»   »  ‘నాకూ మీలాగే బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరండీ’

‘నాకూ మీలాగే బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరండీ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో, హీరోయిన్ మొదటి సారి కలుసుకున్నపుడు, ‘నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు' అని హీరోయిన్ మాటకి ఇచ్చే జవాబు. చూసారుగా ఎంత చురుకుతనమో, ఆకతాయితనమో హీరోకి. అంతే కాదు ఎన్ఆర్ఐ అన్నా, అమెరికా అన్నా...క్యాస్ట్ ఫిలింగ్ అన్నా అసహ్యం. క్రమ శిక్షణ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ జనరేషన్ కుర్రోళ్ల లాగే ప్రేమ మీదతన వేదాంతం తనకు ఉంది. ఇలా ఉన్న తన జీవితం లోకి హీరోయిన్ రావడంతో నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుంటాడు.

‘తను నేను' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంతోష్ శోభన్ తన తొలి సినిమాలో తెరపై కనిపించేది పైవిధంగా అన్నమాట. ప్రస్తుతం సంతోష్ బెంగుళూరులోని క్రిస్ట్ యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్స్ చదువుతున్నాడు. వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన కీ.శే. శోభన్ కుమారుడు.

Introducing Santosh Sobhan as Kiran

అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాల జంపాల చిత్రాల నిర్మాత రాంమోహన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'తను నేను'. సంతోష్‌, అవికాగౌర్‌ జంటగా నటిస్తుండగా దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. ఈ సినిమా నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దీపావళి కానుకగా విడుదల చేశారు.

అవికా గోర్‌, సంతోష్‌ శోభన్‌, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్‌.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: సురేష్‌ సారంగం, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్‌: ఎస్‌.రవీందర్‌, నిర్మాణం: సన్‌షైన్‌ సినిమాస్‌.

English summary
Santosh is a student of Christ University Bangalore, studying Theatre Arts. Son of the famous director Late Shobhangaru, who gave us block buster hits like “Varsham”, Santosh has hunger that we have never seen before in Sunshine...Unlike Nani and Raj Tarun who started being assistant directors, Santosh is the first hero from our banner who was focused on being an actor always.
Please Wait while comments are loading...