»   » హీరోయిన్ జెనీలియా మళ్లీ గర్భవతి?

హీరోయిన్ జెనీలియా మళ్లీ గర్భవతి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన జెనీలియా... తన ప్రియుడు, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌మఖ్‌ను పెళ్లాడటం తెలిసిందే. వారికి రియాన్ అనే బాబు జన్మించడం...ఇటీవల ఆ బాబు తొలి పుట్టరోజు వేడుక కూడా జరుగింది. తాజాగా జెనీలియా మళ్లీ గర్భవతి అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై జనీలియా ఫ్యామిలీ నుండి ఎలాంటి అఫీషియల్ సమాచారం రాలేదు.

ఇక 'తుజే మేరీ కసమ్‌'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్‌, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. నవంబర్ 25, 2014న రియాన్ జన్మించాడు. ఈ బుడతడు ఇంకా బాలీవుడ్లో అడుగు పెట్టక పోయినా బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. బాలీవుడ్ సర్కిల్ లో షారుక్ ఖాన్ కొడుకు అబ్ రామ్ తర్వాత, ఆ రేంజిలో సెలబ్రిటీ కిడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రియాన్.

రియాన్ పుట్టిన తర్వాత జెనీలియా మళ్లీ సినిమాల్లోకి వస్తుందని అంతా భావించారు. అయితే ఆమె మరోసారి గర్భం దాల్చడం బట్టి చూస్తే ఇప్పట్లో ఆమె రీఎంట్రీ ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరో బిడ్డ పుట్టిన తర్వాత రితేష్, జెనీలియా దంపతులు కుటుంబ నియంత్రణ పాటించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Genelia
English summary
Bollywood source said that, Genelia Deshmukh set to become mother for the second time.
Please Wait while comments are loading...