»   » హీరో సూర్య తీరుతో ఆగ్రహంగా ఉన్న గౌతం మీనన్!

హీరో సూర్య తీరుతో ఆగ్రహంగా ఉన్న గౌతం మీనన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: రాజకీయాల్లో మాదిరిగానే సినిమా పరిశ్రమలో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు. సౌత్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు గౌతం మీనన్ రిలేషన్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ ఇద్దరు కలిసి 'దృవ నచ్చిత్రమ్' అనే సినిమా చేయాలనుకున్నారు...ఎవరూ ఊహించని విధంగా ఇద్దరూ విడిపోయారు, దీంతో ఇద్దరూ కలిసి చేయాలనుకనే సినిమా ప్లాన్స్ రద్దయ్యాయి.

  ఇద్దరి మధ్య విబేధాలు ఎందుకొచ్చాయి? అనే విషయమై ఎట్టకేలకు దర్శకుడు గౌతం మీనన్ మౌనం వీడారు. తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌతం మీనన్ ఈ విషయమై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య విబేధాలు పెరిగి పోవడానికి కారణం సూర్య ప్రవర్తనే అని తెలుస్తోంది.

  తన సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సూర్య మీడియాకు వెల్లడించడం గౌతం మీనన్‌కు నచ్చలేదు. సూర్య తీరు ఆయనకు కోపం తెప్పించింది. ఆ విషయం మీడియాతోతో చెప్పకుండా నేరుగా తనకు చెబితే బావుడేదని గౌతం మీనన్ ఇంటర్య్వూలో చెప్పినట్లు తెలుస్తోంది

  'నేను స్టోరీ నచ్చితేనే సినిమాలు చేస్తాను. గౌతం మీనన్ స్టోరీ నాకు నచ్చింది...కానీ కొన్ని మార్పులు చేయమని కోరాను. ఆరు నెలలు వెయిట్ చేసాను. ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇక వెయిట్ చేసే ఓపిక లేదు. ఇక ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాలనే నిర్ణయించుకున్నాను. గతంలోనూ గౌతం మీనన్‌తో ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. మా ఇద్దరి ఆలోచనలు కలవడం లేదు' అంటూ సూర్య ఆ మధ్య మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

  ధృవ నచ్చిత్రమ్

  ధృవ నచ్చిత్రమ్


  ధృవ నచ్చిత్రమ్ మే నెలలో ప్రారంభమైంది. దర్శకుడు ఈ సినిమా కోసం కొందరు నటీనటులు, టెక్నీషియన్స్‌ను కూడా ఎంపిక చేసారు. కొన్ని సీన్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. హీరో, దర్శకుడి మధ్య విబేధాలతో సినిమా రద్దయింది.

  సూర్య-మీనన్ జోడి

  సూర్య-మీనన్ జోడి


  సూర్య-గౌతం మీనన్ జోడీ బెస్ట్ జోడీగా కోలవుడ్లో పేరుంది. వీరి దర్శకత్వంలో గతంలో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

  విభిన్న దారులు

  విభిన్న దారులు


  ఏది ఏమైతేనేం....గౌతం మీనన్, సూర్య ప్రస్తుతం ఎవరి పని వారు చూసుకుంటున్నారు. సూర్య ప్రస్తుతం ఎన్. లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా....వెంకట్ ప్రభు చిత్రంలోనూ మరో చిత్రానికి కమిట్ అయ్యారు.

  మీనన్-అజిత్

  మీనన్-అజిత్


  గౌతం మీనన్ తమిళ హీరో అజిత్‌తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈచిత్రం 2014 ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉంది.

  గౌతం మీనన్ నెక్ట్స్ ఫిల్మ్

  గౌతం మీనన్ నెక్ట్స్ ఫిల్మ్


  గౌతం మీనన్ ప్రస్తుతం హీరో శింబుతో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ దర్శకత్వం వహించనున్నారు.

  English summary
  They say nobody is enemy or a permanent friend in the film industry. It seems to be true in case of Gautham Menon and Surya, who shared warm relationship until recently. The duo, who was supposed to work in Dhruva Natchathiram, shockingly parted ways recently as their planned film was shelved.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more