twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపి..గోపిక.. స్టొరీ లైన్?

    By Staff
    |

    వేణు, కమలినీ ముఖర్జీ జంటగా ప్రముఖ దర్శకుడు వంశీ రూపొందించిన చిత్రం 'గోపి గోపిక గోదావరి'. గోదావరి నేపద్యం లో తయారైన ఈ చిత్రం రేపే (ఈ నెల 10న) విడుదలవుతోంది. అలాగే ఈ చిత్రం కథపై బయిట రకరకాల కథనాలు వినపడుతున్నాయి. వాటి ప్రకారం కమిలినీ ముఖర్జీ గోదావరిలో మొబైల్ హాస్పటిల్ ని నడుపుతూంటుంది. అక్కడ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి వచ్చిన వేణుని ఆమె చికిత్స చేసి వైద్యం చేస్తుంది. తెలుస్తోంది. అయితే అతను ఈ ప్రమాదంలో తన జ్ఞాపక శక్తిని కోల్పోయి ఉంటాడు. ఆ తర్వాత అతను కమిలినీతో ప్రేమలో పడతాడు. అయితే అంతకు ముందే అతనికి సిటీలో ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ రెండింటి మధ్యా ఏం జరుగుతుందనేది కథ అంటునన్నారు.చూడడం రేపు ఇదో కాదో తేలి పోతుంది కదా.

    ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ సమర్పణలో మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేష్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సందర్భం గా సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ "ఆడియో పెద్ద హిట్టు. కామెడీ, లవ్‌, సెంటిమెంట్‌ అంశాలతో వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు. హీరో హీరోయిన్ల మధ్య లవ్‌, మదర్‌ సెంటిమెంట్‌, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి అన్నారు. 'కింగ్‌ ఆఫ్‌ గోదావరి' అయిన వంశీ ఈ చిత్రంలో గోదావరి అందాల్ని చాలా బాగా చూపించారు" అని చెప్పారు. ఇంత చక్కని ఎమోషనల్‌ ఫిల్మ్‌లో నటించడం ఆనందంగా ఉందనీ, గోదావరి అందాలకు తగ్గట్లే ఈ సినిమా పాటలున్నాయనీ హీరోయిన్‌ కమలిని తెలిపారు. ఇక చాల గ్యాప్ తో వస్తూన్న వంశి చిత్రం కావటంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయ్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X