»   » దాసరి ఆర్థిక పరిస్థితి అంత దారుణమా? హాస్పిటల్‌కు వెళ్లే ముందు..

దాసరి ఆర్థిక పరిస్థితి అంత దారుణమా? హాస్పిటల్‌కు వెళ్లే ముందు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు అంటే సినిమా రంగంలో ఓ శిఖరం. ఆయన కెరీర్‌లో వరుసగా డజనుకుపైగా బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన ఘనత ఉంది. హైదరాబాద్‌లో షూటింగ్ ముగించుకొని చెన్నై చేరుకొంటే డజన్ల కొద్ది నిర్మాతలు ఎయిర్‌పోర్ట్‌లో క్యూ కట్టేవారట. సినిమా గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిర్మాతలు బ్లాంక్ చెక్కులు ఇవ్వడానికి రెడీగా ఉండేవారట. అలా ఓ వెలుగు వెలిగిన దాసరి చివరి రోజులు చాలా దారుణంగా ముగిసిపోయాయి. సినిమా రంగంలో నా వాళ్లు అనుకొన్న వారు కూడా దాసరి మరణం తర్వాత ముఖం చాటేశారు. చివరకు దూరంగా పెట్టిన కుటుంబమే ఆయనకు అండగా మిగిలింది. ప్రస్తుతం వివాదాల్లో కూరుకుపోయిన ఆస్తులను, ఆర్థిక లావాదేవీలను సన్నిహితులు చక్కబరిచే ప్రయత్నం చేస్తున్నారనే తాజా సమాచారం.

 ఇచ్చిన డబ్బుకు లెక్కా పత్రం..

ఇచ్చిన డబ్బుకు లెక్కా పత్రం..

ఇటీవల కాలంలో తన సంపాదనలో చాలా భాగంలో కొంత ఇతరులకు సర్దుబాటు చేశారని, మరికొంత ఫైనాన్షియర్లకు ఇచ్చారని వార్తలు వెలువడుతున్నాయి. వాటికి లెక్కా పత్రం కూడా లేకపోవడం వల్ల ఆ మొత్తాలు వస్తాయో రాయో అనే పరిస్థితి ఉందట. అంతేకాకుండా తీసుకొన్న వారు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నట్టు తెలుస్తున్నది.

డబ్బుల ఊసెత్తని నిర్మాత, ఫైనాన్షియర్

డబ్బుల ఊసెత్తని నిర్మాత, ఫైనాన్షియర్

ఇండస్ట్రీలోని వివిధ వ్యక్తులకు కొంత మొత్తాలను ఇచ్చిన వారిలో ఓ ప్రముఖ నిర్మాత, మరో ఫైనాన్షియర్ వున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సీబీఐ కేసులు, ఇతర తగాదాల కారణంగా దాసరి ఆస్తులన్నీ ఏదో ఓ సమస్యలో కూరుకుపోయాయని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

 సొంత ఇంటిపై అప్పు తీసుకొన్న దర్శకరత్న

సొంత ఇంటిపై అప్పు తీసుకొన్న దర్శకరత్న

మరణించేంత వరకు నివసించిన నివాసంపై కూడా అప్పు ఉందట. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్ మెంట్లు, ఆస్తులు అటాచ్‌మెంట్ ల్లో వున్నాయట. అలాంటి ఆస్తులన్నీ ఓ కొలిక్కి రావడానికి చాలా టైమ్ పడుతుందనేది తాజా సమాచారం. తాను నివసించే ఇంటిపై దాసరి అప్పు తీసుకోవడానికి కారణం నెలవారీ ఖర్చుల ప్రభావమే అని తెలుస్తున్నది.

ప్రతి నెల ఇంటి ఖర్చు రూ.30 లక్షలు

ప్రతి నెల ఇంటి ఖర్చు రూ.30 లక్షలు

ప్రతి నెల ఆయన ఇంటి మెయింటెనెన్స్ ఖర్చు సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రతి నిమిషం ఇళ్లంతా బోలెడు ఏసీలు రన్ అవుతాయట. దాంతో భారీగా కరెంట్ బిల్లు వచ్చేదట. ఇక తన ఆఫీసు నిండా జనం ఉండేవారట. భోజనాల సమయంలో కనీసం రెండు డజన్ల మంది వుండేవారట. ఆయన ఉన్నన్నీ రోజులు ఆఫీస్ కళకళలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించేందని కొందరు గుర్తు చేసుకొంటున్నారు.

అతిథులకు సకల మర్యాదలు

అతిథులకు సకల మర్యాదలు

తనను కలువడానికి, ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చిన వారికి కాఫీ, టీ, భోజనం లాంటి వాటితో దాసరి సకల మర్యాదలు చేసేవారట. ఆదాయానికి మించి ఖర్చు ఉంటున్నా తన వాళ్లకు పెడుతున్నామనే భావనలో ఉండేవారట. బయటి వ్యక్తులకు ఇచ్చి డబ్బు సమయానికి చేతికి అందక, ఇంటిపై అప్పుతెచ్చారని వార్త ఫిలింనగర్‌లో సర్కులేట్ అవుతున్నది. ప్రస్తుతం దాసరి లేకున్నా, ఆయన సన్నిహితులు ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దే పనిలో వున్నారు.

చివరి రోజుల్లో ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ప్రయత్నం

చివరి రోజుల్లో ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ప్రయత్నం

వైద్య చికిత్స కోసం తొలిసారి హాస్పిటల్‌రే వెళ్లడానికి ముందే దాసరి తన సన్నిహితుల ద్వారా కొన్ని ఆర్థిక లావాదేవీలు చక్క బెట్టే ప్రయత్నం చేసారట. వాటిలో కొన్ని ఓ కొలిక్కిరాగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇంతలోనే దాసరి మరణించడంతో పలు ఆర్థిక లావాదేవీల వ్యవహారం ప్రశ్నార్థకం అయినట్టు మారింది.

English summary
After death of Dasari Narayanarao, lot of news pouring about his debts, and assets. Some of the his assets in attachment stage. Dasari gives his money to Industry personalities without any legal agreement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu