twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవెంజర్స్: ఎండ్‌గేమ్ ప్రీ రివ్యూ: బాహుబలి2 రికార్డులపై గురి.... రాజమౌళి కలెక్షన్లకు ఎసరు!

    |

    Recommended Video

    Avengers: Endgame Beats Baahubali 2 In Pre-Ticket Sales || Filmibeat Telugu

    ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా ఫీవర్ పట్టుకొన్నది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ రూపొందించిన సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలు నమోదు చేస్తున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్ కావడం, చైనా, ఇండియాలో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోవడం సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమా బాహుబలి సాధించిన రికార్డులపై గురిపెట్టిందనే ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

    బాహుబలి 2తో పోల్చితే

    బాహుబలి 2తో పోల్చితే

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 6500 స్క్రీన్లలో విడుదలైంది. ఇంతే మొత్తంలో అవెంజెర్స్: ఎండ్ గేమ్ సినిమా విడుదలవుతున్నది. సుమారు 2700 స్క్రీన్లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పూర్తయింది. దక్షిణాదిలో దాదాపు 750 స్క్రీన్లలో తొలిరోజు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

    తొలిరోజు కోసం 10 లక్షల టికెట్లు అమ్మకాలు

    తొలిరోజు కోసం 10 లక్షల టికెట్లు అమ్మకాలు

    దేశీయ మార్కెట్‌లో మార్వెల్ అభిమానులు బుకింగ్ కౌంటర్ల వద్ద పోటెత్తారు. తొలిరోజునే దాదాపు 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఒక సెకన్‌కు దాదాపు 18 టికెట్లు అమ్ముడుపోయినట్టు బుక్ మై షో వెల్లడించింది. దీనిని బట్టి దేశీయ మార్కెట్లో ఈ సినిమా క్రేజ్ ఎంత ఉందో చెప్పకనే తెలుస్తున్నది. ఇప్పటికే హాలీవుడ్ మీడియా ఈ సినిమాకు జై కొట్టడంతో మరింత క్రేజ్ పెరిగింది.

    ఒక్కొ టికెట్‌కు రూ.2400 ధర

    ఒక్కొ టికెట్‌కు రూ.2400 ధర

    ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో అవెంజర్స్ టికెట్లు భారీ ధరకు అమ్మకాలు జరిగాయి. మెట్రో సిటీలో 800 నుంచి 2400 రూపాయల వరకు టికెట్ రేటు పలికింది. బాహుబలి సినిమా టికెట్ కూడా దేశంలోని కొన్ని చోట్ల రూ.2400 వరకు ధర పలికింది. ఇప్పడు బాహుబలిని మించిన క్రేజ్ ఈ సినిమాకు కనిపిస్తున్నది.

     ప్రపంచవ్యాప్తంగా 4600 స్క్రీన్లలో

    ప్రపంచవ్యాప్తంగా 4600 స్క్రీన్లలో

    అమెరికా, కెనడాల్లో అవెంజెర్స్: ఎండ్ గేమ్ 4600కు పైగా థియేటర్ల రిలీజ్ కానుంది. అధికంగా రిలీజ్ అవుతూ సరికొత్త రికార్డును సృష్టించేందుకు సిద్దమైంది. భారత్‌లో కూడా బాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా అత్యధిక థియేటర్లలో అవెంజెర్స్ విడుదలవతున్నది. ఈ చిత్రం దేశంలోని 100 నగరాల్లో 1000కి పైగా స్క్రీన్లలో ప్రదర్శింపబడనున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే 500లకు పైగా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. దీంతో తొలిరోజే భారీ వసూళ్లు నమోదవుతాయని పండితులు అంచనా వేస్తున్నారు.

    బాహుబలి2 తొలి రోజు కలెక్షన్లు

    బాహుబలి2 తొలి రోజు కలెక్షన్లు

    బాహుబలి 2: ది కన్‌క్లూజన్ హిందీ వెర్షన్ తొలిరోజున రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ అగ్రహీరోల సినిమాలకు మంచి మొదటి రోజు రూ.41 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రం వసూళ్లు సుమారు రూ.50 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో బాహుబలి రికార్డుకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

    వారం రోజులు 24 గంటలపాటు ప్రదర్శన

    వారం రోజులు 24 గంటలపాటు ప్రదర్శన

    భారత్‌లో అవెంజెర్స్: ఎండ్‌గేమ్ చిత్రానికి ముంబైలో అడ్వాన్స్ బుకింగ్‌కు సంబంధించి కొత్త స్లాట్‌ను ఓపెన్ చేశారు. కార్నివాల్ ఐమాక్స్ వాడాలా (ముంబై) అవెంజర్స్: ఎండ్ గేమ్ చిత్రాన్ని ఉదయం 3.20 గంటల షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను వారంరోజులపాటు 24 గంటలు ప్రదర్శించేందుకు అనుమతులు కూడా తీసుకొన్నట్టు తెలుస్తున్నది. మిడ్‌నైట్ తర్వాత స్పెషల్ షోను ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని ముంబై థియేటర్ ఓనర్లు వెల్లడించారు.

    3డీ, 4డీఎక్స్ ఫార్మాట్స్

    3డీ, 4డీఎక్స్ ఫార్మాట్స్

    అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమా సరికొత్త టెక్నాలజీతో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని పంచబోతున్నది. ఈ చిత్రాన్ని ఐమాక్స్, 4డీఎక్స్, 3డీ 4డీఎక్స్ వెర్షన్లలో ప్రదర్శించనున్నారు. భారత్‌లోని పలు నగరాల్లో ఈ టెక్నాలజీని కొన్ని థియేటర్లు సమకూర్చుకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉత్సాహంతో ఎదురుచూస్తుండటంతో ఈ మేరకు సాంకేతిక మార్పులు థియేటర్లలో చోటుచేసుకొంటున్నాయి.

     థానోస్ వర్సెస్ సూపర్ హీరోలు

    థానోస్ వర్సెస్ సూపర్ హీరోలు

    అవెంజెర్స్: ఎండ్ గేమ్ చిత్రంలో సూపర్ విలన్ థానోస్ చేసే చారిత్రాత్మక పోరాటంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికాతో థానోస్ తలపడే పోరాటాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే 22వ సినిమా. గత నెల కెప్టెన్ మార్వెల్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం వస్తుండటంతో మంచి క్రేజ్ ఏర్పడింది.

    English summary
    Avengers Endgame movie set to hit the screens. The tension in the air is palpable and fans are nervously avoiding social media in case of running across any spoilers by accident. Reports suggest that, Avengers:Endgame will earn a staggering Rs 45-50 crore on its opening day and will shatter the opening day of Baahubali 2: The Conclusion, which made Rs 41 crore (the Hindi version).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X