»   » ఈ సారి శ్రీను వైట్ల టార్గెట్ విక్టరీ వెంకటేష్!.. మిస్టర్‌లో ‘లక్ష్మీ తులసి’ అంటూ సైటైర్లట..

ఈ సారి శ్రీను వైట్ల టార్గెట్ విక్టరీ వెంకటేష్!.. మిస్టర్‌లో ‘లక్ష్మీ తులసి’ అంటూ సైటైర్లట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ మంచి కామెడీ టైమింగ్‌తో సినిమాలు తీయడంలో శ్రీను వైట్లది డిఫరెంట్ స్లయిల్. తన ప్రతీ సినిమాల్లో సినీ ప్రముఖుల పాత్రను సృష్టించి సెటైర్లు సంధించడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకు ఆయన గత చిత్రాలు రుజువు చేశాయి. దుబాయ్ శీనులో సూపర్ స్టార్ కృష్ణ పాత్రను, కింగ్‌ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని పోలిన పాత్ర, మరో చిత్రంలో రాంగోపాల్ వర్మ పాత్రలకు కామెడి టచ్‌ చేసి ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రయోగాన్ని ఈసారి వెంకటేష్ మీద చేసినట్టు తెలిసింది.

 లక్ష్మీ తులసిగా పృథ్వీ

లక్ష్మీ తులసిగా పృథ్వీ

మిస్టర్ చిత్రంలో హాస్యనటుడు పృథ్వీతో చేయించిన పాత్ర వెంకటేష్‌దే అనే మాట వినిపిస్తున్నది. పృథ్వీ పోషించే పాత్ర పేరు లక్ష్మీ తులసి కావడంతో అది వెంకీని పోలిన పాత్ర అని కన్ఫర్మ్ అంటున్నారు. ఒకవేళ వెంకటేష్‌ను ఇబ్బంది పెట్టే సీన్లు ఉంటే మాత్రం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందనదే ఫిలింనగర్ టాక్.

హిట్ లక్ష్యంగా శ్రీను వైట్ల మిస్టర్

హిట్ లక్ష్యంగా శ్రీను వైట్ల మిస్టర్

దూకుడు, బాద్షా చిత్రాల తర్వాత శ్రీను వైట్ల ఖాతాలో సరైన హిట్ పడలేదు. మహేశ్ బాబుతో ఆగడు, రాంచరణ్‌తో బ్రూస్‌లీ చేదు ఫెయిల్యూర్‌నే అందించాయి. ఈ నేపథ్యంలో మరో మంచి హిట్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో శ్రీను వైట్ల ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ సారి హిట్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్‌తో జతకట్టాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ నటిస్తున్నారు.

ఇలాంటి కథ కోసం చాలా రోజులుగా..

ఇలాంటి కథ కోసం చాలా రోజులుగా..

డైరెక్ట‌ర్‌గా `మిస్ట‌ర్‌` లాంటి క‌థ‌ కోసం చాలా రోజులుగా ఎదురుచూశాను. చ‌క్క‌టి భావోద్వేగాల‌కు, క‌డుపుబ్బ న‌వ్వుకునే వినోదానికి, విన‌సొంపైన సంగీతానికి, క‌నువిందు చేసే దృశ్యాల‌కు అనువుగా ఉన్న క‌థ ఇది అని ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల తెలిపారు. మిస్టర్ సినిమా అవుట్‌పుట్ చాలా సంతృప్తిక‌రంగా ఉంది. నేను ఏదైతే అనుకున్నానో దానిని వందశాతం ఎలాంటి కాంప్ర‌మైజ్ లేకుండా తీయ‌గ‌లిగాను. అందుకు నా నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్. అంద‌రూ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశారు. ట్రావెల్ ఫిల్మ్ త‌ర‌హాలో `మిస్ట‌ర్‌` చిత్రం సాగుతుంది అని ఆయన వెల్లడించారు.

ఏప్రిల్ 14న విడుదల

ఏప్రిల్ 14న విడుదల

మిస్టర్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్ఠార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం ఏప్రిల్ 14 తేదీన విడుదలకు సిద్ధమవుతున్నది.

English summary
Satires on film personality in his movie is Director Srinu Vaitla's routine experiment. Reports suggest that Now he is targeting the victory venkatesh with actor Prithvi. Mister is gearing up to release on April 14th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu