»   » ఎన్నారైతో పెళ్లి గురించి , శృతి హాసన్ ఇలా అంది, అతనికి తెలుసా?

ఎన్నారైతో పెళ్లి గురించి , శృతి హాసన్ ఇలా అంది, అతనికి తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్స్ ..పెళ్లి వార్తలు మీడియాలో రావటం అత్యంత సాధారణం. ఆ తర్వాత వాటిని అంతే స్పీడుగా సదరు హీరోయిన్స్ ఖండించెయ్యటం కూడా జరుగుతూంటుంది. తాజాగా హీరోయిన్ శృతి హాసన్...ఓ ఎన్నారై బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. తమిళ మీడియా ఈ వార్తలను హైలెట్ చేసింది.

అయితే ..శృతి హాసన్ ఈ వార్తలపై స్పందించింది. అయితే సీరియస్ గా కాదు సుమా. చాలా సరదాగా ..హా..నిజమా...ఇంతకీ ఆ ఎన్నారైకి ఆ విషయం చెప్పారా..పెళ్లి తర్వాత మరి అన్నట్లు గా అంది. ఈ విషయమే ఓ ట్వీట్ కూడా వేసిందండోయ్. ఇదీ వార్తేగా. శృతిహాసన్ ఇలాంటివార్తలకు అలవాటు పడిపోయిన్నట్లుంది.

తెలుగు,తమిళ,హిందీ భాషల్లో అనేక సినిమాలు తీస్తూ..ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసి మెప్పించిన విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా శృతిహాసన్ వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు,తమిళంలో వరస సినిమాలు చేసింది. ప్రస్తుతం నాగచైతన్య చిత్రం ప్రేమమ్ లో టీచర్ మలర్ పాత్ర చేస్తోంది. అలాగే పవన్ సరసన డాలీ చిత్రం సైతం కమిటైంది.

ఇదిగో ఇలా

ఇదిగో ఇలా

శృతిహాసన్ వివాహం చేసుకోబోతోందంటూ వచ్చిన వార్త ఇదిగో.. ఈ వార్తని చూసే ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు

అంత సీన్ లేదు

అంత సీన్ లేదు

అయితే శృతి ఈ వార్తను చూసి ఇలా స్పందించింది. లైట్ గా ఈ మ్యాటర్ ని తీసుకుంది

ఆ మధ్యన

ఆ మధ్యన

పెళ్లి ప్రస్తావన రాగానే చిర్రెత్తుకొచ్చే శృతిహాసన్‌ ప్లేటు ఫిరాయించింది. అసలు జీవితంలో పెళ్లి చేసుకోవట్లేదు అనుకుంటున్నానని చెప్పిన ఈ అమ్మడు.. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని టాక్‌ టు కుష్బు షోలో వెల్లడించింది.

కులం లేదు

కులం లేదు

అంతే కాదు తన వ్యక్తిగత విషయాలు కూడా వెల్లడించింది.ఆ మద్య తన బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు పెట్టుకోగా కులం పేరు చెపేందుకు అంగీకరించలేదు. కానీ భారతీయురాలినని పేర్కొంది.

నో డేటింగ్

నో డేటింగ్

ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని కాకపోతే తనకు దగ్గర ఫ్రెండ్ వాలంటైన్స్ డే రోజున తన ప్రేమను వ్యక్తపరిచినట్లు ఆమె గుర్తుచేసుకుంది.

వాళ్లే ఇష్టం

వాళ్లే ఇష్టం

తన తండ్రి కమల్ హాసన్ ,చెల్లెలు అక్షర హాసన్ అంటే చాలా ఇష్టమని వాళ్లే తన లైఫ్ అని కుష్బుతో శృతి చెప్పింది.

ఇప్పుడిప్పుడే లేదు

ఇప్పుడిప్పుడే లేదు

శృతిహాసన్ కు కెరీర్ మీదే తన దృష్టి అంతా ఉందని, ఇప్పుడిప్పుడే పెళ్లి మాటలేదు అని తేల్చి చెప్పింది.

ప్రపోజల్స్ అబద్దం

ప్రపోజల్స్ అబద్దం

పలువురు సెలబ్రిటీలతో డేటింగ్‌ చేస్తున్నట్లు వచ్చిన రూముర్లు వాస్తవం కాదని, ఇప్పటివరకు తననెవరూ ప్రపోజ్‌ చేయలేదని స్పష్టం చేసింది.

పుంజుకుంది

పుంజుకుంది

తెలుగులోమహేష్ బాబు సరసన నటించిన 'శ్రీమంతుడు' సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా తమిళంలో అజిత్ సరసన నటించిన 'వేదలం' సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో శృతిహాసన్ రెమ్యూనరేషన్ కూడా అమాంతంగా పెంచేసింది.

English summary
A twitter handle claimed that Shruti Haasan is likely to get married next year with a NRI business man from Mumbai and after Asin would be one more heroine to marry a businessman. Actress Shruti Haasan makes fun of those who talk about her so called wedding with a NRI businessman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu