»   » ప్రముఖ డైరెక్టర్ తో విడిపోయిన భార్య మరొకరితో డేటింగ్!

ప్రముఖ డైరెక్టర్ తో విడిపోయిన భార్య మరొకరితో డేటింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సినిమాలు చూసే వారికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్య కశ్యప్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బొంబాయి బాంబు పేలుళ్లు గూర్చి తీసిన బాలీవుడ్ మూవీ 'బ్లాక్ ఫ్రైడే' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్, దాని తరువాత నో స్మోకింగ్, దేవ్ D, గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సెపూర్, బాంబే టాకీస్, అగ్లీ, బాంబే వెల్వెట్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్, నటుడిగా ఇలా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి.

ఆయన సినిమాల సంగతి పక్కన పెడితే... మొదటి భార్య ఆర్తి బజాజ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కల్కి కోచ్లిన్‌ని 2011లో పెళ్లి చేసుకున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన 'దేవ్ డి' చిత్రం ద్వారా పాండిచ్చేరికి చెందిన ఈ ఫ్రెంచి సంతతి భామ సినిమా రంగంలో అడుగు పెట్టింది. అలా అనురాగ్ కశ్యప్‌తో ఏర్పడిన పరిచయం కాస్త కల్కి కోచ్లిన్‌ అతన్ని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. రెండేళ్ల కాపురం తర్వాత అనురాగ్ కశ్యప్-కల్కి కోచ్లిన్ విడిపోయారు.

Is Kalki Koechlin dating with Jim Sarbh?

అప్పటి నుండి సింగిల్ గానే ఉంటూ బాలీవుడ్లో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కల్కి కొచ్లిన్. గతంలో ఆమెకు పలువు యాక్టర్లతో లింకప్ ఉన్నట్లు గాసిప్స్ విపినించాయి. ప్రస్తుతం ఆమె జిమ్ శరబ్ అనే నటుడితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Is Kalki Koechlin dating with Jim Sarbh?

ఇటీవల విడుదలైన 'నీర్జా' అనే సినిమాలో జిమ్ శరబ్ కరడుగట్టిన టెర్రరిస్టుగా నటించాడు. కల్కి, జిమ్ మధ్య రిలేషన్ షిప్ చాల దూరం వెళ్లిందని, ఎక్కడికెళ్లినా కలిసే వెలుతున్నారని, రోజుల తరబడి కలిసే గడుపుతున్నారని టాక్. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా కల్కి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేస్తోంది. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అంటున్నారు ఈ ఫోటోలు చూసిన బాలీవుడ్ జనాలు.

English summary
Kalki Koechlin has been in news for her link-ups with actors for some time now. Recently separated Farhan Akhtar was rumoured to be dating the Dev D actress. She was also linked to Gulshan Devaiah. However, according to a report in Scoopwhoop, Kalki has been dating the latest talent introduced in Bollywood, Jim Sarbh, who played Khalil in Neerja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu