు. ఇందులో కార్లను రీమోడలింగ్‌ చేసే వ్యక్తిగా షారుక్‌, ఆయన తమ్ముడిగా వరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ‘చెన్నై ఎక్స్ ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ సినిమా తర్వాత షారుఖ్‌, రోహిత్‌శెట్టి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం సమకూర్చిన పాటలు దీపావళి సందర్భంగా నవంబర్‌ 11న సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేసారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. డిసెంబర్‌ 18న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసారు.

English summary
The infamous debate over intolerance, which has rocked the country lately, is back. This time it was Bollywood superstar Shahrukh Khan who reminded everyone about the controversy. Shahrukh now apologised for his previous remark on "intolerance" in the country. The actor's apology came just days before the release of his Hindi movie -- Dilwale.
Please Wait while comments are loading...