»   » మెగాస్టార్ చిరుతో ప్రపంచ సుందరి డ్రీమ్ ఫలించేనా...!?

మెగాస్టార్ చిరుతో ప్రపంచ సుందరి డ్రీమ్ ఫలించేనా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన 'రోబో" చిత్రంలో అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్‌ రజనీకాంత్‌ సరసన హీరోయిన్‌ గా నటించిన విషయం మనకు తెలిసిందే. అక్టోర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'రోబో" ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన ఐశ్వర్యరాయ్‌ ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా వివరించారు...

అటు తమిళం, హిందీ లలో లెజెండ్రీ పర్సన్స్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో నటించిన ఐష్ తెలుగు మెగాస్టార్ చిరు తో నటించాలని వుందని తెలిపింది. ప్రస్తుతం 'తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్న తీరుకు ముసిరిపోయాననీ వివరిస్తూ... తమిళ్‌ మెగాస్టార్‌ రజనీకాంత్‌ తో నటించాను, తెలుగులో అవకాశం ఇస్తే మెగాస్టార్‌ చిరంజీవితో కూడా నటిస్తానని చెబుతోంది. ఈ వార్త విన్న కొంతమంది తెలుగు సినీ ప్రముఖులు ఇంకేముంది రామ్ చరణ్ తన సొంత బ్యానర్ సురేఖ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న చిరు నటించే 150వ చిత్రంలో ఐశ్వర్యరాయ్‌ నటిస్తుందని డిసైడ్‌ చేస్తున్నారట.

అయితే ఈ రేస్ లో ఆల్ రెడీ శ్రియ, నిఖీషా పటేల్ చిరుతో చేయడానికి తహతహలాడుతున్నారని సమాచారం. అయితే చిరు మాత్రం ఐశ్వర్య రాయ్ ను మైయిన్ హీరోయిన్ గా తీసుకోవాలని ఉత్సాహపడుతున్నాడని కూడా తెలిసింది. ఏదేమైనప్పటికీ డిసెంబర్ కల్లా చిరు సరసన అసలుసిసలైన హీరోయిన్ ఎవరనేది తెలిసిపోతుంది. అంత వరకూ వేచి చూడక తప్పదు..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu