»   » జియా ఖాన్ సూసైడ్ లెటర్ నకిలీదా?

జియా ఖాన్ సూసైడ్ లెటర్ నకిలీదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటి జియా ఖాన్ సూసైడ్ నోట్ బయట పడటంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే అని, బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి కారణంగా ఆమె గర్భం కూడా దాల్చిందని, అబార్షన్ చేసుకుందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడ్డ వివాదాలు, మనస్పర్థలు ఆమెఆత్మహత్యకు దారి తీసాయని తెలుస్తోంది.

దీంతో పోలీసులు సూరజ్ పంచోలిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం సూరజ్ కోర్టు ఆదేశాల మేరకు జుడీ షియల్ కష్టడీలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. జియా ఖాన్ సూసైడ్ లేఖకు, తాజాగా బయట పడిన ఇతర లేఖల్లో చేతి రాత తేడాగా ఉందని సూరజ్ తల్లి జరీనా వాహెబ్ వాదిస్తోంది. చేతి రాతలో తేడా ఉన్నందు....ఈ విషయమై విచారణ జరుపాలని సూరజ్ తల్లి జరీనా వాహెబ్ వాదిస్తున్నారు.

ఈ నెల 27 వరకు సూరజ్‌ను జుడీషియల్ కష్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా...జియా ఖాన్‌కు అబార్షన్ జరిగిన విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. జియా ఖాన్ జూన్ 3న ముంబై జుహులోని తన అపార్టుమెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణం కేవలం కెరీర్లో ఆటుపోట్ల వల్ల ఒత్తిడే అని భావించి కేసు నమోదు చేసుకున్నారు.

కానీ జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ దొరకడంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియా తన లేఖలో బాయ్ ఫ్రెండ్ సూరజ్ కారణంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా బాధను అనుభవించానని, అతను తన జీవితాన్ని నాశనం చేసాడని పేర్కొంది. జియా రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసుల విచారణ సాగుతోంది.

English summary
Jiah's 'last letter' and a set of five love letters that she wrote to Suraj during their ill-fated affair. The findings seem to suggest that the handwritings do not match.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu