»   » మహేష్ బాబుని ఉద్దేశించే బాలకృష్ణ అలా అన్నారా?

మహేష్ బాబుని ఉద్దేశించే బాలకృష్ణ అలా అన్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏమీ లేని మామూలు సినిమాలను కూడా ఏడాది, రెండేళ్లు దాటి తీస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఏమిటో తెలియడం లేదు. బోలెడంత మేన్‌ పవర్‌, కాలం, డబ్బు...వృధా అయిపోతున్నాయి. అవసరం లేనివాటికి కూడా ఇంత వృధా చేయడం అవసరమా అనిపిస్తుంది. రెండు సినిమాలు సరిపడా నెగటివ్‌ వృధా చేసేస్తున్నారు అంటూ బాలకృష్ణ తాజాగా మీడియాతో పరిశ్రమ పరిస్ధితి గురించి ఉన్న నిజం చెప్పుకొచ్చారు. మీ అనుభవంతో పరిశ్రమ ఏ దిశగా పయనిస్తుందో చెప్పగలరా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆ రకంగా స్పందించారు. అయితే ఈ విషయం చాలా క్యాజువల్ గా ఉన్నా హీరో మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రాన్ని ఉద్దేశించి అన్నట్లుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రెండేళ్ళుగా త్రివిక్రమ్ ఆ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా ఆ చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu