»   » లీక్ : 'సన్నాఫ్‌ సత్యమూర్తి' పూర్తి కథ ఇదేనా?

లీక్ : 'సన్నాఫ్‌ సత్యమూర్తి' పూర్తి కథ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ఈ చిత్రం పైన ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రీసెంట్ గా సెన్సార్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ కథ తిరుగుతోంది. అయితే కేవలం కొందరు ట్రైలర్స్ చూసి కల్పించిన కథా లేక నిజమైనదా అనేది తెలియాల్సి ఉంది. చెప్పుకుంటున్న ఆ కథ క్రింద విధంగా ఉంది.

సత్యమూర్తి (ప్రకాష్ రాజ్)..ఓ పెద్ద ఇండస్ట్ర్రిలియిస్ట్. అతను ఎవరన్నా సాయం అడిగితే కాదనని వ్యక్తి. అతని కొడుకు విరాజ్‌ ఆనంద్ (అల్లు అర్జున్). అనుకోని విధంగా...ప్రకాష్ రాజ్ ఓ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అయితే తన భవిష్యత్ కోసం తన తండ్రి 300 కోట్లు వదిలాడని అల్లు అర్జున్ కు అర్దమవుతుంది. ప్రకాష్ రాజ్ క్లోజ్ ఫ్రెండ్ రాజేంద్రప్రసాద్ ఏమి చెప్తాడంటే... ఆ మూడు వందలు కోట్లు ...ఆస్దిని ఎలాంటి తండ్రి చేసిన అప్పులు తీర్చకుండా స్వాధీనం చేసుకోమని సలహా ఇస్తాడు. కానీ తండ్రి పరువు మరణించిన తర్వాత కూడా ఉండాలని కోరుకునే విలువలున్న ఆ కొడుకు..నో చెప్పి..ఆ ఆస్దితో మొత్తం అప్పులు తీర్చుతాడు. అంతేకాదు తన కుటుంబాన్ని తీసుకుని సిటీకు దూరంగా వెళ్తాడు. అల్లు అర్జున్, అతని తల్లి, అన్న వెన్నెల కిషోర్, వదన, అన్న కొడుకులతో కలిసి వెళ్తాడు. వాళ్లంతా కలసి ఓ చిన్న ఇల్లు తీసుకుని అక్కడ ఉంటూంటారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అటు వంటి పరిస్ధితుల్లో కుటుంబాన్ని బ్రతికించటానికి తన స్నేహితుడు సాయింతో...అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. ఇలా ఉండగా..ఓ రోజు..అల్లు అర్జున్... ఓ మ్యారేజ్ ఈవెంట్ ఒప్పుకుంటాడు. ఆ పెళ్లికి వెళ్ళిన అతనికి అక్కడ ఎక్స్ ఫియాన్సి (అదా శర్మ) పెళ్లి కూతురుగా కనిపిస్తుంది. ఆమె ఓ పెద్ద కోటీశ్వరుడుని చేసుకుంటూంటుంది. అక్కడకి వచ్చిన రాజేంద్రప్రసాద్ అది గమనించి...అందరికీ సహాయం చేసే గుణంతో మీ నాన్న మీ కుటుంబాన్ని అన్యాయం చేసాడని అల్లు అర్జున్ తో అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ తన తండ్రి గొప్పతనం చెప్పి..తనకు ఆయనంటే గౌరవం అని చెప్తాడు. అదంతా అక్కడే ఉన్న సమంత విని ఇంప్రెస్ అవుతుంది. ఇక్కడో ట్విస్ట్..ఆమె మరెవరో కాదు రాజేంద్రప్రసాద్ కుమార్తె.


Is it Allu Arjun's S/o Satyamurthy Story ?

ఆ తర్వాత అల్లు అర్జున్ ..ఆమెతో ప్రేమలో పడటం..పెళ్లి దాకా ప్రయాణించటం జరుగుతంది. అయితే రాజేంద్రప్రసాద్ ఓ కండీషన్ పెడతాడు తన కూతురుని చేసుకోవాలంటే. అది..వివాదంలో ఇరుకున్న తన 50 కోట్ల ప్రాపర్టీ కు సంభందించిన డాక్యుమెంట్స్ ఉపేంద్ర దగ్గర ఇరుక్కుపోయాయని...వాటిని తెచ్చిపెట్టి తన కూతురుని చేసుకోవాలని. ఉపేంద్ర రాయలసీమలో పెద్ద ప్యాక్షనిస్ట్.


దాంతో ఆ పని మీద రాయలసీమ వచ్చిన అల్లు అర్జున్ కు ...ఉపేంద్రకు ఓ శతృవు ఉన్నాడని అతను సంపత్ రాజ్(రన్ రాజా రన్ విలన్) అని తెలుస్తోంది. అతను ఒక్కడు మాత్రమే ఆ డాక్యుమెంట్స్ ని ఉపేంద్రనుంచి తేగలడని అర్దం చేసుకుంటాడు. దాంతో ఆ ఇంటికి బయిలు దేరతాడు. అయితే అనుకోకుండా.. రెండు ఇళ్లూ ప్రక్క ప్రక్కనే ఒకే విధంగా ఉండటంతో ఉపేంద్ర ఇంటికి పొరపాటున వెళ్లి... తన కథ మొత్తం చెప్పి...డాక్యుమెంట్స్ తెచ్చి పెట్టి సహాయం చేయమంటాడు.


అప్పుడు ఉపేంద్ర...అల్లు అర్జున్ ని, రాజేంద్రప్రసాద్ ని కోపంతో చంపబోతాడు. అదే సమయంలో ప్రక్క ఇంట్లో ఉన్న సంపత్ రాజ్ ... ఉపేంద్ర మీదకు ఎటాక్ చేస్తాడు. అప్పుడు ఉపేంద్రని అల్లు అర్జున్ కాపాడతాడు. ఇంప్రెస్ అయిన ఉపేంద్ర...తన చెల్లి నిత్యామీనన్ ని వివాహం చేసుకోమంటాడు. వివాహం రోజునే ..ఆ డాక్యుమెంట్స్ ఇస్తానని కండీషన్ పెడతాడు. అయితే ఇక్కడో ట్విస్ట్...నిత్యామీనన్.. అల్లు అర్జున్ ని ఇష్టపడదు. ఆమె వేరే వారితో ప్రేమలో ఉంటుంది. ఈ ప్రాసెస్ లో .. నిత్యా తో కలిసి అల్లు అర్జున్ పారిపోబోతాడు. అప్పుడు అల్లు అర్జున్ కు ఇంకో నిజం తెలుస్తుంది. తన తండ్రికి మరణానికి కారణం తెలుస్తుంది. ఇంతకీ సత్యమూర్తి మరణానికి కారణం ఏంటి..చివరకు ఏమైంది అనేది వెండితెరపై చూడటమే.


Is it Allu Arjun's S/o Satyamurthy Story ?

గమనిక: ఈ కథ ...నిజమా కాదా తెలియదు..కేవలం ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నది మాత్రమే. సరదాగా చదువుకోవటానికి మాత్రమే. తెరపై వేరే కథ ఉండవచ్చు.


'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌.


Is it Allu Arjun's S/o Satyamurthy Story ?

తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు త్రివిక్రమ్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'సన్నాఫ్‌ సత్యమూర్తి'.


చిత్ర నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ ''ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు త్రివిక్రమ్‌. బన్నీ స్త్టెల్‌, నటన అందరికీ నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం శ్రోతలను అలరిస్తోంది''అన్నారు.


అల్లు అర్జున్‌ హీరో. సమంత, నిత్య మేనన్‌, ఆదా శర్మ హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలు పోషించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

English summary
Allu Arjun, Samantha, Nitya Menon, Adah Sharma starrer “S/O Satyamurthy” story line of the film is out and its goes as follows
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu