»   » బాహుబలి 2 లో కూడా కనిపించనున్నాడా..?

బాహుబలి 2 లో కూడా కనిపించనున్నాడా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత రెండేళ్లుగా అందరి నోళ్ళలో నానుతున్న సినిమా బాహుబలి, ఈ మధ్య కాలంలొ ఏ సినిమా కీ రానంత క్రేజ్ బహుబలి సాదించింది. అసలెవరూ ఊహించని సంచలన విజయం సాదించిన ఈ ఇండియన్ క్రేజీయెస్గ్ మూవీ ఇప్పుడు 2 భాగం చిత్రీకరణ కూడా జరుపుకుంటొంది. ఇప్పటికే స్టార్ క్యాస్ట్ విషయం లో ఎన్నో రకాల వార్తలు వచ్చిన ఈ సినిమా పై లేటెస్ట్ గా మరో న్యూస్ సంచలనం క్రియేట్ చేస్తుంది? అదేమిటంటే ఈ సినిమాలో ఓ గెస్ట్ పాత్రలో ఎన్టిఆర్ నటిస్తాడని !! దానికి కారణం లేకపోలేదు, ఇటివలే రాజమౌళి ఎన్టిఆర్ తో పర్సనల్ గా కలిసాడు, పైగా ఇద్దరి మద్య మంచి అనుబందం ఉన్న నేపద్యంలో బాహుబలి లాంటి సినిమాలో ఎన్టిఆర్ కు ఓ మంచి పాత్ర ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో బాగంగా ఆయనతో రాజమౌళి చర్చించినట్టు తెలుస్తోంది. మరి దీనిపై నిజానిజాలు తేలాల్సి ఉంది ?

is juniar NTR will appiars in bahubali?

ఇప్పటికే తమిళం నుండి సూర్య, కన్నడ ఇండస్ట్రీ నుంచి సుదీప్ వంటి నటులని కూడా బాహుబలి లో భాగం చేసిన జక్కన్న తర్వాత చేయబోయే సినిమా జాబితాలో కొత్తగా ఇప్పుడు జూనియర్ ని కూడా ఎంపిక చేసి తన సినిమాని మరో మెట్టు ఎక్కించినట్టే అనుకుంటున్నారు ఎన్టిఆర్ అభిమానులు. ఎన్గీఆర్ కనిపించేది కొద్దిసేపే అయినా అది సినిమాకి ఖచ్చితంగా ఒక ఊపుని తెస్తుందని భావిస్తున్నారట.

అయితే ఇప్పటి వరకూ ఎన్టిఆర్ యోధుడుగా కనిపించిన సినిమాలు ( శక్తీ, దమ్ము) బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మరి ఈ సెంటిమెంట్ జక్కన్న కి గుర్తుందో లేదో మరి, లేదంటే ఆ నమ్మకం తప్పని నిరూపించదలిచాడో గానీ మొత్తానికి మరోసారి ఎన్టిఆర్  కత్తి తిప్పనున్నాడన్న మాట.

English summary
rajamauli add juniar to the starcast of bahubali 2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu