Don't Miss!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Sports
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పరమ చెత్త.. అసలు ప్లాన్సే లేవు: పాక్ మాజీ క్రికెటర్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అదృష్టం పిలిచింది.. మృత్యువు లాక్కెళ్లింది.. రవితేజ సోదరుడు భరత్‌కు అరుదైన అవకాశం..
పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సినీ నటుడు భరత్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడిప్పుడే చెడు అలవాట్లకు దూరమై కెరీర్‌పై దృష్టిపెట్టిన భరత్‌ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో పరిసర ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. మరణం తర్వాత భరత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఫిట్‌నెస్‌పై దృష్టి..
డ్రగ్స్ వినియోగం, మద్యం సేవించడం లాంటి వ్యసనాలతో భరత్ వ్యక్తిగత జీవితం, సినీ నటుడిగా ప్రొఫెషనల్ జీవితం మసకబారింది. ఆ మధ్యకాలంలో కేసుల్లో చిక్కుకున్నాడు. వివాదాలతో భరత్ మీడియాలో ప్రముఖంగా మారాడు. ఈ మధ్యకాలంలో వివాదాలకు దూరం ఉంటూ కెరీర్‌ను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు. శరీరం, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోకు ఎంపికైనట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

బిగ్‌బాస్‌లోకి భరత్
జాతీయ స్థాయిలోని ఓ టెలివిజన్ ఛానెల్లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చిందట. ఈ కార్యక్రమాన్ని కొన్నేండ్లుగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రసారం కాబోయే బిగ్‌బాస్ రియాలిటీ సిరీస్‌లో నటించే అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనే విషయంలోనే ఫిట్‌నెస్‌ను ఇంప్రూవ్ చేసుకొంటున్నట్టు సమాచారం.

గ్లామర్ కోసం స్విమ్మింగ్, జిమ్
ఫిట్‌నెస్ ఇంప్రూవ్‌మెంట్ కార్యక్రమంలో భాగంగానే భరత్ శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో స్విమ్మింగ్, జిమ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే శనివారం కూడా జిమ్, స్విమ్మింగ్ లాంటివి పూర్తి చేసుకొన్నట్టు తెలుస్తున్నది. నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే భరత్ మృత్యువాత పడ్టారు.

దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉండేది..
ఒకవేళ ప్రమాదానికి గురికాకుండి ఉంటే భరత్‌కు బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కేది. దేశవ్యాప్తంగా భరత్‌కు ప్రాచుర్యం లభించేది. మరొక నెలలోనే బిగ్‌బాస్ షూటింగ్ కూడా మొదలయ్యేదనేది తాజా సమాచారం. ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా స్విమ్మింగ్ చేస్తున్నాడని భరత్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇంతలోనే భరత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.