»   » బాలయ్య రైతు ఆగిపోయినట్టేనా?? వెనుక వినిపించే వార్తలివే

బాలయ్య రైతు ఆగిపోయినట్టేనా?? వెనుక వినిపించే వార్తలివే

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. రైతులపై పోరాటం చేసే ఒక నాయకుడి స్టోరీగా ఇది తెరకెక్కనున్నట్లు, అందులో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ కూడా ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ అటకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం ఈ ప్రాజెక్టు విషయంలో బాలయ్య అసంతృప్తిగా ఉండటమేనట. ఇప్పటికే ఈ స్టోరీకి కూడా ఓకే చెప్పి జనవరిలోనే ఈ మూవీ సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలనుకునే సమయంలో బాలయ్య ప్రాజెక్ట్‌ విషయంలో ఎందుకు అసంతృప్తి ఉన్నాడనే విషయంపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.అసలు ఏం జరిగింది?? ఇవన్నీ పుకార్లేనా లేక నిజంగానే ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందా మరిన్ని విషయాలు...

 కొత్త ట్విస్ట్‌:

కొత్త ట్విస్ట్‌:


నంద‌మూరి బాల‌కృష్ణ 101వ సినిమాలో కొత్త ట్విస్ట్‌. కృష్ణ‌వంశీతో చేయ‌బోతున్న `రైతు` సినిమాకి స్పీడ్ బ్రేకర్ ప‌డిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నిజానికి బాల‌య్య వందో సినిమా `రైతు` అనుకొన్నారు. అయితే.. స‌డ‌న్ గా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి ట్రాక్ ఎక్కేసింది. రైతు క‌థ‌ని అమితంగా ఇష్ట‌ప‌డిన బాల‌య్య‌.. ఆ సినిమాని ఎలాగైనా స‌రే, కృష్ణ‌వంశీతో చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు.

 అమితాబ్ బ‌చ్చ‌న్:

అమితాబ్ బ‌చ్చ‌న్:


అంతేకాదు ఇందులో ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర కోసం అమితాబ్ బ‌చ్చ‌న్ ని సంప్ర‌దించ‌డం, ఆయ‌న ఓకే అనేయ‌డం జ‌రిగిపోయాయి. దాంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. రైతుగా నందమూరి బాలకృష్న గెతప్ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తితో నందమూరి ఫ్యాన్సే కాదు మామూలు జనం కూడా ఈ సినిమా వైపు ఆసక్తిగా చూసారు.

 షాక్ నుంచి తేరుకోకముందే:

షాక్ నుంచి తేరుకోకముందే:


అంతలోనే పెద్ద షాక్ తగిలింది అమితాబ్ పలు చిత్రాలు, యాడ్స్తో బిజీగా ఉండటం వలన 'రైతు' సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట మన అమితాబ్. దీంతో 'రైతు' సినిమా నుండి తప్పుకుంటున్నాడు.ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఈ సినిమాని ప‌క్క‌న పెట్టాల‌ని బాల‌య్య భావిస్తున్నాడ‌ని వచ్చిన వార్త మరింత గందర గోళం లో పడేసింది. కృష్ఱ‌వంశీతో స‌రిగ్గా ట్యూనింగ్ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ సినిమాని బాల‌కృష్ణ వ‌ద్ద‌నుకొంటున్న‌ట్టు టాక్‌.

 కృష్ణవంశీ డైరెక్షన్‌:

కృష్ణవంశీ డైరెక్షన్‌:


ప్రస్తుతం బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఆ సినిమా తర్వాత వెంటనే కృష్ణవంశీ డైరెక్షన్‌లో ‘రైతు' సినిమా చేసేందుకు సిద్ధమై పోయాడు. ఆ మధ్య సినిమాలో నటించాల్సిందిగా కోరుతూ అమితాబ్‌ను కలిశారు బాలయ్య, కృష్ణవంశీ. ఆ విషయం పక్కన పెడితే..

 ప్రియదర్శిని రామ్:

ప్రియదర్శిని రామ్:


ఆ సినిమాకు కథను అందిస్తోంది వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహిత వర్గంలో ఉండే కీలక వ్యక్తి ప్రియదర్శిని రామ్. ఈ సినిమాను భవ్య నిర్మాణ సంస్థ తెరకెక్కించనుంది. అయితే.. ఈ సినిమాపై తాజాగా కొన్ని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని రోజుల పాటు ఈ సినిమాను బాలయ్య పక్కనపెడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దానికి కారణం నక్షత్రం సినిమా అని మరొ టాక్.

 నక్షత్రం:

నక్షత్రం:


ఎందుకంటే.. ప్రస్తుతం కృష్ణవంశీ నక్షత్రం సినిమాతోనే బిజీగా గడుపుతున్నాడు. ఇంకా ఆ సినిమా నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం, విడుదలకు ఎట్ల లేదన్న కనీసం మూడు నెలలైనా సమయం పడుతుందన్న సందేహాలను బాలయ్య వ్యక్తం చేస్తున్నాడట. కాబట్టి ఆ సినిమా పూర్తయ్యాక రైతు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కృష్ణవంశీ ప్రారంభించినా దాదాపు ఐదారు నెలల సమయం పట్టే అవకాశముంటుందని అనుకుంటున్నాడట.

 క‌థ కృష్ణ‌వంశీది కాదు:

క‌థ కృష్ణ‌వంశీది కాదు:


101వ సినిమాకి క‌థ‌, ద‌ర్శ‌కుడు కోసం బాల‌య్య ఆల్రెడీ వేట మొద‌లెట్టేశార‌ని స‌మాచారం. రైతు క‌థ కృష్ణ‌వంశీది కాదు. మ‌రో ర‌చ‌యిత‌ది. క‌థ‌పై అంత న‌మ్మ‌కం ఉంటే.. ఈ సినిమాకి మ‌రో ద‌ర్శ‌కుడ్ని ఎంచుకొనే అవ‌కాశం ఉంది. కానీ ఏమైందో బాల‌య్య మాత్రం ఈ ప్రాజెక్టునే వ‌ద్ద‌నుకొంటున్నాడ‌ని తెలుస్తోంది. సో.. కృష్ణ‌వంశీకి మ‌ళ్లీ నిరాశే అన్న‌మాట‌.

 ర‌కర‌కాల మ‌లుపులు:

ర‌కర‌కాల మ‌లుపులు:


రైతు క‌థ కృష్ణ‌వంశీ చేతుల్లోకి వెళ్లాక ర‌కర‌కాల మ‌లుపులు తిరుగుతోంద‌ని, ఒక రోజు ఒక‌లా.. మ‌రో రోజు మ‌రోలా క‌థ మార్చేస్తున్నార‌ని, ఈ విష‌యంలో కృష్ణ‌వంశీకి బాల‌య్య‌కు మ‌ధ్య క‌మ్యునికేష‌న్ గ్యాప్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అందుకే... రైతు సినిమాని మ‌రోసారి హోల్ట్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

 కమర్షియల్ సినిమాలో:

కమర్షియల్ సినిమాలో:


కాబట్టి అన్ని నెలలు ఖాళీగా ఉండే బదులు.. ఈ గ్యాప్‌లో ఓ కమర్షియల్ సినిమాలో నటించాలని బాలకృష్ణ భావిస్తున్నాడట. దీంతో కొంత మంది యువ డైరెక్టర్లను పిలిపించుకుని కథలు వింటున్నాడట. తనకు సరిపడే కథను సిద్ధం చేసుకుంటే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడన్న హింట్లు ఇస్తున్నాడని టాక్. అయితే.. బాలయ్య సన్నిహితులు మాత్రం ఇవన్నీ రూమర్లేనని, అతడి 101వ సినిమా రైతేనని స్పష్టం చేస్తున్నారట. మరి దీనిపై క్లారిటీ వచ్చేది సంక్రాంతికి బాలయ్య సినిమా విడుదలయ్యాకే.

 ఈ సంక్రాంతికి :

ఈ సంక్రాంతికి :


బాలకృష్ణ 100వ చిత్రంగా రానున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి' రోజు రోజుకి అంచనాలను పెంచేస్తూ వెళుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ లతో హైప్ క్రియేట్ చేస్తున్న చిత్ర బృందం పక్కా ప్లానింగ్ తో షూటింగును కానిచ్చేస్తూ, ఇంతవరకూ 80 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది..

English summary
The is not happy with Krishna Vamsi’s tuning narrated sources. There has been a huge communication gap as Balayya was not convinced with the final draft. If sources are to be believed, Rythu has been kept on hold currently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu