»   » ఐశ్వర్య రాయ్ లూజు బట్టలు వేసుకోవటానకి కారణం?

ఐశ్వర్య రాయ్ లూజు బట్టలు వేసుకోవటానకి కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ త్వరలో అమ్మ కాబోతోందని బాలీవుడ్ లో అంతటా వినిపిస్తోంది. అంతేగాక గత కొద్ది రోజులుగా ఆమె అభిమానుల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. దానికి కారణం ఆమె కొంతకాలంగా తన వస్త్రధారణను పూర్తిగా మార్చివేయటమేనంటున్నారు. రెగ్యులర్ గా ఒంటికి అతుక్కుపోయినట్లుగా ఉండే బట్టలు వేసుకునే ఆమె కొద్ది రోజులుగా వదులుగా ఉండే వస్త్రాలనే ధరిస్తోంది. ఇదే ఫ్యాన్స్ లో చర్చకు కారణమైంది. ఐశ్వర్య ప్రస్తుతం గర్భవతి కావడం వల్లే ఇలా వదులు దుస్తులు ధరిస్తోందని వారు భావిస్తున్నారు. మరికొందరైతే మెసేజ్ లు, ఇ మెయిల్స్ పంపుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఉదరభాగం బొద్దుగా కనిపిస్తున్న ఐశ్వర్య ఛాయాచిత్రం కొన్ని వెబ్ ‌సైట్ ‌లో కనపడుతోంది. మణిరత్నం దర్శకత్వం వహించిన 'రావణ్‌' విడుదల అవుతున్న ఈ సందర్భంలో ఈ శుభవార్త బహిరంగంగా ప్రకటన చేస్తుందని అంతా భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu