»   » బాలయ్య చేతుల మీదుగా మెగా ఫ్యామిలీ హీరో మూవీ టీజర్!

బాలయ్య చేతుల మీదుగా మెగా ఫ్యామిలీ హీరో మూవీ టీజర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఇంటిలిజెంట్‌'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

బాలయ్య చేతుల మీదుగా టీజర్

బాలయ్య చేతుల మీదుగా టీజర్

‘ఇంటిలిజెంట్' టీజర్‌ను జనవరి 27 మధ్యాహ్నం 3.23 గంటలకు నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు. బాలయ్యతో ‘జై సింహ' చేసిన నిర్మాతే ‘ఇంటిలిజెంట్' చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఇలా టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు.

చాలా అరుదు

చాలా అరుదు

తెలుగు సినిమా పరిశ్రమలో మెగా, నందమూరి స్టార్ల మధ్య ఒక పోటా పోటీ వాతావరణం ఉంటుంది. ఒకరి సినిమా ఓపెనింగుకు మరొకరు రావడం చాలా అరుదు. ఇలాంటివి ఈ మధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య ఎన్టీఆర్ సినిమా ఓపెనింగుకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. అందరినీ ఆశ్చర్య పరుస్తూ రాజమౌళి రామ్ చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ కూడా సెట్ చేశారు

ఇంటిలిజెంట్

ఇంటిలిజెంట్

ఇంటిలిజెంట్ చిత్రంలో సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్నారు.

తారాగణం

తారాగణం

ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

English summary
After directing Megastar Chiranjeevi in his landmark 150th film 'Khaidi No.150', director VV Vinayak is back this time with Chiranjeevi's nephew Sai Dharam Tej. The big-budget film is titled 'Intelligent' and is set to hit screens next month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu