»   » ఇవివి సత్యనారాయణ సెటైర్ చిరంజీవి మీదేనా?

ఇవివి సత్యనారాయణ సెటైర్ చిరంజీవి మీదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న శుక్రవారం రిలీజైన ఇవివి చిత్రం బురిడీలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై సెటైర్ వేసారని అంతటా వినపడుతోంది. అందులో డాన్ అయిన ఎమ్.ఎస్.నారాయణ ఆర్దికపరిస్దితి బాగోలేని స్దితిలో ఉంటే అసెస్టెంట్ రఘుబాబు పార్టీ పెట్టండి అంటూ సలహా ఇస్తాడు. దానికి ఎమ్.ఎస్. పార్టీ పెట్టిన వాళ్ళే మూసేసుకుంటుంటే మనకు ఎందుకు అంటారు. అది డైరక్ట్ గా పార్టీ,వ్యక్తి పేరు ఎత్తకపోయినా చిరంజీవి ప్రజారాజ్యం మీదే అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామానాయుడు, రాఘవేంద్రరావులకు సెకెండ్ సెటప్ లని జోకులు ఉన్నాయి. వాటిని దియోటర్స్ లో ఎంజాయి చేస్తున్నా ఎంత ధైర్యంగా పెట్టారు అని కామెంట్స్ చేసుకోవటం వినిపిస్తోంది. ఇక ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఎవడి గోల వారిదే తరహాలో ఉండి కామిడీ పండించే ప్రయత్నం చేసింది. అయితే అక్రమ సంభందాలు ట్రాక్ లు ఎక్కువ అవటం, పాత్రలు అతిగా బిహేవ్ చేయటం చిత్రాన్ని చీప్ స్ధాయికి దిగజార్చేసాయి. మరో ప్రక్క ఈ చిత్రంతో రిలీజైన సింహా రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu