»   » అఖిల్ రెండో సినిమా కథ ఇదేనా..?? హిందూ ముస్లిం ప్రేమకథా..??

అఖిల్ రెండో సినిమా కథ ఇదేనా..?? హిందూ ముస్లిం ప్రేమకథా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

అఖిల్ అక్కినేని అఖిల్ సినిమా తర్వాత కొత్త మూవీకి గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి సినిమా తోనే ప్రపంచ స్థాయి యాక్షన్ మూవీ లాంటిది తీయబోయి ధారుణం గా దెబ్బ తిన్నాడు. దాంతో రెండోసారైనా మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకున్న అఖిల్..ఫైనల్ గా తన సెకండ్ మూవీని లాంఛ్ చేశాడు. మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి బిగ్గెస్ట్ హిట్‌ను అందించిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

రొమాంటిక్ లవ్ స్టోరీ

రొమాంటిక్ లవ్ స్టోరీ

ఇప్పుడు విక్రమ్ దర్శకత్వంలో తాను చేస్తున్నది రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పాడు అఖిల్. ఇదొక ప్రయోగాత్మక కథతో తెరకెక్కుతున్న సినిమా అని తెలిపాడు. ఇందులో యాక్షన్ అనేది ఒక పార్ట్ అని.. పూర్తి స్థాయి యాక్షన్ సినిమా మాత్రం కాదని అఖిల్ తెలిపాడు. ఈ చిత్రం టిపికల్ విక్రమ్ కుమార్ స్టయిల్లో ఉంటుందని చెప్పాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయన్నాడు.

ఇదే ఆ కథ

ఇదే ఆ కథ

ఇప్పటికైతే ఇదే ఆ కథ అంటూ ఒక స్టోరీ వినిపిస్తోంది ఆ లవ్ స్టోరీలోకి వెళితే, సినిమాలో హీరో హీరోయిన్లు చిన్నప్పుడే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి మారిపోతారట. అది కూడా హిందూ కుటుంబం నుంచి ముస్లిం కుటుంబానికి, ముస్లిం కుటుంబం నుంచి హిందూ కుటుంబానికి మారిపోతారట.

ఇంటర్వెల్ బ్యాంగ్

ఇంటర్వెల్ బ్యాంగ్

ఇక ఆ తర్వాత ఇద్దరూ అనుకోకుండా ప్రేమలో పడటం జరుగుతుందట. అంటే హీరోయిన్ తన ఇంటికే కోడలిగా వెళ్లాల్సిన పరిస్థితి, హీరో తన ఇంటికే తను అల్లుడిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఈ ఇంట్రెస్టింగ్ విషయం ఇంటర్వెల్ బ్యాంగ్ లో హీరో హీరోయిన్ల అమ్మలకు తెలిసిపోతుందట. ఇక అక్కడి నుంచి సినిమా క్లైమాక్స్ వరకూ ఓ రేంజ్ లో అలరిస్తుందని ఇన్నర్ టాక్.

గత సినిమాల్లో మాదిరే

గత సినిమాల్లో మాదిరే

ఇంతకు ముందు విక్రమ్ తీసిన సినిమాల్లో కూడా ఇలాంటి కుటుంబ ఎమోషనల్ డ్రామాలని బాగానే నడిపాడు ఇదేమాటని అఖిల్ మళ్ళీ చెప్తూ "విక్రమ్ గత సినిమాల్లో మాదిరే ఇందులోనూ హ్యూమన్ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశాడని.. తనలోంచి కొత్త కొత్త విషయాల్ని విక్రమ్ బయటికి తీస్తున్నాడని.. వాటి గురించి తనకు కూడా ఇప్పటిదాకా తెలియదని అన్నాడు.

సైమా వేడుకల్లో

సైమా వేడుకల్లో

విక్రమ్‌తో పని చేస్తున్నందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నానని.. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అక్కినేని కుర్రాడు చెప్పాడు. ఈ సినిమా నుంచి అఖిల్ ఓ పాటను సైమా వేడుకల్లో పాడి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ ఆలోచన సంగీత దర్శకుడు అనూప్‌దేనని.. దీని కోసం 30 గంటలు సాధన చేశానని అఖిల్ వెల్లడించాడు.

English summary
Akkineni Akhils next with Vikram Kumar is not an action movie it is a romantic feel good concept
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu