»   » నాగ చైతన్య పెళ్ళి అయిపోయిందా..!?

నాగ చైతన్య పెళ్ళి అయిపోయిందా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య పెళ్ళి జరిగిపోయిందా...? 

అదీ శృతీ హసన్ తో....  నిజంగా కాదు లెండి ఇదంతా "ప్రేమం" సినిమా షూటింగ్ సంగతి.. మళయాలం లో గత సంవత్సరంలో వచ్చిన సినిమాలలో సూపర్ హిట్ అయిన సినిమా 'ప్రేమమ్'. ఈ సినిమాని "కార్తికేయ" ఫేం చందు మొండేటి దర్శకత్వం లో నాగ చైతన్య హీరో గా తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. .


ఈ సినిమాకి సంబందించిన పెళ్ళి సన్నివేశాల చిత్రీకరన నిన్ననే పూర్తయ్యిందట.. రామోజీ ఫిల్మ్ సిటీ లో నిన్ననే పూర్తయ్యిందట.. ఈ షెడ్యూల్ తరువాత గోవా లో జరిగే షూటింగ్ తో సినిమా మొత్తం పూర్తవుతుందని తెలిసింది. జులై 16 న ఈ సినిమా విడుదలకు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


is Akkineni Nagachaitanya Got married..?

తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలకమైన పెళ్ళి సన్నివేశాలను చిత్రీకరించారట. శృతిహాసన్ సహా ఇతర కీలక నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ సమర్పకుడు.


అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, బ్రహ్మాజీ, ప్రవీన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాని జులై 16న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకుముందే జూన్‌లో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నాడు చైతూ.

English summary
The shooting of the film is presently in progress at Ramoji Film City. a marriage scene is being shot now
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu