»   » హీరోయిన్ అసిన్ వివాహం సీక్రెట్‌గా జరుగుతోందా?

హీరోయిన్ అసిన్ వివాహం సీక్రెట్‌గా జరుగుతోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైదరాబాద్: హీరోయిన్ అసిన్ త్వరలో బిజినెస్ మేన్ రాహుల్ వర్మను వివాహమాడబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహ తేదీ ఫిక్సయిందని, నవంబర్ 26న ఢిల్లీలో జరగనుందని మీడియాలో ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అసిన్ అప్పట్లో ఖండించింది.

అయితే ఈ రోజు రాత్రి అసిన్ వివాహం రహస్యంగా జరుగబోతోందనే వార్తలు మళ్లీ బాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి. మీడియా కంటపడ్డ ఆమె బ్రైడల్ లుక్ లో రిచ్ గా కనిపించడమే కారణం అని అంటున్నారు. ఆల్రెడీ వివాహం గురించి ప్రకటించిన అసిన్‌కు ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె అభిమానులు వాదిస్తున్నారు. తెల్లవారే లోపు అసలు విషయం బయటపడనుంది.

అసిన్ పెళ్లాడబోతున్నది మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మ కావడంతో మీడియా వీరి పెళ్లిపై ఫోకస్ ఎక్కువగా పెట్టింది. అందుకే అసిన్, రాహుల్ తమ పెళ్లి విషయంలో గోప్యత పాటిస్తున్నారని టాక్.

Is Asin Secretly Getting Married To Rahul Sharma Tonight?

ప్రేమ వ్యహారం...
అసిన్ ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ప్రేమ ఎలా పుట్టింది, పెళ్లికి దారి తీసిన పరిణామాలు వివరించింది. తమ మధ్య బంధం బలపడటానికి కారణం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అనే అసిన్ చెప్పుకొచ్చారు. రాహుల్, అక్షయ్ స్నేహితులు కావడమే ఇందుకు కారణం అంటోంది. అంతే కాదు తమ మధ్య సంథింగ్ మొదలైందని అక్షయ్ మొదట్లోనే కనిపెట్టేసి ప్రోసీడ్ అన్నాడట.

రాహుల్ శర్మతో పరిచయం, ప్రేమ వ్యవహారం అనుకోకుండా జరిగిందని అసిన్ తెలిపారు. గజిని సినిమాలోలానే నా జీవితంలో జరిగింది. తొలిసారి ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నామని తెలిపారు. తొలుత నన్ను హాయ్ అంటూ పలకరించారు. తర్వాత విమానంలో పక్క పక్కనే కూచున్నాం. అప్పటి నుండి ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం అని అసిన్ తెలిపారు. ఒకానొక రోజు అతడే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇంట్లో వాళ్లను కలుస్తా. పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అతను జంటిల్మెన్‌లా ప్రపోజ్ చేసిన తీరు నచ్చిందని అసిన్ చెప్పుకొచ్చింది.

సౌత్ లో అసిన్ కు బాగా పేరు తెచ్చిన సినిమా ‘గజిని'. సౌత్ లో ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా... ఇదే సినిమాను బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో హీరో మొబైల్ కంపెనీ యజమాని. నిజ జీవితంలోనూ అసిన్ మొబైల్ కంపెనీ యజమానితో ప్రేమలో పడటం కాకతాళీయమే.

అచ్చం గజినీ సినిమాలో హీరోకు ఉన్న లక్షణాలే తనకు కాబోయే భర్తుకు ఉన్నాయంటోంది అసిన్. రాహుల్ గజిని టైపే. గజినిలో సంజయ్ సింఘానియా (సూర్య) ఓ మొబైల్ కంపెనీ ఓనర్. తర్వాత మతిమరుపు గజినిగా కనిపిస్తాడు. అందులో ఆరెంజ్ కలర్ కార్ ని వాడతాడు. ఇవన్నీ రాహుల్ నిజజీవితంలోనూ ఉన్నాయని అంటోంది అసిన్.

English summary
We were all desperately waiting to see Asin dressed as a bride but it looks like Asin has decided to get married secretly. Rumour has it that Asin is marrying, Rahul Sharma, a Delhi based first generation entrepreneur, tonight in a private ceremony.
Please Wait while comments are loading...